ఇయం సీతా మమ సుతా

By | July 25, 2013

జీవజాలానికి గాలి, నీరు ఎలాంటివో- మనుషుల్లో పురుషుడికి మహిళ అలాంటి వరం. ఆ విషయాన్ని హృద్యంగా చెప్పిన ఓ చక్కని చిన్న ఆంగ్ల కథని శ్రీదేవి మురళీధర్ పంపించారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ దానికి తెలుగు అనువాదాన్ని ఇక్కడ అందిస్తున్నాం.

daughter & father  పెళ్లయ్యాక ఆ దంపతులకి అది తొలి రోజు. ఎవరొచ్చినా తలుపు తియ్యకూడదని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఆ రోజు భర్త అత్తమామలొచ్చి తలుపు తట్టారు. భార్యాభర్తలు ముఖముఖాలు చూసుకున్నారు. తలుపు తియ్యాలనుకున్నవాడే- ఒప్పందం గుర్తుకి రావడంతో తలుపు తియ్యలేదు. ఆమె అత్తమామలు  వెళ్లిపోయారు. అదేరోజున కాసేపటికి భర్త త్యల్లిదండ్రులు వచ్చారు. భార్యాభర్తలు మళ్లీ ముఖముఖాలు చూసుకున్నారు. భార్యకు ఒప్పందం గుర్తుంది కానీ ఆమె నెమ్మదిగా, ‘నా తలిదండ్రుల్ని ఇలా వెనక్కి పంపించలేను’ అంది కళ్లనీళ్లతో. అమె వెళ్లి తలుపు తీస్తే భర్త ఏమీ అనలేదు.

ఏళ్లు గడిచాయి. ఆ దంపతులకి క్రమంగా ముందు నలుగురు అబ్బాయిలు, తర్వాత ఓ అమ్మాయి పుట్టారు. తనకి అమ్మాయి పుట్టినప్పుడా భర్త ఘనమైన విందు ఏర్పా టు చేసి తనకి తెలిసిన వారందర్నీ ఆహ్వానించాడు. ఆశ్చర్యపడిన భార్య ఆ రాత్రి భర్తని అడిగింది- అంతకు ముందు సంతానం కలిగినప్పుడు లేని ఈ హడావుడంతా ఇప్పుడెందుకని! దానికా భర్త అన్నాడూ- ఎప్పటికైనా నేను తలుపు తడితే   తెరిచేది అమ్మాయే కదా అని!

10 thoughts on “ఇయం సీతా మమ సుతా

 1. T.S.Kaladhar  0  0

  నిజంగా నిజం. బాగా రాశారు.

  Reply
 2. Sivakumara Sarma  0  0

  మూడవ వాక్యంలో “భర్త తల్లిదండ్రులు” అని ఉండాలి.

  Reply
 3. సురేష్ కుమార్ భాగవతుల  0  0

  అక్షర సత్యం,ఆడపిల్ల మనిషి అక్కడ ఉన్న,మనసు ఎప్పుడు పుట్టింటి దగ్గరే ఉంటుంది.ఆడపిల్ల తండ్రిగా చాలా సంతోషిస్తున్నాను.
  అనువాదకులకు అభినందనలు.

  Reply
 4. ఆకునూరి మురళీకృష్ణ  0  0

  కథ అనువాదం, పేరు పెట్టడం అద్వితీయం. నాగమణిగారి కామెంట్ బాగుంది.

  Reply
 5. TVS SASTRY  0  0

  మన్నించండి! అనువాదం కూడా మీదే అని తెలుసుకోలేకపోయాను, తెలుసుకొని మరీ ఆనందించాను.అభినందనలు!

  టీవీయస్.శాస్త్రి

  Reply
 6. TVS SASTRY  0  0

  వసుంధర గార్లకు,
  ఇదివరకే ఒక మిత్రుడు నాకీ ఆంగ్ల కథను మెయిల్ ద్వారా పంపటం జరిగింది.చక్కని కథ.ఆడ పిల్లల తండ్రిగా నేను కథ చదివిన తరువాత,ఆడపిల్ల –‘ఆడ’ పిల్ల కాదు,ఎప్పుడూ ‘ఈడ’పిల్లేననే భావన ధృడపడింది.గొప్పసందేశం కల చిన్న ఆంగ్ల కథను,చక్కగా తెలుగులో అనువదించిన శ్రీమతి శ్రీదేవి గారికి అభినందనలు.ఇదంతా ఒక ఎత్తయితే,కథకు మన సంస్కృతీ,సాంప్రదాయాలకు అద్దంపట్టినట్లు– ఇయం సీతా మమ సుతా అనే మకుటాన్ని పెట్టి ,కథకు పూర్ణత్వం తెచ్చిన మీకు నా హృదయపూర్వక అభినందనలు!

  టీవీయస్.శాస్త్రి

  Reply
  1. Nandoori Sundari Nagamani   0   0

   అద్భుతం అండీ ఈ కథ…కడుపులో ఉన్న ఆడ శిశువును భ్రూణ హత్య ద్వారా అంతమొందించే వరకూ నిద్రపోని పురుష పుంగవులకు చక్కని సందేశం…ధన్యవాదాలు శ్రీదేవి గారికి, మీకూ….

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield