సంస్కృతం విశిష్టత

By | June 9, 2011

ఈ క్రింది సమాచారం పంపినవారు ఎం. శ్రీదేవి. వారికి ధన్యవాదాలు. ప్రస్తుతం ఇలాంటి సమాచారాన్నీ, విశేషాలనీ పంచుకోవడం భాషకీ, సాహిత్యానికీ, సంస్కృతికీ ఎంతో అవసరం. సహకరించవలసిందిగా అందరికీ మనవి. 
పాలిండ్రోమ్ విషయంలో ఆంగ్లేయులు ‘able was I ere I saw Elba’ అనే వాక్యాన్ని గొప్పగా చెప్పుకుంటారు. ఈ వాక్యం ఎటునుంచి చదివినా ఒకలాగే ఉంటుంది. దీని అర్థం- ఎల్బాని చూసే మునుపు వరకు నేను సమర్థుడిగానే ఉన్నాను. ఎల్బా అనేది ఒక వ్యక్తి పేరు. Ere అంటే మునుపు అనే అర్థం ఉంది. ఇది 17వ శతాబ్దం నాటి వాక్యమని చెబుతుంటారు. ఇదే గొప్పనుకుంటే 14వ శతాబ్దంలోనే దైవజ్ఞ సూర్య అనే ఆయన రామకృష్ణ విలోమ కావ్యం రచించాడు. ఈ కావ్యంలో మొత్తం రమారమి 40 శ్లోకాలు ఉన్నాయిట.
తాం భూసుతా ముక్తి ముదారహాసం
వదేయతో లవ్య భవం దయాశ్రీ
ఇదే వెనకనుంచి మొదటికి చూస్తే 
శ్రీ యాదవం భవ్యలతోయ దేవం
సంహారదాముక్తి ముతా సుభూతాం   
ఆవుతుంది.
మొదటి శ్లోకంలో భూసుతా అంటూ సీతను గురించి, రెండవదాంట్లో శ్రీ యాదవం అంటూ కృష్ణుని గురించి ప్రస్తావిస్తున్నట్లు అర్థమౌతూనే ఉంది. ఇక అర్థాల్లోకి వెళితే దరహాసం చిందే లవుని ప్రేమించే దయగల లక్ష్మియైన ఆ సీతకు నమస్కరించుచున్నాను అని మొదటి రెండు పాదాలకు అర్థం. రెండవదానికి మంగళప్రదమైన ఆకర్షణగలవాడైన కృష్ణుని గీతబోధ చెడుని సంహరిస్తూ ప్రాణప్రదమైనది అని అర్థం. ఎంతటి విన్యాసమో చూడండి. ఇలా మొత్తం కావ్యం కొనసాగుతుందన్న మాట!
స్థూలంగా చూసినా సూక్ష్మంగా పరీక్షించినా సంస్కృతం ప్రపంచ భాషలన్నింటిలోకీ ఉత్తమమైనది. భాషావేత్తలంతా ముక్తకంఠంతో పలుకగలిగే నగ్నసత్యమది.                                            

12 thoughts on “సంస్కృతం విశిష్టత

 1. కమలాపతిరావు  0  0

  నమస్కారమండి… మీ టపా ఆలస్యంగా చూశాను.
  నా పూర్తిపేరు హిందూపురం కమలాపతిరావు.
  నేను 10 ఏళ్లు ఈనాడులో రిపోర్టర్ గా, 20రోజులు సాక్షిలో సీనియర్ రిపోర్టర్ గా, ఆరు నెలలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో క్రైంబ్యూరో చీఫ్ గా, రెండేళ్లు టీవీ5లో సీనియర్ కరెస్పాండెంట్, క్రైం ఇన్ ఛార్జిగా పనరిచేసి, సొంతంగా న్యూస్ ఏజెన్సీ (తెలుగులో) ప్రారంభించాను. దాంతోపాటు పలు వెబ్ సైట్లను రన్ చేస్తున్నాను. http://crimenews.co.in, http://apnews.co.in ఆధ్యాత్మిక అంశాలపై http://kamalapathi.co.in అనే సైట్ ను నడుపుతున్నాను. త్వరలో హైదరాబాద్ వికీపీడియా పేరుతో http://ourhyd.com సైట్ ను ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇదండీ… నా గురించిన వివరాలు.

  విలోమకావ్యం పూర్తి అర్థం మీకు త్వరలో పో్స్టు చేస్తాను. నేను కూడా దాని పూర్తి అర్థ తాత్పర్యాలు తెలుసుకునేందుక మా నాన్నగారిని కోరడం జరిగింది. ఆయన నాకు మెయిల్ పంపిన వెంటనే… నేను మీకు అందజేస్తాను.

  Reply
 2. Dr T Mahendar  0  0

  దయచేసి ఈ కావ్యానికి తెలుగు లేదా సంస్కృత వ్యాఖ్యానం లభిస్తే తెలుపగలరు .నా ఈమెయిల్ (tpmahi@gmail.com)

  Reply
  1. వసుంధర   0   0

   రామకృష్ణ విలోమ కావ్యానికి భాష్యం నిమిత్తం ప్రయత్నాలు జరుగుతున్నాయి. లభించినప్పుడు తప్పక అక్షరజాలంలో ప్రచురించగలం. ఇలాంటి మరో విశిష్ట సంస్కృత కావ్యం రాఘవ యాదవీయం వ్యాఖ్యానంతోసహా లభ్యం. అక్షరజాలంలో భాషానందం వర్గంలో ప్రచురించాం.

   Reply
 3. కమలాపతిరావు  0  0

  రామకృష్ణ విలోమ కావ్యం (సూర్యకవి)
  తం భూసుతాముక్తిముదారహాసం వందే యతో భవ్యభవం దయాశ్రీ: శ్రీయాదవం భవ్యభతోయదేవం సంహారదాముక్తిముతాసుభూతం
  చిరం విరంచిర్న చిరం విరంచి: సాకారతా సత్యసతారకా సా సాకారతా సత్యసత్యసతారకా సా చిరం విరంచిర్న చిరం విరంచి:
  తామసీత్యసతి సత్యసీమతా మాయయాక్షమసమక్షయాయమా మాయయాక్షసమక్షయాయమా తామసీత్యసతి సత్యసీమతా
  కా తాపఘ్నీ తారకాఘా విపాపా త్రేధా విఘా నోష్ణకృత్య నివాసే సేవా నిత్యం కృష్ణనోఘా విధాత్రే పాపావిఘాకారతాఘ్నీ పతాకా
  శ్రీరామతో మధ్యమతోది యేన ధీరోనిశం వశ్యవతీవరాద్వా ద్వారావతీవశ్యవశం నిరోధీ నయేదితో మధ్యమతోమరా శ్రీ:
  కౌశికే త్రితపసి క్షరవ్రతీ యో దదాద్ ద్వితనయస్వమాతురం రంతుమాస్వయన తద్విద్ దాదయో తీవ్రరక్షసి పతత్రికేశికౌ
  లంబాధరోరు త్రయలంబనాసే త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా జ్ఞాతాగమా రక్షహి యాహి యాత్వం సేనా బలం యత్ర రురోధ బాలం
  లంకాయనా నిత్యగమా ధవాశా సాకం తయానుత్రయమానుకారా రాకానుమా యత్రను యాతకంసా శావాధమాగత్య నినాయ కాలం
  గాధిజాధ్వరవైరాయే తేతీతా రక్షసా మతా: తామసా క్షరతాతీతే యే రావైరధ్వజాధిగా:
  తావ దేవ దయాదేవే యాగే యావదవాసనా నాసవాదవయా గేయా వేదే యాదవదేవతా
  సభాస్వయే భగ్నమనేన చాపం కీనాశతానద్వారుషా శిలాశౌ: శౌలాశిషారుద్వానతాశనాకీ పంచాననే మగ్నభయే స్వభాస:
  న వేద యామక్షరభామసీతాం కా తారకా విష్నుజితేవివాదే దేవావితే జిష్నువికారతా కా తాం సీమభారక్షమయాదవేన
  తీవ్రగోరన్వయత్రార్యో వైదేహీమనసో మత: తమసోన మహీ దేవై- ర్యోత్రాయన్వరగోవ్రతీ
  వేద యా పంచసదనం సాధారావతతార మా మారతా తవ రాధా సా నంద సంచప యాదవే
  శైవతో హననేరోధీ యో దేవేషు నృపోత్సవ: వత్సపో నృషు వేదే యో ధీరోనేన హతోవశై:
  నాగోపగోసి క్షర మే పినాకే నాయోజనే ధర్మధనేన దానం నందాననే ధర్మధనే జయో నా కేనాపిమే రక్షసి గోపగో న:
  తతాన దామ ప్రమదా పదాయ నేమే రుచామస్వనసుందరాక్షీ క్షీరాదసుం న స్వమచారు మేనే యదాపి దామ ప్రమదా నతాత
  తామితో మత్తసూత్రామా శాపాదేశ విగానతాం తాం నగావిశదేపాశా మాత్రాసూత్తమతో మితా
  నాసావిఘాపత్రపాజ్ఞావినోదీ ధీరోనుత్యా సస్మితోఘావిగీత్యా త్యాగీ విఘాతోస్మి సత్యానురోధీ దీనోవిజ్ఞా పాత్రపఘావిసానా
  సంభావితం భిక్షురగాదగారం యాతాధిరాప స్వనధాజవంశ: శవం జధాన స్వపరాధితాయా రంగాదగారక్షుభితం విభాసం
  తయాతితారస్వనయాగతం మా లోకాపవాదద్వితయం పినాకే కేనాపి యం తద్విదవాప కాలో మాతంగయానస్వరతాతియాత
  శవేవిదా చిత్రకురంగమాలా పంచావటీనర్మ న రోచతే వా వాతేచరో నర్మనటీవ చాపం లామాగరం కుత్రచిదావివేశ
  నేహ వా క్షిపసి పక్షికంధరా మాలినీ స్వమతమత్త దూయతే తే యదూత్తమతమ స్వనీలిమా- రాధకం క్షిపసి పక్షివాహనే
  వనాంతయానశ్వణువేదనాసు యోషామృతేరాణ్యగతావిరోధీ ధీరోవితాగణ్యరాతే మృషా యో సునాదవేణుశ్వనయాతంనా వ:
  కిం ను తోయరసా పంపా న సేవా నియతేన వై వైనతేయనివాసేన పాపం సారయతో ను కిం
  స నతాతపహా తేన స్వం శేనావిహితాగసం సంగతాహివినాశే స్వం నేతేహాప తతాన స:
  కపితాలవిభాగేన యోషాదోనునయేన స: స నయే నను దోషాయో నగే భావిలతాపిక:
  తే సభాప్రకపివర్ణమాలికా నాల్పకప్రసరమభ్రకల్పితా తాల్పికభ్రమరసప్రకల్పనా కాలిమార్ణవ పిక ప్రభాసతే
  రావణేక్షిపతనత్రపానతే నాల్పకభ్రమణమశ్రుమాతరం రంతుమాశ్రుమణమభ్రకల్పనా తేన పాత్రనతపక్షిణే వరా
  దైవే యోగే సేవాదానం శంకా నాయే లంకాయానే నేయాకాలం యేనాకాశం నందావాసే గేయో వేదై
  శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం యానే నధ్యాముగ్రముధ్యాననేయా యానే నధ్యాముగ్రముధ్యాననేయా శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం
  వా దిదేశ ద్విసీతాయాం యం పాథోయనసేతవే వైతసేన యథోపాయం యాంతాసీద్విశదే దివా
  వాయుజోనుమతో నేమే సంగ్రామేరవితోహ్రి వ: విహ్రితో విరమే గ్రాసం మేనేతోమనుజో యువా
  క్షతాయ మా యత్ర రఘోరితాయు- రంకానుగానన్యవయోయనాని నినాయ యో వన్యనగానుకారం యుతారిఘోరత్రయమాయతాక్ష
  తారకే రిపురాప శ్రీ- రుచా దాససుతాన్విత: తాన్వితాసు సదాచారు శ్రీపురా పురి కే రతా
  లంకా రంకాగరాధ్యాసం యానే మేయా కారావ్యాసే సేవ్యా రాకా యామే నేయా సంధ్యారాగాకారం కాలం
  ఇతి శ్రీ దైవజ్ఞ పండిత సూర్యకవి విరచితం విలోమాక్షరరామకృష్ణకావ్యం సమాప్తం

  Reply
  1. shri   0   0

   ధన్యవాదాలు కమలాపతిరావు గారు.

   శ్రీదేవి

   Reply
  2. వసుంధర   0   0

   శ్రీ కమలాపతిరావు గారికి,
   నమస్కారం.
   మీరు పంపిన రామకృష్ణ విలోమ కావ్యం అద్భుతం. ఆ కావ్యాన్ని వ్యాఖ్యలనుంచి అక్షరజాలం టపాలో ఉంచేముందు మీ పూర్తి వివరాలు కూడా ఇవ్వాలనుంది. వీలైనంత వెంటనే పంపగలరు.
   మీకు శ్రమ కాని పక్షంలో ఆ సంస్కృత కావ్యానికి తెలుగులో అర్థం కూడా వివరించి పంపగలరు.
   మన సాహిత్య సంపదను భద్రపర్చుకునేందుకు మీవంటి వారి ఆసక్తి, సహకారం, ప్రతిభ ముఖ్య పాత్ర వహిస్తాయి. మీకు మా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.
   వసుంధర

   Reply
 4. చక్రవర్తి  0  0

  ఎవ్వరన్నారండీ తెలుగులో అందం లేదని. చేతకాని వారి అందరికీ ఇది ఒక చెప్పుదెబ్బ. నిజ్జంగా నాకు ఇది భలే నచ్చేసిందండి. నా ఆనందానికి హాద్దులు లేవనుకోండి. ఓ మంచి విషయాన్ని తెలియజేసినందులకు మీకు మఱియు శ్రీదేవి గారికి ధన్యవాదములు

  Reply
 5. నండూరి శ్రీనివాస్  0  0

  పైన చెప్పిన ఉదాహరణలాగే, పారిజాతాపహరణం పంచమాశ్వాసంలో నంది తిమ్మనగారు కూడా, విష్ణువుని స్తుతిస్తూ కొన్ని “పాలిండ్రోం” పద్యాలు రాశారు. ఇదిగో ఒక ఉదాహరణ:
  (వీటిలో ఏ పాదాన్ని తిప్పి చదివినా మళ్ళీ అదే వస్తుంది)

  ధీర శయనీయ శరధీ
  మార విభాను మతా మమతా మనుభావి రమా
  సారసవన నవసరసా
  దారదసమ తారహార తామస దరదా

  Reply
 6. Srinivas Chilakapati  0  0

  ఉత్తమం అంటే అర్థమేమిటి? పాలిండ్రోం తేలిగ్గా ఏర్పడుతుందనా? ఏ భాషా శాత్రవేత్తలు చెప్పారీ నగ్న సత్యాన్ని?

  Reply
 7. shridevi  0  0

  అక్షరాజాలానికి

  అందరితోను ఉపయోగకరమైన,ఆసక్తి కరమైన విషయాలను,వివరాలను
  పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు.
  ఇది నా స్నేహితులు పంపిన మెయిల్ లోనిది.దానిని నేను మీకు పంపించాను..క్రింది లంకె లో
  కావ్యాన్ని వివరంగా చూడవచ్చు..ఈ పోస్ట్ సృష్టించిన వారిని అందరమూ అభినందిద్దాము.

  శ్రీదేవి

  http://na-jeyah.blogspot.com/2008/07/ramakrishna-viloma-kaavyam-rare.html

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield