ముందుమాట

కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలుపాత్రికేయులు, బుల్లితెరవెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.

వసుంధరతో సంభాషించండి

ఇతర పేజీలు:

సాహితీ సమాచారం  సాహితీవైద్యం  పుస్తకాలు   మన కథకులు   మన పత్రికలు మన పాత్రికేయులు  విద్యావేత్తలు  వసుంధర   Flat Forum

206 comments on “ముందుమాట

 1. Devendar says:

  బాహుబలి – మై కంక్లూజన్ #wkkb ( కథల పోటీ )

  థియేటర్ నుండి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడి మదిలో, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ” అనే ప్రశ్న ఉందన్న విషయం అందరికి తెలిసిందే. నిజానికి, ఇప్పుడు ఆ ప్రశ్న ఒక సంచలనం. ఆ ప్రశ్నకు సమాధానం బాహుబలి – The Conclusion లో రాజమౌళి ఇవ్వనున్నారు.

  మీరే రాజమౌళి అయితే, బాహుబలి కథ మీరే రాసినట్లయితే, “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? శివగామి చేసిన తప్పు ఏంటి? భల్లాలదేవ కిరాతకుడిగా ఎందుకు తయారయ్యాడు? బాహుబలి ముగింపు ఏంటి?

  ఈ నేపధ్యం లో 3000 పదాలు మించకుండా ఒక కథ రాయండి.

  మీరు పబ్లిష్ చేసే కథ తెలుగు లో లేదా ఇంగ్లీష్ లో ఉండాలి.

  స్వయంగా కహానియా.com (https://kahaniya.com) లో పబ్లిష్ చేయాలి. టెక్నికల్ సహకారం కొరకు 9160044559 కి ఫోన్ చేయండి.

  మొదటి అత్యధిక పాయింట్లు వచ్చిన కథ: ₹25,000
  రెండో అత్యధిక పాయింట్లు వచ్చిన కథ: ₹15,000]
  మూడో అత్యధిక పాయింట్లు వచ్చిన కథ: ₹10,000

  https://www.kahaniya.com/contest/baahubali-my-conclusion

  Thanks
  https://kahaniya.com

 2. వాకాటి స్మారక కథల పోటీ

  వాకాటి స్మారక కథల పోటీవాకాటి పాండు రంగారావు స్మారక కథలపోటీకి సమకాలీన, చారిత్రక, సామాజిక ఇతివృత్తంతో 1500 పదాలకు మించకుండా కథలు పంపండి. కథలకు బహుమతులు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.6వేలు. కథలు jagritiweekly@gmail.com కు మెయిల్కానీ, జాగృతివారపత్రిక, కాచిగూడ, హైదరా బాద్-27కు పోస్టు ద్వారా కానీ పంపండి. చివరి తేదిఆగస్టు 30, 2016. వివరాలకు: 9959997204

 3. నారీ భేరీ మాస పత్రిక email address: naaribheri@gmail.com
  cell: 9492330110

 4. M Ravi Kumar says:

  నవ్య వారపత్రిక Latest kathala పోటీ (ఆఖరుతేదీ ఫిబ్రవరి 2016) ఫలితాలు వచ్చాయా? తెలుపగలరు.

 5. ఉమాదేవి says:

  మీ కొత్త పోస్ట్ లు చూడాలంటే మాకు వీలు పడడం లేదు..సరయిన అడ్రస్ ఇవ్వగలరు..
  ఉమా దేవి

 6. Lakshmi raghava says:

  Upadhyaya kathala poti vivaraalu vasundhara aksharajalam lo kanipinchaledu.
  Mee kathaku bahumati vachchindani April Rachana lo Sahiti vydhyam lo telisindi. Congrats!

 7. ఆర్.దమయంతి. says:

  మిత్రులందరూ ఈ కథల పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాను.
  ఇదిగో, పోటీ వివరాలు గల లింక్.
  http://www.netinizam.com/Downloads/Edition/10-01-2014_1.pdf

 8. కినిగే పత్రిక వారు 28 ఏళ్ళ లోపున్న రచయిత(త్రు)లకు కథల పోటీ పెడుతున్నారు. వివరాలకు ఈ లింక్ చూడ వచ్చు.
  http://patrika.kinige.com/?p=3561

 9. jonnalagadda markandeyulu says:

  ముందడుగు ప్రబోధమే అవుతుంది. ఆలోచించిగాని లేదా అనాలోచితంగాకాని అగాధం చేరాకా ముత్యాలే దొరుకుతాయి. నేలమీదకావచ్చు నీటిలోకావచ్చు దారిదోపిడీకి, మాంసాహరులకు భయపడితేఎలా? వలసపక్షులుకూడ స్థిరనివాసం కోరుకోకుండ నిరంతరప్రయాణం చేస్తూ ప్రబోధాన్నందిస్తున్నాయి.. వేటగాని వలలో చిక్కిన పావురాలు ఆరోపణలు మానుకుని శాంతిపావురాలై ఒక్కటై ఎగిరిమిత్రలాభాన్ని రచించిన నాయకత్వప్రబోధము ఎప్పుడూ గొప్పది. మిత్రవాక్యమెప్పుడూ ఆప్త వాక్యమే! ధన్యవాదములు.

 10. Nandyala laxma reddy saket 54 ph-1 hyd-62 says:

  అఘాదమైన జలనిదిలోఆణిముత్యాలు ఉంటవి
  శోకం మరుగున సుఖం వుంటది
  ముందడుగు వేయాల్సిందే మిత్రమా !
  నంద్యాల లక్ష్మా రెడ్డి

 11. Telugu Cinema News,Reviews,Gossips,AndhraPradesh,Telangana,Hyderabad Political News,Cinema Actress Hot Photos,Galleries,Events…http://www.teluguwow.com

 12. Nandyala laxma reddy saket 54 ph-1 hyd-62 says:

  హేళనగా ! కాదండి
  బదిలీపై వెళ్లక పైరవీలు చేసే ఉద్యోగులను చూసి
  అలా అన్నాను
  వేరేగా భావించ కండి

 13. Jonnalagadda Markandeyulu says:

  దశ, దిశ బాగోలేదని నూతిని మూసేస్తే సమాధికప్పల గోడు వినాలిగాని హేళనేల!
  ఉద్యోగికి దూరభూమి, విద్వాంసునకు పరదేశము ఉండవు కవివర్యా!

  • jonnalagadda markandeyulu says:

   ముందుఅడుగు భూమి మీద ఆనితేనే వెనక అడుగు ముందడుగు అవుతుంది.
   సమతల ప్రదేశంలో కూడా ఈ జాగ్రత్త అవసరము. వెనకడుగు ఆలోచింపజేయాలి.
   విభజన ప్రయాణము ముందున్నది సమతల ప్రదేశమో అగాధమో తెలియదు.
   ముందడుగు, వెనుకడుగు లేని అగాధం నూతికప్పకు పైరవీలు తెలిస్తేమంచిదే!
   నూతిలోనే జీవితం సుఖం దానికలవాటు. ఉభయచరము గా నేలమీద ఉండగలదా?
   అగాధమైన జల నిధిలోపడినా ఆణిముత్యాలశాల నిర్మించి సుఖించే శక్తితెచ్చుకోవాలి
   ముందడుగు వేయాలన్నది మీ ప్రబోధమైతే స్వాగతించాల్సిందే!

 14. నండూరి సుందరీ నాగమణి says:

  facebook లోని ‘కథ’ అనే గ్రూప్ వారు కథలపోటీ నిర్వహిస్తున్నారు వివరాలకు: https://www.facebook.com/photo.php?fbid=847888785221294&set=gm.536423913152529&type=1&theater ఈ లింక్ ను క్లిక్ చేయాలి.

 15. Nandyala laxma reddy saket 54 ph-1 hyd-62 says:

  భ్రమణ యోగులు
  1. భూమి తిరుగుతుంది
  చంద్రుడు తిరుగుతున్నాడు
  అట్లాగే నవగ్రహాలు
  సూర్యుని చుట్టూ
  పరిబ్రమిస్తూ
  ప్రసాదిస్తున్నై మనకు
  రాత్రి పగళ్ళను
  2. మృగాలు వేటకు
  పక్షులు వలసలకు
  వెడుతూ వుంటవి
  తమ తమ
  గుహలను, గూల్లను వదిలి
  సుదూర తీరాలకు
  కొత్త కొత్త ప్రాంతాలకు
  3. కార్మికులు
  కర్షకులు
  విద్యార్థులు
  మహానుభావులు
  ఎందరో …!
  మహానుభావులు
  వెడుతుంటారు
  దేశ విదేశాలకు
  బ్రమన యోగులై
  పొట్ట కూటికి
  4. హైదరాబాదీయులు
  ప్రభుత్వ ఉద్యోగులు
  కొందరు
  కదలరు మెదలరు
  దశాబ్దాలకు దశాబ్దాలు
  బదిలీపై వెళ్లక
  ఒకేచోట వుందురు
  నూతిలోని కప్పలు
  —–X——–
  (రాష్ట్ర విభజన అనతరం
  సమష్య గా మారిన ఉద్యోగుల
  విభజనలకు స్పందిస్తూ ..)

  (నంద్యాల లక్ష్మా రెడ్డి
  హైదరాబాద్ -62)

 16. బి వి లక్ష్మీనారాయణ says:

  చాలా మంచి కృషి……మీకు అభివాదాభివందనాలు

  • ధన్యవాదాలు. మీవంటివారి ప్రోత్సాహం, భాగస్వామ్యం ఈ వేదికకు పుష్టినిస్తున్నాయి.

 17. SV KRISHNA says:

  VASUNDHARA gaariki…
  నమస్కారములు.

  మీ సూచనకి ధన్యవాదాలు.
  విండోస్ 7, విండోస్ 8, ఆ తర్వాతా upgrades కి ఎప్పటికప్పుడు మారితే అప్ టు డేట్ గా ఉంటుందేమో కాని, కొన్ని సాంకేతిక ఆవశ్యకతల దృష్ట్యా మేము ఎక్స్.పీ. ని వదులుకోలేని పరిస్టితి లో వున్నాము.

  మీరు తెల్పినట్లుగా ఫైర్ ఫాక్స్ ఉపయోగించి ప్రయత్నించాము. ప్రస్తుతానికి మా సమస్య పరిష్కారం అయ్యింది.
  గూగుల్ క్రోమ్ వాడే వాళ్ళందరికీ ఇలాంటి సమస్యే ఎదురవుతుందో, లేదో మాకు తెలియడం లెదు. మాకు కూడా కేవలం అక్షరజాలమ్ సైట్ లోనే సమస్య వచ్చింది. మరో సైట్ లో ఎటువంటి సమస్య ఎదురు కాలెదు.

  సాహిత్యపరంగానే కాకుండా సాంకేతికపరంగా కూడా మీరు అందిస్తున్న సహకారానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ…
  with regards…
  SV KRISHNA, M.Sc.
  Writer & Publisher

  • ముఖ్యంగా అనూ-6 గురించి మాకూ xp వాడకం తప్పనిసరి. ఇంటర్నెట్ కోసం మా లాప్‍టాప్‍లో windows 7 కూడా లోడ్ చేయించాం. మీరూ అలా చెయ్యొచ్చు. ఎందుకమ్టే మున్ముందు సమస్య రావచ్చు. microsoft వారు technical support ఈ ఎప్రిల్ నుంచి ఉపసంహరించుకుని ఆ విషయం పత్రికాముఖంగా తెలియబర్చారు. పనిచెస్తే మన అదృష్టం. లేకుంటే- చెయ్యగలిగింది లేదు.

 18. SV. KRISHNA says:

  VASUNDHARA gaariki…
  నమస్కారములు.

  ఎప్పటికప్పుడు సాహితీ రంగం లోని పత్రికా ప్రకటనలను రచయితలకు అందజేస్తూ మీరు చేస్తున్న సాహితీసేవకు నా హృదయపూర్వక ధన్యవాదాలు… అభినందనలు.

  నేను ఈ మెయిల్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటె …
  ఇంతకుమునుపు మీరు అప్లోడ్ చేస్తున్న పోటీ ప్రకటనలను క్లోజ్ అప్ లో చూడాలని క్లిక్ చేసినప్పుడు అవి పెద్దగా, స్పష్టంగా కన్పించి చదివేందుకు వీలుగా ఉండేవి.
  అయితే… రెండు నెలలుగా మీరు అప్లోడ్ చేస్తున్న పోటీ ప్రకటనలు క్లోజ్ అప్ లో చూడాలని క్లిక్ చేసినప్పుడు అవి పెద్దగా, స్పష్టంగా కనిపించకుండా ఎర్రర్ అని చూపిస్తూ ఒక మెసేజ్ వస్తోంది. అందువల్ల ఆయా ప్రకటనల్ని చిన్న ఇమేజ్ గా చూడగలుగుతున్నామే కాని, వాటిని క్లోజ్ అప్ చేసుకొని అందులోని మేటర్ ని చదవలేక పొతున్నాము.

  స్క్రీన్ పై కనిపించే ఆ ఎర్రర్ మెసేజ్ ని యధాతథంగా ఈ మెయిల్ తో పాటు అటాచ్ చేసి పంపిస్తున్నాను.
  ఈ సమస్య మాకు మాత్రమె కలుగుతుందో, లేక మరికొందరు కుడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారో అన్న విషయం మాకు తెలియడం లెదు.

  ఏది ఏమైనా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువచ్చి మీనుంచి పరిష్కార మార్గం తెలుసుకుందామని మీకు మెయిల్ చెస్తున్నాను.

  దయచేసి ఈ సమస్యకి పరిష్కారం తెలుపగలరు.

  with regards…
  SV KRISHNA, M.Sc.
  Writer & Publisher

  • మీరు వాడేది windows xp ఐతే ఈ ఏప్రిల్ నుంచి దానికి technical support పోయింది. windows 7 ఐతే browser మార్చి చూడండి. మాకు google chrome బాగానే పని చేస్తోంది. firefox, explorer, google chromeలలో ఏదో ఒకటి పని చేస్తుందని మా ఉద్దేశ్యం. ప్రయత్నించి చూడండి.

 19. నవ్య వారు కథల పోటీ ప్రకటించారు. వివరాలు ఇవి:
  http://www.navyaweekly.com/2014/jun/4/Bcover.asp

 20. అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

  జూలై 3,4,5 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే 13 వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం ఆటా నిర్వాహకులు సాహిత్య పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల మంది రచయితలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు.
  ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 4,5 వ తేదీలలో ఆటా మహాసభల ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద బహుమతి ప్రదానం జరుగుతుంది.
  ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వోల్గా, అఫ్సర్, శంకగిరి నారాయణ స్వామి, వంశీకృష్ణ గార్లకు ఆటా మహాసభల సమన్వయ కర్త పర్మేష్ భీంరెడ్డి గారు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు.

  కథల విభాగం:

  మొదటి మూడు బహుమతులు ($116):
  మేస్ట్రుబాబు మరినేరు! – డా.చింతకిందిశ్రీనివాసరావు (విశాఖపట్నం)
  విముక్త – వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్)
  ఇప్పుడే అందిన వార్త – పెద్దింటి అశోక్ కుమార్ (కరీంనగర్)

  కన్సొలేషన్ బహుమతులు ($58):
  ఇప్పుడైనా చెప్పనీయమ్మా – జి. ఎస్ లక్ష్మి (హైదరాబాద్)
  సర్వం శ్రీజగన్నాథం – ఆనందరావు పట్నాయక్ (రాయగడ)
  చందమామోళ్ళవ్వ – రాధ మండువ (చిత్తూరు)
  అరచేతి చాటు సూర్యుడు – రాజేష్ యాళ్ల (విశాఖపట్నం)

  కవిత్వ విభాగం:

  మొదటి మూడు బహుమతులు ($116):
  నాలాగే నువ్వూ – మొహన తులసి (చికాగో)
  వలసపక్షి – నిషిగంధ (ఫ్లోరిడా)
  వీడ్కోలు వేళ – స్వాతీ కుమారి బండ్లమూడి (తిరుపతి)

  కన్సొలేషన్ బహుమతులు ($58):
  మౌనశిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ (విశాఖపట్నం)
  దుబ్బ కాళ్ళు – అన్నవరం దేవేందర్ (కరీంనగర్)
  సెల్ఫీ – తైదల అంజయ్య (కరీంనగర్)
  పరిమళ భరిత కాంతి దీపం – పెరుగు రామకృష్ణ (నెల్లూరు)

  వ్యాసాల విభాగం:
  బహుమతులు ($116):
  అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం – డా. తన్నీరు కళ్యాణ్ కుమార్ (గుంటూరు)
  ఆ ముప్ఫై గంటలు – దాసరి అమరేంద్ర

  • మీకు ధన్యవాదాలు. ఈ సమాచారాన్ని అక్షరజాలం టపాగా కూడా అందిస్తున్నాం.

 21. వసుంధర గారికి నమస్సులు.
  “జేగంటలో మీ పరిచయం చూసాం. మా ఛానెల్ ప్రతి నెలా ఓ సాహితీ ప్రతిభామూర్తిని ఎన్నుకుని పరిచయం చేస్తుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఈ నెలకి మిమ్మల్నెన్నుకున్నాం. మీకెప్పుడు వీలో చెబితే, మా బృందం మీ ఇంటికొస్తుంది…”సాహితీ ప్రతిభా మూర్తి కథలోని ఈ చివరి వాక్యాలు
  ఆధునిక ప్రతిభా కశ్మల వ్యవస్థపై కశా ఘాతాలు. అభినందనలు. -డా.తాడేపల్లి పతంజలి

 22. వసుందర గారూ
  ‘గుర్తింపు’ కథ ఎందఱో రచయితలకి మార్గదర్శకం. నిజమే మనం గుర్తింపు కోరుకుంటాం ఒక దశ వరకూ…వయసులో జ్ఞానం పెరిగినట్టే క్రమంగా అన్నిటినీ అధిగామిస్త్తాం. ‘ద్వారకా’గారు ఎప్పుడూ అనేవారు మన పని మనం చెయ్యాలి ఫలితం ఆశించవద్దు అని.ఆయనకు గుర్తింపు సరిగారాలేదు అని చిత్తూరు జిల్లా రచయితలందరూ బాధపడటంతప్పించి ఆయనది చిరునవ్వే అన్నిటికీ….. ఏమైనా మీ సమాధానం తో మనసు కొంత ఊరట చెందింది. ధన్యవాదాలు.
  లక్ష్మి రాఘవ

 23. వసుంధర గారూ ,
  ‘మన కథకులు’ శీర్షికలో గతంలో ద్వారకా’ అని కలంపేరుకలిగిన సిహెచ్. వెంకటరత్నం అన్నరచయిత వివరాలు వున్నాయి. 84 వయసు లో ఈ రోజు [13-1 2014] తిరుపతి లో గుండెపోటుతో మరణించారని తెలియచేయడానికి చింతి స్త్తూ వున్నాను.
  గత యాభైయే ళ్ళు గా రచనలు చేస్తున్నారు . వీరి నవల’ పల్లెపిలిచింది’ ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో[1989] రెండవ బహుమతి పొందింది.చిత్తూరు జిల్లానుండి వెలువడే ‘ ‘ఆలోచించండి’ అన్న సామాజిక పత్రిక సంపాదకులు.
  ‘సుఖాల తీరము’ ఆకాశంబున నుండి’ అన్న కథాసంపుటలు ప్రచురింపబడి వున్నాయి.
  సాహితీ ప్రపంచం గుర్తించని ఆణిముత్యం ఈయన.

  లక్ష్మిరాఘవ

  • మా అభిప్రాయంలో కథకులకి గుర్తింపు పత్రికల్లో ప్రచ్రించబడిన వారి రచనలే. అవార్డులకూ, సన్మానాలకూ రచనల విశిష్టతకు మించిన ఇతర కారణాలుంటాయి. మీకు తెలుసునో లేదో- సాహితీపరులకు గుర్తింపునిచ్చే ప్రభుత్వ సంస్థల కమిటీ సభ్యులు పత్రికలు చదవరు. గుర్తింపు విషయమై 1991లో ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన మా కథ గుర్తింపు కి ఇక్కడ లంకె ఇస్తున్నాను. http://aksharajalam.files.wordpress.com/2014/01/gurtimpu-6-3-1991.pdf చదివి మీ అభిప్రాయం చెప్పండి.

   • vasundhara gariki  namaskaaramulato…  sankranti subhaakankshalu.

    Gurtinpu katha chadivaanu. Chala Bagundi.  Chivari paragraph ee kathaki praanam. Pramukha rachayataga gurtimpu raaledani bhaavinche rachayatalandarikee idi  jnanodayam kaliginche katha.

    Pasupuleti Tatarao

 24. గో తెలుగు డాట్ కాం వారు నిర్వహించిన కథల పోటీ ఫలితాలు ప్రకటించబడినవి. వివరాలకు ఈ లింక్ చూడాలి…
  http://www.gotelugu.com/issue40/1123/telugu-columns/gotelugu-story-competetion-results/

 25. eswar says:

  Chaala baagundhi

 26. నవ్య దీపావళి సంచిక నెట్ లో అప్ లోడ్ అయిందని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈ లింక్ తెరిస్తే పుస్తకం దొరకని నావంటి సాహితీ ప్రియులు హాయిగా మంచి కథలన్నీ చదువుకోవచ్చు.
  http://www.navyaweekly.com/2013/dipawali/index.asp

 27. కినిగె వారి కొత్త జాల పత్రిక. http://patrika.kinige.com/

 28. కినిగె.కాం వారు నవలల పోటీ ప్రకటించినారు. వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయాలి. http://teblog.kinige.com/?p=2976

 29. TVS SASTRY says:

  ‘అమ్మతనం’లోని ‘కమ్మతనం’గురించి చిత్రించిన అత్యద్భుత పదచిత్రం అమ్మతనం కథ.ఈ కథ నేను కూడా చదివాను.ఒక చక్కని అనుభూతిని పొందాను.పాత్రల మనస్తత్వ విశ్లేషణ గురించి వసుంధర గారు చక్కగా వివరించారు.అమ్మతనం లాంటి మరొక్క చక్కని కథను వ్రాసిన వసుంధర గారికి అభినందనలు!

  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *