16 thoughts on “కథల పోటీ ఫలితాలు- స్వప్న

 1. ఆర్.దమయంతి  0  0

  అమ్మ తనానికి అద్దం పట్టిన కథ.
  నమస్తే.

  మీ కథ అమ్మతనం పూర్తిగా చదివాక, నా అభిప్రాయాన్ని తెలియ చేయా ల నిపించింది.
  తల్లి ప్రేమ ని, మాతృ హృదయ తత్వాన్ని – ఎన్ని విభిన్న కోణాల నించి పరిశీలించి చూసినా, చివరికి ఫలితం ఒకటి గానే వుంటుంది. అదే – అమృతత్వం.
  ఆ తరహాలో నే సాగుతుంది ‘ అమ్మతనం’ కథ కూడా.
  కథ, కథనం కూడా కొత్త గా వుంది.
  పాత్రల మస్తత్వాలను కళ్ళకు కట్టినట్టు వుంటమే కాకుండా, చాలా సహజం గా అనిపిస్తాయి. వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్లేనన్నట్టు తోస్తాయి.
  ఉదాహరణకి, తన భార్య తనకు పూర్తిగా అర్థం కానిదే అయినా, ఆమె లోని మానవ త్వం మీద ఆ భర్తకి ఎనలేని నమ్మ కం ఉండటం..అలాగే,
  – హరి వస్తున్నాడని భర్త చెప్పగానే తన అక్కసంతా ఆమె- తన మాటల్లో వెళ్లగక్కడం అంతా సహజం గా చిత్రీకరించారు రచయిత.
  నాకు బాగా గుర్తున్న కారెక్టర్ – హరి తండ్రి – జగదీష్.
  కొడుకు అమెరికా నించి వస్తానంటే..రావొద్దు, ఆ డబ్బు తమ కు పంపమని కోరే తల్లి తండ్రులూ వుంటారనడానికి ఇతనొక సాక్ష్యం. ఇది నిజం గా విషాదమే అయినా, ‘ కాసుకి లోకమే కాదు, కన్నవాళ్ళూ దాసోహమే ‘ అనే నిజం – ఇక్కడ ఋ జవు గా నిలుస్తుంది.
  హరి ఇండియా కొచ్చి, తన తల్లి తండ్రుల్ ని సైతం చూడ్డానికెళ్ళకుండా..కేవలం అమ్మ కాని అమ్మని చూడ్డానికెందుకొస్తున్నట్టు?
  ఇదే సంశయం ఆయనకీ కలిగింది. ‘ అవును. ఎందుకొస్తున్నట్టు?’ అనే ఆయన సంశయానికి..
  కథ లోని చివరి ఆ ఒక్క పేరా చాలు. ( అదేమిటనేది నేను చెప్పడం కంటేనూ, చదివితేనే బాగా అర్ధమౌతుంది. అందుకే ఆ రహస్యాన్ని నేనిక్కడ రాయదలచుకోవడం లేదు.)
  అది చదవగానే, పాఠకుల కు ఒక మాతృ హృదయం కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుంటుంది. కమ్మనైన అమ్మతనం కళ్ళ ముందు కదులుతుంది. ఆ పైన, కళ్లలో కన్నీరొలికి, మనసు మీద పన్నీరు చిమ్మి పోతుంది.

  కథ చదివాక, – మంచి కథ చదివామనే తృప్తి మిగులుతుంది.
  కథా, కథనం రెండూ ఆకట్టుకున్నాయి. రచనలో రెండు మూడు చోట్ల కొన్ని తెలుగు పదాలు కొత్త చెరకు ముక్కల్లా తీయగా అనిపిస్తాయి.
  అలాగే ఇంకో చోట కూడా ..ఎంతకూ అర్ధం కాని తన భార్య గురించి తనలో తాను విశ్లేషించుకుంటూ –
  ‘తన బాధేమిటో తెలీదు. సమస్యలున్నాయంటుంది. పరిష్కారాలకి ఒప్పుకోదు.’ అంటూ అనుకోవడాన్ని చదవం గానే నవ్వొచ్చింది. అసలు సిసలైన ఓ ఇల్లాలి మనస్తత్వానికి అద్దం పట్టిన ఈ వైనం అందరికీ నచ్చుతుంది.
  ‘ అందుకే ఈ కథ – బహుమతిని అందుకుంది ‘ అని ఒప్పుకోక తప్పదు ‘ అమ్మతనం’ చదివిన ఏ పాఠ కునికైనా!
  శుభాభినందనలతో..
  – ఆర్.దమయంతి.

  Reply
  1. వసుంధర   0   0

   మీ ప్రశంసను మించి మీ విశ్లేషణ చాలా సంతోషాన్నిచ్చింది. ధన్యవాదాలు.

   Reply
 2. darbha lakshmi annapurna  0  0

  vasundharagaariki abhinandanalu!ammatanam vibhinnakonaanni choopinchimdi!baavumdi.

  Reply
 3. Sujala Ganti  0  0

  vasundhara gariki mI katha ku remdava bahumati vachinanduku abhnandanalu. konni karanalavalana ventane cheppalekapoyanu. phone no leka personal ga abhinanadalu cheppalekapoyanu

  Reply
 4. shri  0  0

  అమ్మతనం కమ్మగా ఉంది .
  పోటీ నేగ్గినందుకు అభినందనలు

  శ్రీదేవి

  Reply
 5. ఆర్.దమయంతి  0  0

  వసుంధర గారూ!
  స్వప్న ఉగాది కథల పోటీలో మీ కథ ‘ అమ్మతనం ‘ రెండవ బహుమతి గెలుచుకున్నందుకు నా అభినందనలు తెలియ చేస్తున్నాను.
  నమస్సులతో..
  ఆర్.దమయంతి.

  Reply
 6. darbha lakshmi annapurna  0  0

  bahumati pomdina vasumdharagaariki,bhuvanachandragaariki,sanyaasiraogaarikinaa abhinandanalu!
  darbha lakshmi annapurna

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield