శుభాకాంక్షలు

By | January 1, 2013

ప్రపంచం అంతం కానున్నదన్న భ్రమకు ఎందరినో గురిచేసిన 2012ని దాటుకుని 2013లో అడుగెడుతున్నాం. 

అన్ని జాతుల్నీ కలుపుకున్నా అమెరికాలో దొరతనం తెల్లవారిదే. అందుకే వారి రాజభవనం తెల్ల ఇల్లు. 2008లో అ ఇంట ఓ నల్లనివాడికి దొరతనం లభించింది. అమెరికన్ల భావపరిణతి, వైశాల్యం- తాత్కాలికమని కొందరు భావించారు. 2012లో ఒబామాకి మరోసారి దొరతనం లభించడంతో- ఆ మార్పు తాత్కాలికం కాదని తేలిపోయింది. అణగద్రొక్కబడినవారు రిజర్వేషన్లు లేకుండానే అర్హతలతో అందలాలెక్కగలరన్న ఆశాభావానికి ధ్రువతార ఒబామా. ఆయనకు సకల సాఫల్యాన్ని కోరుకుందాం.

నల్లనివాడిలో దైవత్వాన్ని చూస్తుంది భారతం. ఆ భారతంలో నల్ల ధనానికి నాయకత్వం లభించడం సహజమని చాలామంది సరిపెట్టుకుంటున్నారు. కానీ అన్నా హజారే ఒప్పుకోలేదు. పొట్టివాడైనా అవినీతికి వ్యతిరేకంగా గట్టి పోటీయే ఇస్తున్నాడు. ఆయన ప్రభావం తాత్కాలికమేనని కొందరి భావన. కాదని తేల్చనుంది కొత్త వత్సరం.

ఈ ప్రపంచం 2012 డిసెంబర్ 21న అంతం కానున్నదని చాలామందే నమ్మారు. కానీ బడిలో అడుగిడి లేత వయసు చిన్నారుల గుండెల్లో తూటాలు దింపినప్పుడూ, బస్సులో అడుగిడిన చిన్నారికి మానధ్వంసం చేసినప్పుడూ- ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదేమని బాధపడినవారు ఇంకా చాలామంది. ఇటీవల డిల్లీలో నిర్భయకు జరిగిన సామూహిక మానవిధ్వంసం- కని విని ఎరుగనిది. ఆ నేరస్థుల్నికఠినంగా శిక్షించాలన్న ఆవేశం దేశమంతటా చెలరేగుతోంది.  ఈ సందర్భంలో మనమొక విషయం గమనించాలి. మన్ం పీల్చే గాలి పెట్రోలు వాడకంతో కలుషితమై కొందర్ని భయంకర వ్యాధులకు గురిచేస్తోంది. వ్యాధిగ్రస్థులకు చికిత్స చేసినంతమాత్రాన మరికొందరు వ్యాధికి గురయ్యే ప్రమాదం తప్పదు. మీడియా, కుల-మత-జాతి-వర్గ ద్వేషాలు, అంతర్జాలం ద్వారా- నేరప్రవృత్తి కూడా మన సమాజపు గాలిలో కాలుష్యమై చేరింది. అది పీల్చినవారిలో కొందరు ఘోర నేరస్థులౌతున్నారు. ఆ కాలుష్యాన్ని హరించే దిశలో మనం ఎక్కువగా కృషి చేయాల్సి ఉంది. 2013 ఆ దిశపై దృష్టి పెడుతుందని ఆశ.

తెలుగు సాహితీ కథా సుధా వేదికగా అక్షరజాలం- తన వంతు కృషి చెయ్యడానికి మీ అందరి సహాయ సహకారాలనూ అర్థిస్తోంది.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

11 thoughts on “శుభాకాంక్షలు

 1. sujalaganti  0  0

  వసు౦ధర ద౦పతులకు ఆ౦గ్ల నూతన స౦వత్సర శుభా కా౦క్షలు. మీరు మీ అక్షరజాల౦ ద్వారా చేస్తున్న సాహితీ సేవ కొనియాడతగినది. మిరు ఇ౦కా ఇలాగే సాహితీ సేవ చెయ్యాలని కోరుకు౦టున్నాను. మీరు పైన పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు

  Reply
 2. ఆర్.దమయంతి.  0  0

  నమస్తే.
  మీరు స్పృసించిన అంశాలు అందర్నీ ఆలోచింపచేస్తాయి అనడం లో ఎలాటి సందేహమూ లేదు. కులం మతం ఆధారం గా నిజానికి ఎవరూ ఎదగలేరు. వాట్లని అడ్డుపెట్టుకుని, గాడ్ ఫాథర్లు గా మారి, దేశ వ్యాప్తం గా గొప్ప నాయకుడని ముద్ర వేసుకున్న నాయకునికి సైతం..వైద్యం చేసి, ప్రాణాలు నిలిపింది ఎవరో కాదన్న సంగతి తెలుసుకునప్పుడు..మనిషి అనే ప్రతి వాని గుండె చాలా అందంగా స్పందిస్తుంది. మానవత్వం, కదలి కమ్మని కన్నీరై పొంగుతుంది.
  ‘ when people in our society start thinking about society instead of only theselves- avataram will come from ourselves.’
  – అన్న మీ మాటలు అక్షర సత్యాలు.
  మీ ఇరువురికీ, నా హృదయపూర్వక నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
  తెలియ చేసుకుంటూ..
  శుభాభినందనలతో-
  ఆర్.దమయంతి.

  Reply
 3. kslkss  0  0

  ఆశించటం మనిషి బలం, బలహీనత. “కలలు కను, సాఫల్యం చేసికొనటానికి కృషి చెయ్యి” అన్నది భారత రాష్ట్రపతి (ఒకానొకప్పటి) సలహారూపములోని సందేశం. బలం బావుందని మెచ్చుకోవటం, బలహీనత దాన్ని విస్మరించటం. మార్పు సహజం. ఎప్పుడన్నది శేష ప్రశ్న. అతిత్వరలో అన్నది ఆశావహుల సమాధానం. ఆలోచింపజేసిన మీ భావన బాగుంది.

  Reply
  1. -అంబల్ల జనార్దన్   0   0

   2013 సంవత్సరం 2012 కంతె మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను.
   -అంబల్ల జనార్దన్

   Reply
 4. slalita  0  0

  నూతన సంవత్సర శుభాకాంక్షలండీ….
  జి.ఎస్.లక్ష్మి…

  Reply
 5. C.S. Sarma.  0  0

  Subhakankshalu – Happy New Year 2013 – Your editorial is thought provoking on Gang rape of the girl in the Bus, Mayan-mar calendar closing, Obama’s real power without reservations, Children massacre in the school and Anna Hazare’s stand on Black money. But where from, we have to get support for solutions.

  Understand Gang rapes not stopped, corruption is not ended. Reservations are being created for another section of the society.

  Of course the top level people not celebrating the New year 2013.

  This is big puzzle to discuss and let us hope Lord Vishnu take another Avataram to help us from all the evils. – CS Sarma.

  Reply
 6. Amballa Janardhan  0  0

  kotta samvatsaram manandariki phalavantam kaavaalani aashistoo
  amballa janardhan

  Reply
 7. Tamirisa Janaki  0  0

  Thank you.Nutana samvatsara sandarbhamlo Vasundhara Aksharajaaniki Subhakanshalu. Tamirisa Janaki

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield