సాహితీవైద్యం

రచన మాసపత్రికలో నిర్వహించబడుతున్న సాహితీవైద్యం శీర్షిక కథకుల ప్రయోజనానికి ఉద్దేశించబడింది. అక్షరజాలంలో ఈ శీర్షిక- మా అనుభవం, అవగాహనల ఆధారంగా, మా పరిమితులకు లోబడి సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలకూ అంటే కథ, నాటిక, వ్యాసం, కవిత, టీవీ సంభాషణలు, సినిమా సంభాషణలు వగైరాలకి వేదిక కాగలదని ఆశిస్తున్నాం. విశ్లేషణకీ, ప్రచురణకీ రచనలు పంపేవారు వ్రాతప్రతుల్ని లేఖిని స్క్రిప్టులో టైపుచేసి పంపవలసి ఉంటుంది.
ప్రస్తుతం టీవీలో తెలుగు ఛానెల్సు చాలా ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి. అన్నీ తెలుగు సీరియల్సుకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఎంతోమంది రచయితలకి వాటికి సంభాషణలు వ్రాసే అవకాశం రావచ్చు. టీవీ, సినిమా సంభాషణలకి మామూలుగా కథలకి వ్రాసినట్లు కాక, కాగితాన్ని సగానికి మడతపెట్టి వ్రాయాలి. మచ్చుకి అమ్మమ్మ.కాం సీరియల్ కోసం మేము వ్రాసిన మొదటి ఎపిసోడ్ సంభాషణల వ్రాతప్రతిని ఇక్కడ చూడగలరు. దర్శక నిర్మాతలు వీటిలో కొన్నింటిని మాత్రమే ఉపయోగించుకున్నట్లు సీరియల్ చూసినవారు గ్రహించగలరు.

ఈ నెల రచన మాసపత్రిక సాహితీవైద్యంలో- కథా కమామీషూలో ప్రస్తావించిన పేరులొ ఏముంది కథ, టూకీగా ప్రస్తావించిన ఆకునూరి మురళీకృష్ణ 3 కథల కొసం ఇక్కడ క్లిక్ చేయండి. chandraharam manvadena ninnu_ninnuga

ఇంకా ఈ శీర్షికలో విశేషాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

24 thoughts on “సాహితీవైద్యం

 1. కర్లపాలెం హనుమంత రావు  0  0

  వసుంధర గారికి నమస్కారం.
  నేను నిన్ననే అందుకొన్న ఆగష్టు 2015 లోని మీ సాహిత్య వైద్యంలో ‘ఆంధ్రోడు..’ అదిరింది సార్! వర్తమాన సామాజిక వెంగళాయితనంమీద మీరు ధారావాహికంగా సంధిస్తూ వస్తున్న వ్యంగ్యాస్త్రాలన్నీ ఒక ఎత్తు.. ఈ ఒక్క ‘ఆంధ్రోడు..’ ఒక్కటే ఒక ఎత్తు! ఆగల్పికను టైపు చేసి నా బ్లాగులో ఉంచాను.. మరింతగా అంతర్జాల పాఠకులకు అందుబాటులో ఉండేందుకు. మీకు నిండు మనసుతో నమస్కారాలు.. ధన్యవాదాలు!

  Reply
 2. Prasuna Ravindran  0  0

  వసుంధర గారూ, నమస్తే. మీ కొత్త వెబ్‍సైటు బాగుంది. కానీ, వివిధ పత్రికల వారూ, సంస్థల వారూ నిర్వహించే కథలు, కవితల పోటీల వివరాలు మీరు ఇదివరకు వర్డ్ ప్రెస్స్ బ్లాగులో ఎప్పటికప్పుడు పొందుపరిచేవారు. చాలా ఇన్ఫర్‍మేటివ్గా ఉండేది. ప్రతి రోజూ మీ బ్లాగులో ‘కథల పోటీలు’ సెక్షన్ చూసేదాన్ని. మరి ఇందులో కూడా ఆ పేజీ పెడతారా?

  Reply
  1. వసుంధర   0   0

   అన్నీ ఎప్పటిలాగే కొనసాగుతాయి. డిసెంబర్ 13న నవ్య కథల పోటీ సమాచారం ఇచ్చాం. చూడలేదా?

   Reply
 3. darbha lakshmi annapurna  0  0

  వసంధరగారికి నమస్కారములు!
  రచన పత్రిక ఆగిపోలేదన్న విషయం చాలా ఆనందాన్ని కలిగించింది.హైదరాబాద్ లో వుండేవారిద్వారా విన్న ఆ మాట ఈ నెల నాకు రచన పత్రిక పోస్ట్ లో అందకపోవటంతో నిజమేనేమో అనుకున్నాను.రచనకి నేను చందాదారుని .
  పరామర్శ చెయ్యటంలో ఆలశ్యం గురించి వచ్చిన మీ కధ మనస్సుని చురుక్కుమని తాకింది!
  ధన్యవాదములతో
  దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

  Reply
 4. darbha lakshmi annapurna  0  0

  vasundharagaariki namaskaaramulu!
  RACHANA PATRIKA AAGIPOYIMDANI TELISIMDI.ADE NIJAMAYITE CHAALAA BADHAAKARAMAINA VISHAYAM.
  VIBHINNAMAINA ,MANOVISLESHANAATMAKA RACHANALANI AMDIMCHE PATRIKA RACHANA!
  MUKHYAMGAA AMDULO VACHCHE SAAHITEE VAIDYAMLO MEE VISLESHANA ,SALAHAALOO,SOOCHANALOO MAALAAMTI RACHAYITALAKI EMTO PRAYOJANAKAARIGAA,MAMMALNI MEMU MERUGUPARACHUKUNEMDUKU DAARI CHOOPEVIGAA VUMDEVI!

  Reply
  1. వసుంధర   0   0

   రచన పత్రిక ఆగిపోలేదు. మార్చి సంచిక విడుదలకు సిద్ధంగా ఉంది. మేము ఏప్రిల్ నెలకి సాహితీవైద్యం matter తయారీలో ప్రస్తుతం బిజీగా ఉన్నాము. ఐతే మార్కెటింగ్‍కి సరిన సంస్థ లభించక- ప్రస్తుతానికి కొంతకాలం అన్ని పుస్తకాల షాపులలోనూ లభించదు. చందాదారులకు ఎప్పటిలాగే లభిస్తుంది. ఈ విషయమై ఫిబ్రవరి సంచికలో ఒక ప్రకటన కూడా వచ్చింది. అది మీరు పూర్తిగా చదివితే విషయం తెలుస్తుంది. మీకు పత్రిక ఆగిపోయినట్లు చెప్పినవారికి ఈ విషయం చెప్పండి.

   Reply
 5. umadevi  0  0

  మీరు అందిస్తున్న యీ సేవ విదేశం లొ వున్న మాకు సహకరిస్తుంది ..ధన్యవాదాలు .

  Reply
 6. umadevi  0  0

  నాటా నవ్య కధల పోటీ ఫలితాలు వెలువడ్డాయా !

  Reply
 7. B.Ravikumar  0  0

  వసుంధర గారు,

  నమస్కారం!

  మీకు చాలాకాలం క్రితం సాహితీవైద్యం ద్వారా పరిచయం నాది. ఈ వెబ్ పేజ్ లో సూచించిన అమ్మమ్మ.కాం సీరియల్ లోని మీ మొదటి ఎపిసోడ్ లింక్ పనిచెయ్యటం లేదు. కాస్త చూసిపెట్టగలరా..
  http://edulent.net/Vasundhara/ammammadotcom_introduction.pdf

  ధన్యవాదాలు,

  బి. రవికుమార్

  Reply
  1. వసుంధర   0   0

   ఆరంభంలో అక్షరజాలం ఎడ్యులెంట్ వెబ్‍సైటుకి అనుబంధంగా వచ్చింది. ఆ సైటు తాత్కాలికంగా నిలిపివెయ్యడంతో కొన్ని లంకెలు రావడంలేదు. వీక్షకులు కోరినప్పుడు వాటిని పునరుద్ధరిస్తున్నాం. మీరడిగిన మొదటి ఎపిసోడ్, టివిలో వచ్చిన ఆ సీరియల్ మొదటి ఎపిసోడ్ లంకెలు అమిర్చాము. ఇప్పుడు క్లిక్ చేసి చూడండి.

   Reply
  2. B.Ravikumar   0   0

   ఇప్పుడు పనిచేస్తోంది. చాలా థాంక్సండీ..

   Reply
 8. sharada  0  0

  కథలు ఇతర మాస వార పత్రికలలో ప్రచురింపబడిన తరువాత మీ అభిప్రాయం కావలసిన వారు ఏం చేయవలసి వుంటుంది? ఆ కథ యొక్క కాపీ మీకు పంపించాలా? లేక మీరే సమీక్షకై ఎన్నుకుంటారా? వివరించగలరు
  శారద

  Reply
  1. వసుంధర   0   0

   వీలుంటే కథ కాపీ పిడిఎఫ్ ఫైలుగా మెయిల్ చెయ్యొచ్చు. అక్షరజాలంలో పరిచయం చేస్తున్న పత్రికల సంచికలు మా దగ్గిరుంటాయి కాబట్టి- పత్రిక తేదీ, పేజి నంబరుతో రచన వివరాలు ఇస్తే సరిపోతుంది. రచన ప్రచురించబడిందంటే అది కొందరికి నచ్చిందనే అర్థం. కథకుల ప్రయోజనార్థం మేము రచన మాసపత్రికలో ఇస్తున్న విశ్లేషణను- కేవలం మా అభిప్రాయంగానే గ్రహించాలి తప్ప కథపై తీర్పు కాదని మనవి.

   Reply
 9. Anuradha Puttaparti  0  0

  ఎలమావి తోటల్లో..
  నిగిడారిన నేడల్లో..
  తలిరాకులనుమేసే..
  కొదమ కోయిల లేత పాటలా..
  ఏదో నిశ్శబ్దం..
  నా చిగురుటెడదని మీటుతున్నది..

  పుట్టపర్తి అనురాధ

  Reply
 10. అరిపిరాల  0  0

  వసుంధర గారు,

  తొలి అడుగులు వేస్తున్న నా లాంటి రచయితలకు మీ ఆసరా కొండంత అండ. మీకు అనేకానేక నెనర్లు.

  సాహితీ వైద్యంకోసం కథలు ఏ మైల్ ఐడికి పంపాలి? దయచేసి తెలుపగలరు.

  satyaonline(at)gmail(dot)com

  Reply
  1. వసుంధర   0   0

   మీ స్పందనకు ధన్యవాదాలు. మీ పేరు సుపరిచితంగా తోస్తోంది. మీకు సాహితీవైద్యం అవసరముంటుందనుకోలేం. ఏదేమైనా ఏ కథకైనా సాహితీవైద్యం విశ్లేషణ ముందుగా రచన మాసపత్రికలో వస్తుంది. కథకుల పేర్లు గుప్తంగా ఉంచడానికి పొడి అక్షరాల్లోకి కుదించబడతాయి. రచన మాసపత్రిక అందుబాటులో లేనివారు ప్రత్యేకంగా అడిగితే అక్షరజాలంలోనూ ప్రచురించగలం. కథలు నేరుగా అక్షరజాలానికి పంపవచ్చు. లేదా vasumdhara@gmail.comకి పంపవచ్చు. మామూలుగా pdf files పంపవచ్చు. వ్రాతపతుల్లో సవరణ కోరేవారు మాత్రం, iLeap, baraha software ఉపయోగించాలి.
   వసుంధర

   Reply
 11. ఫణి బాబు  0  0

  మీరు ఆంధ్రభూమి లో వ్రాసిన వయాగ్రామి కథ చదివాను.మీ కథ మీద వ్యాఖ్యలు చేస్తున్నందుకు క్షమించండి.

  కథ చాలా తమాషా గా ఉంది.మీరు శీల గురించి వ్రాస్తూ ఆమెకి నవత ద్వారా ఆ రెండో జంట గురించి తెలిసినట్లు వ్రాశారు.ఎక్కడైనా దాక్టర్ గాని కౌన్సెలర్ గాని తమ పేషెంట్ల గురించి ఎవరికీ చెప్పకూడదు. అది కోడ్ ఆఫ్ ఎథిక్స్ కింద వస్తుంది.అలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే బాగుండేదేమో .

  ప్రతీ సారి అరవయ్యేళ్ళ వారి గురించి వ్రాస్తూ ముసలాయన అనడం బాగా లేదు.

  Reply
  1. వసుంధర   0   0

   వయాగ్రామి కథపై మీ వ్యాఖ్యకి సమాధానం మార్చి రచనలో చూడగలరు.

   Reply
 12. nalinikanthv  0  0

  madam did you verify my novel?you said it will be available in edulent.net
  but i’m unable to find it.
  can you tell me the procedure of accessing the link and where it is kept.?
  thank you

  Reply
  1. From The Editor's Desk   0   0

   కుశలమా?
   వి. నళినీకాంత్, విజయవాడ
   మీరు పంపిన అసంపూర్తి నవల చదివాం. భాష చక్కగా ఉంది. శైలి చదివిస్తుంది. సంభాషణాచాతుర్యం, అర్థవంతమైన విశ్లేషణ కథనాన్ని ఆసక్తికరం చేసాయి.
   ఆరంభంలో లైటు వెలిగింది అన్నాక- లైటునుంచి వచ్చే వెల్తురు అనడానికి బదులు ఆ వెల్తురు అంటే సరిపోతుంది. 11వ పేజీ చివర్లో చురుక్కుమంది అనడానికి చివుక్కుమంది అని వ్రాసారు. కథనంలో అక్కడక్కడ గోచరించిన అనుభవరాహిత్యం కూడా కొత్త పరిమళంతో గుబాళించింది. ఇతివృత్తం పాతదనిపించినా ముగింపులో కొత్తదనానికి ప్రయత్నించండి. మంచి భవిష్యత్తున్న రచయిత మీరు. సమకాలీనుల కథలు, నవలలు ఎక్కువగా చదవండి. నిడివిని స్వాతి నవలానుబంధానికి అనుగుణంగా మలిచి ఆ మాసపత్రిక నిర్వహిస్తున్న అనిల్ అవార్డ్ నవలల పోటీకి పంపండి. మీకు మా శుభాకాంక్షలు.

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield