కథల పోటీలు

By | December 19, 2008

స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డ్  కథల పోటీ
1. నిడివి 10 అర ఠావులు. కాగితానికి ఒకవైపున మాత్రమే వ్రాయాలి.
2. హామీ పత్రం జతపర్చాలి.
3. ముగింపు తేదీ మార్చి 31, 2009.
4. పూర్తి వివరాలకి స్వాతి మాస పత్రిక చూడండి.

పోటీల ఫలితాలు

స్వాతి వారపత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలో రూ. 5000 బహుమతి పొందిన కథలు, కథా రచయితలు:

1. అరవైలో ఇరవై by స్వర్ణా వేణుగోపాల్

2. దేముడి సెల్లు by పిశుపాటి ఉమామహేశ్వర

3. సీతారామాభ్యాన్నమ: by వసుంధర  

4. హరే! శ్రీనివాసా! by దానం శివప్రసాదరావు

విజేతలకు అభినందనలు.

రచన-కౌముది సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు:
telugupeople.com వారి విశేష పురస్కారం పదివేల రూపాయల నగదు బహుమతి పొందిన కథ: “చివరకు మిగిలేది”
రచయిత: ష్రీ తాటిపామల మృత్యుంజయుడు (కాలిఫోర్నియా).
ఇంకా మరో 20 కథలు 1,500 రూపాయల పురస్కారానికీ, 22 కథలు సాధారణ ప్రచురణకీ ఎన్నుకోబడ్డాయి. వివరాలు ఈ లింకు లో లభిస్తాయి: http://koumudi.net/Monthly/2009/april/2009_story_results.html 
వీరందరికీ అభినందనలు.
ఈ కథల ప్రచురణ మే 2009 నుంచి రచన, కౌముది మాసపత్రికల్లో   ప్రారంభమౌతుంది.

0 thoughts on “కథల పోటీలు

  1. వసుంధర   0   0

   famous అనలేము కానీ- చందమామ, అపన, అనేక సాంఘిక పత్రికల్లో మా రచనలు అధిక సంఖ్యలో ప్రచురితమయ్యాయి. మీ ఆసక్తికి ధన్యవాదాలు.

   Reply
 1. తిమ్మగురుడు  0  0

  నవ్య దీపావళి కథల పోటి సమాచారం అందించగలరు , ఇతర కథల పోటీల సమాచారం అందించగలరు .

  Reply
  1. వసుంధర   0   0

   మీ విన్నపాన్ని అక్షరజాలం బాధ్యతగా భావిస్తోంది. ఈ నవంబరు 13కి మేము ఇండియాకి తిరిగి వస్తున్నాం. అంతవరకూ పోటీలు, ఫలితాలు సమాచారం వీక్షకుల సహకారంతో మాత్రమే అందించగలం. ఐతే మాకు తెలిసి నవ్య, స్వాతి కథల పోటీ ఫలితాలు ఇంకా రాలేదు.

   Reply
 2. Murali Mohan Mallareddy  0  0

  వసుంధర గారికి నమస్తే!
  ముందుగా “నూతన సంవత్సర శుభాకాంక్షలు”.
  కొరియర్ ద్వారా పంపిన ‘అదృష్టం’ కథ అంది ఉంటుంది.
  ‘రచన ‘ ఒక్కో నెల మిస్ అవుతుంది.
  కథ పై మీ అమూల్యమైన అభిప్రాయం ఈ సైట్ ద్వారా తెలియజేయగలరు.

  -మీ అభిమాని
  మురళీ మోహన్ మల్లారెడ్డి

  Reply
  1. వసుంధర   0   0

   ముందుగా మీకు మా ధన్యవాదాలు. తదుపరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము నవంబరు 19న అమెరికా వచ్చాము. ఇక్కడ కనీసం 6 నెలలు ఉంటాము. సాహితీ వైద్యం పాఠకులకోసం- అమెరికాలో మా చిరునామా, ఫోను నంబరు వగైరా వివరాలు రచన మాసపత్రికలో లభిస్తాయి. మీ కథ వచ్చినట్లు మాకు సమాచారం అందింది కానీ మీరది మా email address కి attachment గా పంపితేనే ప్రస్తుతానికి విశ్లేషణ సాధ్యం. గమనించగలరు.

   Reply
 3. Murali Mohan Mallareddy  0  0

  Vasundhara gariki Namaste!

  Nootana samvatsara subhakankshalu mundugaa…
  You might have received my story ‘ADRUSHTAM’…
  as I’m not getting ‘Rachana’ regularly, I humbly request you to post your valuable opinion on this site.

  Thank you…Murali Mohan Mallareddy

  Reply
 4. కె. వంశీ కృష్ణ  0  0

  కె. వంశీ కృష్ణ

  అనీల్ అవార్డ్ కధల పోటీ ఫలితాలు ఈ నెల స్వాతి మాస పత్రికలో ప్రచురించారు.
  విజేత: నండూరి శ్రీనివాస్
  కధ పేరు: 100% ఇండిపెండెంట్

  Reply
  1. వసుంధర   0   0

   మాకంటే ముందుగా ఈ సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు. మీనుంచి ఈ తరహా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఈ విశేషాన్ని మేమిక వేరే ప్రకటించడం లేదు. విజేతకు ధన్యవాదాలు.

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield