Category Archives: సాహితీవైద్యం

నవ్యలో ‘తల్లి గోదారి’- ఒక స్పందన

నవ్య నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన నవ్య గోదారి కథపై మా విశ్లేషణ రచన సెప్టెంబర్ సంచికలో వస్తుంది. ఆ విశ్లేషణ కథాంశానికీ, కథనానికీ, పాత్రచిత్రణకీ మాత్రమే పరిమితం. ఐతే వీటితోపాటు కథకు విరామ చిహ్నాలు కూడా ఎంతో ముఖ్యం. ఆ విషయమై ఈ కథపై శ్రీ తాడికొండ శివకుమార శర్మ ఈ క్రింది పరిశీలన గమనార్హం. ఇవి రచయితలకూ, పాఠకులకూ, పత్రికా సంపాదకులకూ ప్రయోజనాత్మకం. శ్రీ శర్మకు అభినందనలు. అక్షరజాలంలో చర్చకు ఇటువంటి… Read More »

సాహిత్యప్రస్థానం

ఈ క్రింది సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు. సాహిత్యాభిమానులకు/రచయితలకు నమస్కారం     సాహిత్య ప్రస్థానం మాసపత్రిక 2002 నుండి వెలువడుతూ తెలుగు సాహిత్యక్షేత్రంలో తనకంటూ విశిష్టతను సంపాదించుకున్నది. ఔత్సాహికుల రచనలకు ప్రోత్సాహాన్ని అందిస్తూనే సీనియర్‌ రచయితల రచనలకూ సిసలైన వేదికగా అలరారుతున్నది. విస్తరిస్తున్న ఇంటర్నెట్‌ అవకాశాలనూ అందిపుచ్చుకుని వెబ్‌సైట్‌www.prasthanam.com ను కూడా నిర్వహిస్తున్నది. వివిధ భాషలకు చెందిన ప్రసిద్ధ సాహిత్య వేత్తల ఫొటోలు ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన ప్రస్థాణం… Read More »

రావూరి భరద్వాజ

1964లో కెమిస్ట్రీలో రీసెర్చి స్కాలరుగా ఉన్నప్పుడు- సమాచార సేకరణకు రోజూ ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లేవాణ్ణి. మధ్యలో మార్పుకోసం తెలుగు విభాగానికి వెళ్లి కథా సాహిత్యాన్ని చదివేవాణ్ణి. అప్పుడు పరిచయమైన కొత్త రచయితల్లో రావూరి భరద్వాజ ఒకరు. వారి కథల్లోని విలక్షణత, సహజత్వం, నిర్భయత్వం, అంతర్లీన సందేశం- అప్పట్లో నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. కథలంటే ఇలా ఉండాలి, ఇలా వ్రాయాలి- అన్న భావాన్ని, ప్రేరణని కలిగించాయి. శృంగారపరంగా చలానిది భావుకత ఐతే- రావూరిది వాస్తవికత. విశ్లేషణలో వారిది… Read More »

కథలే కన్నానురా…

జాగృతి వారపత్రిక దీపావళి సందర్భంగా నిర్వహించిన ‘స్వర్గీయ శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక కథా పురస్కారం’లో బహుమతులందుకుని- నవంబర్‌ 8 (2010) సంచికలో ప్రచురితమైన- 5 కథల విశ్లేషణ రచన మాసపత్రిక ఫిబ్రవరి (2011) సంచికలో వచ్చింది. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 00

కథ-నవల

సాహితీ వ్యవసాయంలో నవల అనే మహావృక్షానికి- విత్తనం కథ. రైతు- పండిన పంటలో ఎక్కువ భాగాన్ని ఆహారపు దినుసుగా ఉపయోగించి తక్కువ భాగాన్ని విత్తనాలుగా వాడినట్లే- రచయితలు ఇతివృత్తాల్ని ఎక్కువగా కథలుగానూ, తక్కువగా  నవలలుగానూ మలచుకోవడం జరుగుతుంది. కథ వ్రాసినా, నవల వ్రాసినా- రచయితకి తన రచనలోని పాత్రల, సన్నివేశాల నేపధ్యంపట్ల సమగ్రమైన అవగాహన అవసరం. అప్పుడా రచన- కథా, నవలా అన్న విచక్షణకి- అనుభవం తోడ్పడుతుంది. ఐనా ఒకోసారి తలలు పండినవారు కూడా తప్పటడుగు వేయడం… Read More »