Category Archives: కవితా చమత్కృతులు

అతిశయోక్తి అతిశయాలు

అతిశయోక్తి చరిత్ర కాదు. విశేషణం కాదు. అది సందర్భానుసారంగా వాడే ఒక అలంకారం. లిప్‍స్టిక్కులూ, మేకప్పులూ మనిషికిచ్చే అందం ఎంత తాత్కాలికమో – ఈ అతిశయోక్తుల విలువా అంతటిదే! అలంకరణలో ప్రతిభలాగే అతిశయోక్తుల ప్రతిభ కూడా, కవితాపరంగా అలరిస్తుంది. అతిశయోక్తుల్ని నిరసించకూడదు. వాటి ప్రయోజనాన్ని తగిన మేరకు మాత్రమే అవగాహన చేసుకోవాలి.  ఈ నేపథ్యంలో ఈ క్రింది వ్యాసం ఆలోచించతగ్గది. ఆంధ్రభూమి 00

అవధాన రాజధాని- ఒక నివేదిక

శ్రీ మోచర్ల హరికృష్ణ తెలుయజేస్తున్నారు. ‘అవధాన రాజధాని’  కార్యక్రమములు  02 11 2014 నుండి 09 11 2014 వరకూ భారత రాజధానిలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మచే  అవధాన సరస్వతీపీఠం వారి ఆధ్వర్యంలో  ఢిల్లి తెలుగు అకాడెమి వారి సహకారముతో  కన్నుల పండువగా నిర్వహింప బడినవి . ఈ కార్యక్రమములో  ఎందరో మహనీయులు పాల్గొని అవధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మని, వారి సృజనాశక్తిని, అసాధారణమైన ధారణాశక్తిని, సుమధుర గాత్ర  సంగీతమును వేనోళ్ళ ప్రస్తుతించిరి.  ఈ… Read More »

హృదయోల్లాసానికి కవికులం ‘లో’కులం

ఆసక్తికరమైన ఈ క్రింది వ్యాసం పంపినవారు- ప్రముఖ తెలుగు పండితులు, రచయిత డా. జొన్నలగడ్డ మార్కండేయులు. కవిత్వం హృదయోల్లాసానికి. కథలు వ్రాసేవారు కథకులం అని చెప్పుకున్నట్లే, కవితలు అల్లేవారు కవికులం అని చెప్పుకోవచ్చు. కానీ కొందరు కవికులం వంటి పదాల్లో ఉన్న కులాన్ని వెదుకుతూ తాము లోకులం అని చెప్పుకుంటారు. వారిది ఖచ్చితంగా ‘లో’(low) కులం. ఇప్పుడు కవుల కులాల విషయానికొద్దాం. ఆదికవి వాల్మీకి గజదొంగగా గడిపి- కవిగా మారేడన్నది ప్రచారంలో ఉన్న కథ. కవికులమంతా ఆయనకు… Read More »

పద్యాలు వాన కురిపిస్తాయి

ప్రముఖ తెలుగు పండితులు, రచయిత- డా. జొన్నలగడ్డ మార్కండేయులు అందిస్తున్న ఆసక్తికరమైన ఈ సమాచారం మీతో పంచుకోవాలని….. వానలింకా కురియకపోవడముతో ప్రజల ఆందోళనచూసి ప్రభుత్వము చలిస్తోంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా? శాస్త్రీయయుగములో దేవుణ్నెంతవరకు నమ్మవచ్చు?వీటి ఆలోచనలు అధికార,ప్రతిపక్ష వాదోపవాదనలులా ప్రజలతీర్పుకు జయాపజయాలున్నాయి. ఒకరాయి విసిరితేపోలా?దేవుడిరూపంలో శిలయై మౌనముగా ఉనికిని చాటుతున్న దేవాలయాలు సాక్షిగా వరుణయాగము సవాలును శిలామూర్తి అధికారికంగా స్వీకరించకతప్పలేదు.  ఫలితము దైవాధీనము. యజ్ఞయాగాదులగురించి, వేదపండితులు ఋత్విజులు ఎన్నో ఉదాహరణలు చెబుతారు. మంత్రశబ్దసంగతి నిష్ఠాగరిష్టత కాదనలేనిది. కాని ప్రాధాన్యత… Read More »

నమో నమో

కవుల ప్రపంచం వేరు. వారు మనుషుల్లో దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి మనిషిగా చూస్తారు. మంచి ఉంటే రాక్షసులనీ స్తోత్రం చేస్తారు. చెడు ఉంటే దేవతల్నీ ఈసడిస్తారు. వారికి సమయానుకూల స్పందనలే తప్ప వ్యక్తిగత రాగద్వేషాలుండవు. రజాకార్ల దురాగతాల సమయంలో నిజాంకు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించిన మా తాతగారు- ఆ తర్వాత వైభవం పోయిన నిజాంను చూసి కళ్లనీళ్లు పెట్టుకుని కవిత్వం చెప్పారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా- పండిట్ నెహ్రూని శాపవశాన భూమ్మీద అవతరించిన గంధర్వుడిగా … Read More »