Category Archives: బాల బండారం

సాహితీ పల్లవం

సాహితీ మిత్రులకు  నమస్కారం ఆరు నుండి పదో తరగతి పిల్లలకు కథలు రాసే అలవాటు చేసేందుకు ఉద్దేశించి శ్రీకారం అనే మాస పత్రికలో నేను గత జనవరి నుండి ‘సాహితీ పల్లవం’ పేర ఒక శీర్షిక నిర్వహిస్తున్నాను. మీ పిల్లలు కానీ, మీ స్కూల్ పిల్లలు కానీ, మీకు తెలిసిన పిల్లలకు కానీ దీనిని అందుబాటులోకి తెచ్చి వారిని ప్రోత్సహించ గలరని మనవి. దాసరి వెంకటరమణ 00

అర్హత (పిల్లల కథ)

అర్హత    రచనః ఆదూరి హైమవతి సాయికృపా నర్సింగ్‌ హోంకి చిన్నపిల్లల డాక్టర్‌ కావాలని వాకిన్‌ ఇంటర్వ్యూ ప్రకటించారు. దానికా రోజు ఉదయం 8.30కల్లా, నర్సింగ్‌ హోం భవనం వెయిటింగ్‌ హాల్లో సుమారు యాబైమంది డాక్టర్లు వచ్చారు. వాళ్లలో కొత్తగా డిగ్రీ అందుకున్నవాళ్లున్నారు. కాస్తో కూస్తో అనుభవమున్నవారున్నారు. అక్కడ కొంతకాలమైనా పనిచేస్తే మంచి గుర్తింపుతో పాటు, మంచి జీతం, క్వార్టర్స్‌ మొదలైనవి లభిస్తాయని ఆశపడ్డ వారున్నారు. అన్నింటికంటే రోగుల సేవ ప్రధానం అనుకునే అరుణ అనే కుర్ర డాక్టరు… Read More »

బాల బంధు శ్రీ బి.వి. నరసింహారావు

1954-57 మధ్యలో నేను నవభారతి గురుకుల్ రెసిడెన్షియల్ హైస్కూల్‍లో 9-11 తరగతులు చదివాను. రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్సులో ఐఎల్‍టిడి కంపెనీ పక్కన ఉండే ఆ బడిని వ్యవస్థాపకులు శ్రీ తన్నీరు బుల్లెయ్య నిర్వహించిన తీరు అనుభవైకవేద్యం. ఆ బడిలో బాలల మానసిక వినోద వికాసాల కోసం ఎన్నో ఏర్పాట్లుండేవి.  ఆ వివరాలు మరొకసారి.  బాలబంధు శ్రీ బి.వి. నరసింహారావు గురించి నాకు తెలిసినదక్కడే. కనీసం ఏడాదికొక్కసారైనా ఆయనికొచ్చి తన మాటలతో, పాటలతో, ప్రబోధాలతో- మాకు ఉల్. లాసాన్నీ,… Read More »

బేతాళ కథలు

మన జానపద సాహిత్యంలో బేతాళ కథలది ఒక విశిష్ట స్థానం. పిల్లల కథలా అనిపిస్తూ, మనచుట్టూ జరిగే సామాన్య విశేషాల్ని అద్భుతంగా మార్చే ఒక వినూత్న పద్ధతి ఈ కథల్లో ఉంటుంది. ఊహకందే విశేషాల్లోంచి ఊహకందని జ్ఞానాన్ని పంచిపెట్టే ఈ కథల్లో ఇతివృత్తం ఒక ఎత్తు. కథనం మరో ఎత్తు. ప్రశ్న జవాబు ఓ మెలిక. ఇవి ప్రాచీనంగా ఇరవై ఐదు కథలు. సమకాలీన సమాజాన్ని విశ్లేషించే ఇతివృత్తాలతో నెలకొకటి చొప్పున కల్పిత బేతాళ కథగా కొన్ని… Read More »

పిల్లలకు సృజనాత్మక పోటీలు

పిల్లలలో సృజనాత్మకత పెంచుటకు, స్వతంత్ర భావాలను స్వంత ఆలోచనలను రేకెత్తించే దిశగా వారి గమనం సాగాలని,జాతీయ లైబ్రరి వారోత్సవాల సందర్భంగా కొన్ని పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ పిల్లలను లేదా మీకు తెలిసిన వారి పిల్లలను ఈ పోటీలకు పంపితెలుగు భాషపై, తెలుగు పిల్లలపై మీకు గల మక్కువను చాటుకోండి. 00

ప్రశాంతి ఎందుకు ఇష్టం అంటే

అయినవాళ్లున్న అదృష్టవంతులకోసం బాల కుటీరం అనే పాఠశాలనీ, ఎవ్వరూలేనివారిని అదృష్టవంతుల్ని చెయ్యడం కోసం చేతన అనే ఆశ్రమాన్నీ నిర్వహిస్తున్నారు  గుంటూరులో డా. ఎన్‌. మంగాదేవి. తన జీవితాన్ని సంఘసేవకే అంకితం చెయ్యాలని అవివాహితగా ఉండిపోయి లక్ష్యసాధనకై నిరంతరకృషి చేస్తున్న ఆమెని ఇప్పుడు అమ్మా అని నోరారా పిలిచేవారెందరో! చేతనలో అపురూపమైన ప్రదేశాలెన్నో! వాటిలో ప్రశాంతిపై ఓ ఆశ్రమవాసి స్పందనని మె మాటల్లోనే ఇక్కడ…  00

బాలబండారం

సమయాభావంబల్ల బాలబండారంలో రచనల ప్రచురణ ఆలస్యం ఔతోంది. ఇకమీదట ఇంత జాప్యం జరుగదని హామీ ఇస్తూ కొత్త రచనల్ని ఆహ్వానిస్తున్నాం. బాలబండారంలో నేటి మేటి కొత్త రచనలు ఇవి:  ఒక జాగిర్దారు కథ (బండారు రామ్మోహన్ రవు) రాజు-ప్రజలు (బండారు రామ్మోహన్ రవు) ఏం బొమ్మ తెచ్చావ్ (వసుంధర) పిత్రోత్సాహం (మోచెర్ల శ్రీ హరికృష్ణ) 00

బాల బండారం

బాల బండారంలో మొదటి రచన అల్లెం తినే అల్లుడు చూశారు కదా! ఇకమీదట ఈ శీర్షికలో తరచుగా రచనలు అందజేయగలం. కొత్త రచనలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. అన్నాతమ్ముల కథ ఒకటి మడత మాటలు 00