పేరడీల గారడీ ఆహా ఈహీ ఓహో

By | April 30, 2016

ఈటివి కొత్తగా ప్రారంభించిన ఈటివి ప్లస్ ఛానెల్లో కార్యక్రమాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వీలునిబట్టి వాటినిక్కడ క్రమంగా పరిచయం చెయ్యగలం. 

నేడు పేరడీ పాటలకు ప్రసిద్ధులైన మహాకవి, మహాపండితుడు శ్రీ జొన్నవిత్తుల వారి ఆధ్వర్యంలో, ప్రసిద్ధ గాయనీ గాయకులు శ్రావణభార్గవి, హేమచంద్ర నిర్వహిస్తున్న ఆహా ఈహీ ఓహో – హాస్యాన్నీ, వినోదాన్నీ శ్రావ్యగీతాల్లో వినిపించే ఒక కొత్త తరహా కార్యక్రమం. మచ్చుకి ఈ ఏప్రిల్ 24న వచ్చిన కార్యక్రమానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ కార్యక్రమంలో 17 నిముషాల తర్వాత వచ్చే కవల యువతులు అనుభవిస్తూ వినిపించిన ‘ఓ స్నేహితురాలా’ పాట (బొబ్బిలిరాజా చిత్రంలో ‘కన్యాకుమారీ’ అన్నపాటకి పేరడీ) హైలైట్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield