Category Archives: శాస్త్రీయం

అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ కాపు రాజయ్యకు అక్షర నీరాజనం!

ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత శ్రీ కాపు రాజయ్య 20-08-2012 న సిద్ధిపేటలో తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1993లో కళాప్రవీణ, 1997లో కళావిభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డులు  అందుకున్నారాయన. సిద్దిపేటలో జన్మించిన రాజయ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తన చిత్రాలద్వారా ఎన్నో అవార్డులందుకున్న రాజయ్య సిద్దిపేటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజయ్య… Read More »

సర్దార్ సర్వాయి పాపన్న- బహుజన రాజ్యాధికారానికి ప్రతీక!

(1675లో సర్వాయి పాపన్న తొలిసారి కోటను నిర్మించిన సర్వాయిపేట (కరీంనగర్ జిల్లా) కొండల మీద 18-08-2012 న ఆ బహుజన నేత విగ్రహ ప్రతిష్టాపన  జరిగిన సందర్భంగా ..) దళిత బహుజనులు ఏకమై ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని 17వ శతా బ్దంలోనే నిరూపించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న క్రీ.శ.1650లో నేటి వరంగల్ జిల్లా ఖిలా షాపురంలో కళ్లు తెరిచాడు. గౌడ కులంలో పుట్టిన పాపన్న బాల్యంలో పశువులను కాస్తూ, యుక్త వయసులో కల్లు గీస్తూ… Read More »

ఇతిహాస సుందరి టిజి కమల

పాతాళభైరవి చిత్రం  1951లో కాబోలు వచ్చింది. అప్పుడు నా వయసు 7 – 8 మధ్య. ఆ సినిమా గురించి గొప్పగా విన్నప్పటికీ అప్పట్లో చూసే అవకాశం రాలేదు. 1964లో రీసెర్చి చేస్తున్నప్పుడు తొలిసారి ఆ చిత్రం చూశాను. అందులో ఆదిలో ఇతిహాసం విన్నారా అన్న పాట బుర్రకథగా వినిపిస్తుంది. పాడినదీ నటించినదీ టిజి కమలాదేవి. ఆమెను చూశాక హీరోయిన్ మాలతిని చూసి – కమలవంటి అందగత్తె ఉండగా మాలతిని ఎందుకు ఎంపిక చేశారా అనిపించింది. ఆతర్వాత మల్లీశ్వరి… Read More »

మన జాతి గీతికలు

ఈ మహత్తర జాతి గీతికలను, నేడు చాలామంది మరచిపోతున్నారు. కొందరికి కొంచెమే వచ్చు. ఈ ప్రబోధాత్మక గీతాలను, నేటి తరం పిల్లలకు నేర్పటానికి ముందు, మనమొకసారి పునశ్చరణ చేసుకుందాం! వందేమాతరం వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందేమాతరం శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్ ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్ సుహాసినీమ్ సుమధుర భాషిణీమ్ సుఖదాం వరదాం మాతరం వందేమాతరం జన గణ మన అధినాయక జయహే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత… Read More »

భాషే శ్వాసగా మిగిలిన భద్రిరాజు

ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. 84 సంవత్సరాల వయసులో – నిన్న, అనగా ఆగస్ట్ 11 (2012) ఉదయం హైదరాబాదులో మెడిసిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. ఐతే భాషలో వారి శ్వాస మనకు నిత్యానుభూతి కాగలదన్నది పరమసత్యం.  భాషాభిమానులందరూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీ టివిఎస్ శాస్త్రి బాష్పాంజలికై ఇక్కడ… Read More »

శివైక్యమైన సదాశివం

చంద్రలోకానికి మనుషుల్ని పంపాం. ఇక్కడే ఉండి అంగారకుణ్ణి పరిశీలించగల్గుతున్నాం. అంతమాత్రాన సైంటిస్టులకి కూడా భూమి గురించి పూర్తిగా తెలుసు అనుకుందుకు లేదు. హైదరాబాదులో ఉంటూ, సాహితీవ్యాసంగంపట్ల ఆసక్తి ఉన్న మా పరిస్థితీ ఇందుకు భిన్నం కాదు. రెండేళ్ల క్రితం వరకూ శ్రీ సామల సదాశివ పేరు కూడా మాకు తెలియదు. వారి రచన యాది గురించి కూడా మేము వినలేదు. శ్రీ పెద్దాడ వెంకటేశ్వర్లు అనే రచయిత, సాహిత్యాభిమాని మరో ప్రముఖ రచయిత ఎలక్ట్రాన్ ద్వారా మాకు… Read More »

సినారె అష్టపదిన్నొక్కటి

మన ప్రాచీనులు వృత్తితో ముడిపెట్టిన కులం నేడు పుట్టుకతో ముడివడింది. కానీ జ్ఞానులు, పండితులు, విద్యావంతులు నిర్వచనం ప్రకారం బ్రాహ్మణులని స్వాభిప్రాయం. అలా మన సి నారాయణరెడ్డి బ్రాహ్మణోత్తములు. ఆయనకు జంధ్యం లేకపోతే – జగమెరిగిన బ్రాహ్మణునకు జంధ్యమేల – అన్న సూక్తి తెలిసిన విజ్ఞులన్న మాట! కవితామతల్లికి ఆయన సమక్షం నిత్యవసంతం అయిన వారు  నిన్నటితో తన జీవితంలో 81 వసంతాలు పూర్తి చేసుకున్నారు.  ఆయన సమకాలీనులు కావడం మన అదృష్టమైతే తరచుగా సభల్లో ఆయన్ని… Read More »

శ్రీ వరలక్ష్మీవ్రతం

భక్తికీ, నాస్తికత్వానికీ సమాన హోదా కల్పించిన హిందూత్వాన్ని చాలామంది మతంగా అపార్థం చేసుకుంటారు. వివాదాస్పదమైన విగ్రహారాథనకు వివేకానందుడి వంటి మహాజ్ఞానులు తగిన వివరణ ఇచ్చి ఉన్నారు. జీవితగమనంలో భక్తి ఒక మార్గం. అది ఆకర్షణీయం, ఆసక్తికరం కావడానికి ఎన్నో పూజలు, వ్రతాలు, నియమాలు. పతాక వందనాలు, కవాతులు, క్రీడలముందు ఉత్సవాలు సహజం అనుకునేవారికీ – అసలు ఒలింపిక్ క్రీడలెందుకూ, వాటికి నియమాలెందుకూ అని అడగాలని అనిపించనివారికీ ఈ తంతులు అర్థం కావు. స్వార్థానికి కాక, సర్వే జనాస్సుఖినో… Read More »

జీవితమే ఒక నాటకం

జీవితమే ఒక నాటకమనీ, మనమంతా అందులో పాత్రధారులమనీ అన్ని సంస్కృతుల వేదాంతమూ చెబుతుంది. వేదాంతం జీవితానుభవాలనుంచి వస్తుంది. ఈ వేదాంతపరంగా తన జీవితానుభవాల్నిఅన్వయించి కథ కాని కథగా రూపొందించారు శ్రీ టీవీఎస్ శాస్త్రి. పాఠకులకు ఆసక్తికరంగా, కొత్త రచయితలకు మార్గదర్సకమైన ఈ జీవితమే ఒక నాటకం మీ కోసం. 00

వందేళ్ళ తెలుగు కథకు వందనాలు

  HMTV వారు వారం వారం ధారావాహికంగా ప్రసారం చేస్తున్న’వందేళ్ళ కథకు వందనాలు’ అనే శీర్షిక క్రింద శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి వ్యాఖ్యానంలో సమర్పిస్తున్న, ఈ కార్య క్రమాన్ని ఈ క్రింది లింకులో చూసి ఆనందించండి. చదవండి తెలుగు సాహిత్యం! చదివించండి తెలుగు సాహిత్యాన్ని!! ఈ వారం ప్రసారం చేస్తున్న కథ – ప్రఖ్యాత హాస్య రచయిత శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారి ‘ఊదా చీర’ను గురించి వినండి / చూడండి. శ్రీ గొల్లపూడి వారితో ఈ కార్యక్రమమలో… Read More »