కవితల పోటీ- ఎక్స్‌రే

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…
జాతీయ స్థాయి ఎక్స్ రే అవార్డుకు కవితలు ఆహ్వానం
నిరంతర సాహిత్య పాఠశాలగా వెలుగొందుతూ రజతోత్సవాల్ని పూర్తి చేసుకున్న “ఎక్స్ రే” జాతీయస్థాయి అవార్డుకు కవితలను ఆహ్వానిస్తున్నది. ప్రథాన అవార్డుకు ఎంపికైన కవితకు పదివేల రూపాయల నగదుతోపాటు జ్ఞాపిక, సత్కారము, మరో పది కవితలకు ఉత్తమ కవితా పురస్కారాలు ఇవ్వబడతాయి. చారిత్రక వికాసాన్ని క్రమ పద్ధతిలో పదిలపరిచే ఈ ప్రయత్నంలో కవులు పాల్గొని సహకరించగలరు. కవితలు అక్టోబరు 31వ తేదీలోగా పంపవలెను.
వివరాలకు సెల్: 98484 48763
(ఉజ్వల మాసపత్రిక సెప్టెంబర్ సంచిక 72వ పేజిలో వచ్చిన ప్రకటన) 

0 thoughts on “కవితల పోటీ- ఎక్స్‌రే”

 1. అన్నీ బాగానే వున్నాయి కాని, అరిపిరాల సత్యప్రసాద్ గారు ఒక ముఖ్య విషయం తెలపడం మర్చిపోయినట్లున్నారు.
  ఏమిటంటే… ఈ ఎక్స్ రే పోటీ లో పాల్గొనే నిమిత్తం కవిత పంపే ప్రతివొక్కరు తమ కవితతో పాటు రూ.75 కూడా పంపవలసి వుంటుంది. ఈ పోటీ లో పాల్గొనేవారు ఈ విషయం గుర్తించి “పోటీలో పాల్గొనడం ఉచితం కాదు” అని గమనించగలరు.
  – vamsy

  1. హాయ్ వంశి గారు,ఇది నేను బాగా ఇష్టపడే ఫిలిం డైరెక్టర్ వంసిగారైతే సర్ నిజంగా మీకు ఇలా ర్స్తున్నందుకే నాకు చాల ఆనందంగా వుంది.నేను ఈ మధ్య కాలంలోనే కవితలు ,కథలు రాస్తున్న అందరు,చంతబ్భై శ్రీలక్ష్మి అని పిలిచి నన్ను అతపట్టిస్తున్నారు.ఒకసారి బాధ పడ్డ రాయడం ,పోటిలకు పంపడం మానడంలేదు.
   నాకు మీ ఆశిస్సులు కావాలి.

   సాగి సుధా

 2. కవితల పోటీకి డబ్బులు పంపాల్సిన అవసరమేముందీ. ఎలా పంపాలి? ఎక్కడా ప్రస్తావించలేదు కదా? ఎలా తెలుస్తుంది?

  1. ఈ ప్రశ్న మీరు నన్ను మాత్రమె కాదు, ఈ కవితల పోటీ “ప్రకటన” అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారిని కాని, ఈ బ్లాగ్ నిర్వాహకులు గౌ. వసుంధర గారిని కాని అడిగితే సమాధానం దొరక్కపోవచ్చు. “కవితల పోటీకి డబ్బులు ఎందుకు పంపాలో, ఎలా పంపాలో, ప్రకటనల్లో ఎక్కడా ఈ డబ్బుల విషయం ఎందుకు ప్రస్తావించ లేదో”… పాతికేళ్ళుగా సాహిత్యసేవ చేస్తున్న సాహిత్య పోషకులు, “ఎక్స్ రే” సంస్థ యజమాని ‘శ్రీ కొల్లూరి” గారే తెలుపగలరు. ఆయనకి ఫోన్ చేస్తే మీకు అన్నివివరాలూ తెలుస్తాయి, అర్థమవుతాయి. ఆయన ఫోన్ నంబర్ : 9848448763 అల్ ది బెస్ట్.
   అన్నట్టు చంద్రం గారు… మీ బ్లాగ్ డిజైనింగ్ చాలా బాగుంది. అందులో అన్ని సెక్షన్ లు త్వరలో ఫిల్ అప్ చేయండి..
   – vamsy

  2. 
వంశీ గారికి,
   కృతజ్ఞతలు. నా బ్లాగు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. అచ్చమైన తెలుగు పత్రికలా చదవడానికి హాయిగా ఉండేలా వెబ్ పత్రికని తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను. కొన్ని టెక్నికల్ ఇబ్బందుల్ని అధిగమించాలి. కొన్ని పేజీలు రీప్లేస్ అవాలి. మీ సలహాలు సూచనలు అందచేస్తే సంతోషిస్తాను.
   -చంద్రం

 3. సుధ గారు…
  మీ ఉత్సాహానికి అభినందనలు. మీరు భావిస్తున్నట్లుగా నేను ‘సినిమా వంశీ’ ని కాను. ఏదో కాస్త సాహిత్యం పట్ల ఆసక్తీ, అభిమానం ఉన్నవాడ్ని. నా సమాధానంతో మిమ్మల్ని నిరుత్సాహపరిస్తే… ఐ యాం సారీ. నిజమెప్పుడూ ఇలా చేదుగానే వుంటుంది మరి.
  “ఈ మధ్యే కథలు, కవితలు రాస్తున్న”0దుకు మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. నిజానికి మీవంటి వారే మన తెలుగు భాష ని ముందు తరాలకి అందిస్తున్నారు. అందుకు మీరు ఎంతో గర్వపడాలి,
  ఇక మిమ్మల్ని ఆటపట్టిస్తున్న వాళ్ళంతా మిమ్మల్ని అభినందించడం చేతకానివాళ్ళే. “ఒక వ్యక్తిని అభినందించ డానికీ, చేసిన తప్పు ని ఒప్పుకొని క్షమాపణ అడగటానికీ ఎంతో సంస్కారం కావాలి.” వాళ్ళని చూసి జాలి పడండి… చాలు. మీరు మాత్రం రాయడం, పోటీలకు పంపడం ఆపొద్దు.
  నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా!
  – వంశీ

  1. సర్ , చాల థాంక్స్ . మీరు రాసింది చూసి నేను బాధపడలేదు. పైగా నాకు మీరు తిరిగి జవాబు ఇవ్వడమే ఒక గొప్ప అదృష్టం. నన్ను ప్రోత్సహించినందుకు చాలా థాంక్స్ సర్. చదివే వాళ్ళు లేకపోయినా , నేను కథలు రస్తూనె వున్నాను సర్. ఏదో ఒక రోజు కనీసం సాధారణ ప్రచురనకైనా వాళ్ళు స్వీకరిస్తారని పంపుతున్న. ప్రస్తుతం అమెరికాలో వుండటం వాళ్ళ అన్నింట్లోను పాల్గొనలేక పోతున్న ఒక్కసారి అక్కడికి వస్తా ఇంకొంచం అవకాసం బాగా ఉండచ్చు.మల్లి చాల థాంక్స్ సర్.

 4. డబ్బు కట్టి కవితలు పంపాలి అన్నది సరియినదేనా ?
  మంచి కవితలు కావాలా ? డబ్బు కావాలా ? ఎంతమంది డబ్బు కట్టి పంపుదా ము అనుకుంటారు?
  ఇవి ఆలోచించాల్సిన విషయాలు కావా?
  ఇలా అడుగుతున్నదుకు ఏమీ అనుకోకండి ..నాలా అడగాలని ఎవరూ అనుకోర ? ఆలోచించండి

  1. పుస్తకం కొని చదవాలనుకోని పాఠకులు మనకి ఎక్కువ. సాహిత్యంమీద డబ్బు ఖర్చు చెయ్యడానికి వెనుకాడేవారు మనకి ఎక్కువ. పత్రికలకి మనుగడ క్లిష్టమౌతున్న భాష మనది. పోటీలకి డబ్బు కట్టమనడాన్ని అనుసరించలేము, సమర్ధించలేము కానీ అర్థం చేసుకోగలం. షరతు నచ్చకపోతే పోటీలో పాల్గొనకపోవడం మంచి పద్ధతి. ఐతే ఎక్స్‌రే మంచి పత్రిక. అ పత్రిక నిర్వహించిన పోటీల్లో మంచి కవితలు ఎన్నికౌతున్నాయి. చందా మొత్తం (ఏడాదికి 75 రూపాయలు) ఎక్కువ కాదు. మేము గతంలో ఎప్పుడో చందాదారులుగా చేరి పత్రిక సక్రమంగా అందక- విరమించుకున్నాం. కవితల్ని ఇష్టపడేవారు- ఆ మాత్రం ఎక్కువ కాదనుకుంటే తప్పక చందాదారులుగా చేరవచ్చు. ఇది మేము మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం.

 5. వసుంధర గారూ ,
  థాంక్యూ వెంటనే సమాధానం రావడం అంతర్జాలనికే అందం..మాకు ఆనందం.
  .నిజమే 75 రూపాయలు ఎక్కువకాదు ..ఈనిబందనతో కొన్ని మంచి కవితలని కోల్పోతారనుకున్నను. ఏదో కవితపోస్టు చెయ్యచ్చు అనుకుంటాము దానికి తోడూ మనియార్డరు కూడ చెయ్యలికద అని బద్దకిన్చావచ్చు కూడ..
  ఇష్టం లేకపోతె మానెయ్యండి అన్న మీ మాటతో ఏకీభవిస్తాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *