ప్రేమకథల పోటీ- ప్రతిలిపి

By | February 7, 2018

మీరు ఇంకా ఒంటరిగానే ఉన్నారా ? లేదా ఒక పరిపూర్ణమైన భాగస్వామి కోసం నిరీక్షిస్తున్నారా? మీ జీవితంలో ప్రేమ చిగురించిందా  లేక పూర్వపు ప్రియుడు/ప్రియురాలిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారా! మీ ప్రేమ కథ లేదా వేరొకరి ప్రేమ కథలలో మీరు ప్రధాన పాత్ర పోషించారా? అయితే వెంటనే మీ రచనలు మాకు రాసి మెయిల్ చేయండి. వేల సంఖ్యలో  పాఠకులను పొందడమే కాకుండా నగదు బహుమతులను కూడా గెలుచుకోండి.

ట్రూలీ మాడ్లీతో కలిసి ప్రతిలిపి వాలెంటైన్స్ డే సందర్భంగా కథల పోటీని నిర్వహిస్తున్నది.

నిజ జీవిత కథలైనా, కల్పితమైనవైనా  మీ ఆలోచనలు, భావాలకు అక్షరరూపం ఇచ్చి కథలుగా మలిచి మాకు పంపండి. మీ ప్రేమ కథలను మన ప్రతిలిపి పాఠకులతో పంచుకోండి. 

బహుమతులు :

మొదటి ఉత్తమ కథకి :-2000/-rs

రెండవ ఉత్తమ కథకి :- 1500/-rs

మూడవ బహుమతి :-1000/-rs

నియమాలు :-

1. మీ రచనలు పంపడానికి చివరి తేది ఫిబ్రవరి-25-2018.

2. మీరు పంపే కథల నిడివి పెద్దగా ఉండేలా చూసుకోండి. చిన్న కథలు ప్రతిలిపి పాఠకులు ఇష్టపడరు. మరియు మేము అందించే ఫలితాల్లో కూడా నిడివి ఎక్కువ ఉన్న కథలకే ప్రాముఖ్యత ఉంటుంది.

3. పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి పంపరాదు, వేరే ఎక్కడైనా ప్రచురణ అయినవి పంపవచ్చు.

4. మీరు పంపే కథలలో అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

5. ఈ పోటీకి ప్రతి రచయిత ఐదు కథల వరకు పంపవచ్చు.

ఈ పోటీలో పాల్గొనే రచయితలకు సూచనలు:-

1. మీరు ఈ పోటీకి గాను పంపించే కథలు యూనికోడ్ ఫార్మాట్‌లో telugu@pratilipi.com ఈ-మెయిల్‌కు మాత్రమే పంపించాలి. వేరే ఇతర ఏ ఫార్మాట్ అంగీకరించబడవు.

2. ఈ పోటీకి రచనను పంపించేటప్పుడు, తప్పనిసరిగా ఆ రచనకు సరిపడే ఛాయాచిత్రాన్ని కూడా జత పరిచి పంపించాల్సి ఉంటుంది. (ఛాయాచిత్రం కొరకు www.pixabay.com వెబ్ సైట్ సందర్శించండి. లేదా గూగుల్ నుండి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుని పంపగలరు)

3. పోటీకి పంపే కథలు మెయిల్ సబ్జెక్టులో తప్పనిసరిగా “ప్రతిలిపి ప్రేమ కథల పోటీ – 2018 కొరకు” అని రాసి పంపండి. మరియు మీ రచనలు అన్నీ ఒకే మెయిల్ లో ఒకేసారి మెయిల్ బాడిలో పంపగలరు.

4.  పోటీకి వచ్చిన కథలు మార్చ్-01-2018 వ తేది నుండి మార్చ్-31-2018 వరకు ప్రతిలిపి వెబ్ సైట్ లో పాఠకుల ముందు అందుబాటులో ఉంటాయి. అదే రోజు ఫలితాలు ప్రకటించబడును.

5. విజేతల ఎంపిక కథలకు వచ్చిన పాఠకుల సంఖ్య, రేటింగ్ మరియు రచనను చదవడానికి పాఠకులు కేటాయించిన సమయం – వీటిని పరిగణలోకి తీసుకొని మా సాంకేతిక వర్గం అందించే పట్టిక ఆధారంగా మూడు నగదు బహుమతులు అందించడం జరుగుతుంది.

సందేహాలకు :7259511956,వాట్స్ అప్ :9491977190

Regards,

జాని తక్కెడశిల(రచయితల అనుసంధాన కర్త) 

www.pratilipi.com

వాట్స్ అప్ :-9491977190,మొబైల్ -7259511956

ప్రతిలిపి మొబైల్ యాప్ :  యాప్ కొరకు క్లిక్ చేయండి
స్వీయ ప్రచురణ నేర్చుకొనుట కొరకు వీడియో :వీడియో కొరకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WordPress Anti-Spam by WP-SpamShield