Category Archives: టీవీ సీరియల్స్

చూస్తున్నారా చూస్తూ ఉంటారా

మనకి ప్రతినిధులమని  చెప్పుకుంటూ అసెంబ్లీలో అడుగెట్టి నోరిప్పితే భాష వినలేనిది చెయ్యెత్తితే ఆ చేష్ట కనలేనిది అదేమంటే ‘జనం మిమ్మల్ని చూస్తున్నారు’ అంటూ ఒకరినొకరు ఎద్దేవా మరి జనం చూస్తున్నారా, చూస్తూ ఉంటారా? మనకి వినోదాన్నో సత్కాలక్షేపాన్నో ఇస్తామంటూ  రేటింగులకోసం  తాపత్రయపడే టివిలు కూడా అసెంబ్లీలకు భిన్నమేం కాదు జనం చూస్తున్నారో, చూస్తూ ఉంటారో మరి! ఆంధ్రభూమి 00

మీలో ఎవరు కోటీశ్వరుడు

గతంలో ఈ కార్యక్రమం నాగార్జున నిర్వహణలో మాటివిలో వచ్చింది. ఆరంభంలో కొంచెం తడబడినట్లు అనిపించినా క్రమంగా పుంజుకుని అద్భుతం అనిపించేలా నడిపించాడు నాగార్జున.  ఈ ఫిబ్రవరి 13నుంచి స్టార్ మాలో ఇదే కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి నిర్వహణలో మొదలైంది. ప్రస్తుతానికి చిరంజీవి అమితాబ్, నాగార్జునలకులా సహజంగా అనిపించడం లేదు.  భాషణలో, తీరులో తానొక మెగాస్టార్‍ అన్న భావన కనిపించి కార్యక్రమం కృతకంగానే ఉంది. ఇది ఆరంభ దశ కాబట్టి క్రమంగా పుంజుకుని సహజత్వానికి దగ్గర్లో ఉండొచ్చని ఆశిద్దాం. తొలి కార్యక్రమంలో ఎంపికైన… Read More »

ఈటీవీలో రియల్ డిటెక్టివ్స్

మూడు నిముషాల కార్యక్రమాన్ని మూడువందల ఎపిసోడ్సుగా చూపించి విసిగిస్తున్న డెయిలీ సీరియల్సుకి భిన్నంగా ఈటీవీలో మొదలైన కార్యక్రమం రియల్ డిటెక్టివ్స్. ఒక సినిమా అంత కథని గంట లోపులో – అతి వేగంగానూ, ఆసక్తికరంగానూ, నిర్మాణ విలువలతోనూ ఈటీవీ సమర్పిస్తున్న ఈ కార్యక్రమం జూలై 5 (2015) నుంచి ఫ్రతి ఆదివారం రాత్రి 9.30కి వస్తూ అలరిస్తోంది. దేనికీ అనుకరణ కాదని ప్రకటించినప్పటికీ, సోనీలో వచ్చే సిఐడి సీరియల్‍ పోకడలకు దగ్గర్లో ఉంటుంది. డిటెక్టివ్స్ టీమ్ సభ్యులు… Read More »

అభిషేకం- ఈటీవీ సీరియల్

ఆరేడేళ్లక్రితం పది పన్నెండేళ్ల వినయ్ అనే కుర్రాడి చుట్టూ తిరుగుతూ మొదలైంది ఈటీవీలో అభిషేకం అనే డెయిలీ సీరియల్. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నిర్మాణ, పర్యవేక్షణల కారణంగా ఈ సీరియల్‍పై ఆసక్తి కలగడం సహజం. ఆరంభంలో పల్లె వాతావరణం, పాత్రచిత్రణ అద్భుతం అనిపించాయి. కథాకాలానికి వస్తే, ఆరంభంలోనే సెల్ ఫోన్ల వాడకం ఉంది కాబట్టి 1995 తర్వాతే అనుకోవచ్చు. ఆ తర్వాత వినయ్‍కి పెళ్లయింది. కమల్ అనే కొడుకు పుట్టాడు. ఆ కమల్ పెరిగి పెద్దవాడై… Read More »

పాడుతా తీయగా

అమెరికాలో రాగసాగరికగా పాడుతా తీయగా జూన్ 1న ముగిసింది. పాడినవారి భాష, ఉచ్చారణ, స్వరజ్ఞానం అద్భుతం. అందుకు ఆ పిల్లల తలిదండ్రుల్నీ, నిర్వాహకులు బాసునీ అభినందించాలి. ఆ కార్యక్రమానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. పాడుతా తీయగా సరికొత్త సంచిక జూన్ 8న ప్రారంభమైంది. ఇందులో ఎంపికకై పాడిన కొందరు గాయనీ గాయకుల పాటల్ని క్లుప్తంగా వినిపించారు. వారినుంచి 21మంది ఔత్సాహికులు ఎంపికయ్యారు. వారితో కొత్త కార్యక్రమం జూన్ 15న మొదలైంది. ఆ వేడుకకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.… Read More »

ఈటీవీ ఛాంపియన్

ఛానెల్స్ కే ఛాంపియన్ అనతగ్గది ఈటీవీ. అందులో డిసెంబర్ 8న (2014) మొదలైంది బడిపిల్లల కోసం ఛాంపియన్ అనే ప్రశ్నావళి కార్యక్రమం. మిగతా కార్యక్రమాల్లా కాక, ఇది పిల్లల తెలివికి పదును పెడుతూ, పరిజ్ఞానాన్ని పరీక్షించే వేదిక. ప్రముఖ సినీనటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు ఆదర్శప్రాయం. ఈ కార్యక్రమం సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6కి ప్రారంభమై – అరగంటసేపు పిల్లలకీ, పెద్దలకీ కూడా ఆరోగ్యకరమైన, ఆసక్తికరమైన వినోదకాలక్షేపాన్నిస్తుంది.… Read More »