Stats

Comments Posted By అంబల్ల జనార్దన్

Displaying 1 To 7 Of 7 Comments

కథల పోటీ- నవ్య
00

మీరిచ్చే కథల పోటీల వివరాలు, ఫలితాలు మాకెంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు. శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారి “అభిజ్ఞకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డుతో పాటు నది పత్రిక వారి పురస్కారం లభించింది. ఒకే నవలను వేరు వేరు పోటీలకు పంపడం సభ్యత కాదనుకుంటాను.
-అంబల్ల జనార్దన్

» Posted By అంబల్ల జనార్దన్ On June 9, 2014 @ 1:39 pm

రచయితల సమావేశం
00

తేది ౧౪-౦౩-౨౦౧౪ స్వాతి సపరివార పత్రికలోని మీ కథ “అజ్ఞాత వాసం” తథాకథిత ఆధునికవాదులను ఆలోచింపజెసేదిగా ఉంది. భౌతిక సుఖాల్లోమునిగి మనం మన సృజనాత్మకతను ఎలా కోల్పోతున్నామో సోదాహరణంగా వివరించారు. అభినందనలు.

» Posted By అంబల్ల జనార్దన్ On March 28, 2014 @ 6:25 pm

ఆహ్వానం- పుస్తకావిష్కరణ
00

వసుంధర గారూ!
నా ఆహ్వానాన్ని అక్షరజాలంలో పెత్తినందుకు ధన్యవాదాలు. వీలుంటే కార్యక్రమానికి రాగలరు.

» Posted By అంబల్ల జనార్దన్ On May 4, 2013 @ 9:38 am

కథల పోటీ- నవ్య
00

వసుంధర గార్లకు
నమస్కారం. స్వప్న మాస పత్రిక ఉగాది కథల పొటీలో మీ కథ “అమ్మతనం” కు రెండవ బహుమతి వచ్చినందుకు అభినందనలు.
కథ చదివింతర్వాత నా అభిప్రాయం తెలుపగలను.
ఈ పోటీ గురించి మీ అక్షరజాలం ద్వారానే తెలిసింది. ఈ మెయిల్ ద్వారా కథ పంపవచ్చనే మీ సమాచారాం ఆధారంగా నేను కూడా ఓ కథ మెయిల్ ద్వార పంపాను. అది సాధారణ ప్రచురణకు స్వీకరించారు. మీ బ్లాగ్ ద్వారా విలువైన సమాచారం ఇస్తున్నందుకు ధన్యవాదాలు.
–అంబల్ల జనార్దన్

» Posted By అంబల్ల జనార్దన్ On March 28, 2013 @ 11:59 pm

దొరకునా ఇటువంటి సేవ
00

Good story. This highlights how people have become so dependent of maid servants. That is why they tolerate all their whims and fancies. Congrats.

» Posted By అంబల్ల జనార్దన్ On February 1, 2013 @ 9:58 pm

ముందుమాట
00

అమ్మతనం-అభిప్రాయం
వసుంధర గార్లకు నమస్కారాలు.
స్వప్న ఏప్రిల్ 2013 సంచికలోని మీ ‘అమ్మతనం’ చాలా బావుంది. పల్లవి పాత్ర చిత్రణ అద్భుతం. కొబ్బరికాయ పైకి కఠినంగా ఉన్నా దాని లోపలి నీరు, కొబ్బెర మధురంగా, మృదువుగా ఉన్నట్టే పల్లవి, పైకి కఠినంగా కనిపించినా, ఆమెలోని ‘అమ్మ ‘ మనసు నవనీతం. మనం ప్రేమించే వారి గురించే ఎక్కువ ఆలోచిస్తామని చెప్పడానికి పల్లవి పాత్ర మంచి ఉదాహరణ. ఐతే పల్లవి పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీరు హరికి అన్యాయం చేసారనిపించింది. తన తల్లిదండ్రులకంటే పల్లవి దంపతులనే ఎక్కువ అభిమానించే హరి, ఏడు సంవత్సరాలు, ఒక్క ఫోను చేయకుండా గాని, ఉత్తరం రాయకుండా గాని అదృశ్యమయ్యాడంటే నమ్మబుధ్ధి కాదు. ఈమెయిల్, వెబ్ కమేరా సౌకర్యం ఉన్న నేటియుగంలో అదంత సహజంగా లేదు. దానివల్ల కథకి నాటకీయత వచ్చిందేమోగాని సహజత్వం లోపించిందనిపించింది. అయినా దానివల్ల ఇతివృత్తానికి కలిగిన నష్టం లేదు. మీ కథలను విమర్శించే స్తాయి నాకు లేదు, కాని ఒక సామాన్య పాఠకుడిగా నా భావాలు పంచుకోవాలనిపించి మీకు రాస్తున్నాను. తప్పైతే క్షమించ గలరు.
మీ అభిమాని
-అంబల్ల జనార్దన్

» Posted By అంబల్ల జనార్దన్ On April 14, 2013 @ 9:27 pm
00

“నవ్య” పేజీ కథల ఫలితాలు వచ్చాయా?

» Posted By అంబల్ల జనార్దన్ On January 19, 2013 @ 6:06 pm

«« Back To Stats Page