ప్రతిలిపి వారి మినీ కథల పోటి

By | November 10, 2017

ఒక విషయాన్నీ నేరుగా చెపితే ఎవరు అర్థం చేసుకోరు,అదే విషయాన్నీ ఒక మినీ కథలాగా మలచి చెపితే ఆసక్తిగా ఆలకిస్తారు.సమాజంలో జరిగే ఎన్నో విషయాలను మినీ కథలలో అనంతమైన భావాలను నింపి అందరికి అర్థమయ్యేలా చెప్పవచ్చు.నేడు తెలుగు సాహిత్య రంగంలో మినీ కథల ప్రాముఖ్యత చాలా ఉంది దానిని గుర్తించిన ప్రతిలిపి ఈ సారి మినీ కథల పోటీలతో మీ ముందుకు వచ్చింది.రచయితలు ఏదైనా అంశంపై ఐదు కథలు వరకు పోటికి పంపవచ్చు.అథ్భుతమైన రచనలు రాసి ప్రతిలిపికి పంపండి. మీ రచనలు వేలమందికి చేరువ చేస్తాము.

నియమాలు :-

1.మీ రచనలు పంపడానికి చివరి తేది నవంబర్-22-2017

2.మీరు పంపే కథలు 1000 పదాలకు మించి ఉండరాదు.

౩.పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ రచనలు పోటికి పంపరాదు.

4.మీరు పంపే రచనలలో అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.ఆంగ్ల పదాలు వాడుక తగ్గించి పంపండి.(సూచన మాత్రమే)

బహుమతులు:

మొదటి ఉత్తమ కథకి :-1500/-rs

రెండవ ఉత్తమ కథకి :-1000/-rs

మూడవ ఉత్తమ కథకి:-500/-rs

ఈ పోటీలో పాల్లొనే రచయితలకు సూచనలు:-

1. మీరు ఈ పోటీకి గాను పంపించే స్వీయ రచనలు యూనికోడ్ ఫార్మాట్‌లో telugu@pratilipi.com ఈమెయిల్‌కు మాత్రమే పంపించాలి.

2. ఈ పోటీకి రచనను పంపించేటప్పడు, తప్పనిసరిగా ఆ రచనకు సరిపడే ఛాయాచిత్రాన్ని కూడా జతపరిచి పంపించాల్సి ఉంటుంది. (ఛాయాచిత్రం కొరకు www.pixabay.com వెబ్ సైట్ సందర్శించండి లేదా గూగుల్ నుండి సెర్చ్ చేసి పంపండి)

3. పోటికి పంపే రచనలు మెయిల్ సబ్జెక్టులో తప్పనిసరిగా “ప్రతిలిపి మినీ కథల పోటీల కొరకు” అని రాసి పంపండి.

4. పోటికి వచ్చిన రచనలు నవంబర్ -27వ తేది నుండి ప్రతిలిపి వెబ్ సైట్ లో పాఠకుల ముందు ఉంటాయి.

5. విజేతల ఎంపిక, రచనకు వచ్చిన పాఠకుల సంఖ్య, రేటింగ్ మరియు రచనను చదవడానికి పాఠకులు కేటాయించిన సమయం వీటిని పరిగణంలోకి తీసుకోని మా సాంకేతికవర్గం అందించే పట్టిక ఆధారంగానే బహుమతులను అందించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield