Stats

Comments Posted By అరిపిరాల

Displaying 1 To 20 Of 20 Comments

కథల పోటీలు- సాహితీస్రవంతి
00

సాహితీస్రవంతి పత్రిక మునుపు అంతర్జాలంలో కూడా లభించేది. ప్రస్తుతం జూన్ 2012 సంచిక దాకా మాత్రమే లభ్యం… సి.పి. బ్రౌన్ ఎకాడమీ మా ఆఫీస్ కు దగ్గర్లోనే వుంది. నేను ఒకసారి వెళ్ళి కనుక్కుంటాను.

» Posted By అరిపిరాల On April 16, 2013 @ 9:31 pm
00

ఈ పోటీల గురించి ఎలాంటి సమాచారం తెలియరాలేదు… ఎక్కడైనా ఫలితాలు ప్రకటించారా?

» Posted By అరిపిరాల On April 14, 2013 @ 3:30 pm

కథల పోటీ- కథాకేళి
00

కథాకేళి యాజమాన్యంతో మాట్లాడాను. ఈ పోటీ గడువును సెప్టెంబరు 20వ తేదీకి పొడిగించినట్లు తెలియజేశారు.

» Posted By అరిపిరాల On August 30, 2013 @ 2:50 pm

నోముల కథల పోటీ
00

ఈ పోటీ గడువు తేదీ 25 జూలై. గమనింఛగలరు.

» Posted By అరిపిరాల On July 6, 2013 @ 6:12 am

కథల పోటీ- ఆంధ్రభూమి
00

ఈ పోటీ గడువు జనవరి 31 వరకు పొడిగించారు.. దయచేసి గమనించగలరు…

» Posted By అరిపిరాల On January 24, 2013 @ 9:15 pm

అఖండ జ్యోతి
00

మా ఇంట్లో బుడుగు పుస్తకం తీసి మా అమ్మాయికి చదివి వినిపించినప్పుడు పాపాయి నవ్వినప్పుడల్లా నాకు రమణగారు కనిపిస్తారు. మా వూరు వెళ్ళినప్పుడు మా ఇంటి పక్కన లావుపాటి పిన్నిగారు నడుచుకుంటూ వస్తుంటే ఆమె ఆయాసం చూసి రమణగారు కిసుక్కున నవ్వుతారు. “ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం. కాకపోతే మగవాళ్ళు కాస్త ఎక్కువ సమానం” అని నేను మా ఆవిడతో అంటే ఆమె రమణగారిని పిలిచి మరీ చీవాట్లేస్తుంటుంది…

ఇలాంటివాళ్ళు పోయినప్పుడు కూడా జోకులేసుకోవాలి తప్ప బాధపడకూడదు. జబర్దస్తీగా జయంతులు, పండగలు చేసుకోవాలి తప్ప స్మరణలు, మూడు నిముషాల మౌనాలు పనికిరావు…

రమేష్ గారు – “సుకవి జీవించు ప్రజల నాల్కలందు…” అదీ విషయం.

» Posted By అరిపిరాల On June 29, 2012 @ 7:37 am

విశ్వసాంఖ్యాచార్య డా.లక్కోజు సంజీవరాయశర్మ
00

ఇది కూడా చదవండి…

http://nuvvusetty.wordpress.com/2007/09/04/%E0%B0%97%E0%B0%A3%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81-%E0%B0%B8%E0%B0%82/

» Posted By అరిపిరాల On May 17, 2012 @ 2:26 pm

కథలు, కవితల పోటీలు
00

సాహితీ కిరణం పత్రిక పోటీలకు పత్రిక చందాదారులు మాత్రమే అర్హులు. గమనించగలరు.

» Posted By అరిపిరాల On April 10, 2012 @ 3:44 pm

కథల పోటీ ఫలితాలు- ప్రజాశక్తి
00

ప్రజాశక్తి సంక్రాంతి కథలపోటీలో సాధారణ ప్రచురణకి స్వీకరించిన కథల జాబితా ఈ రోజు (19 ఫిబ్రవరి 2012) ఆదివారం అనుబంధం “స్నేహ” లో ప్రకటించారు.

» Posted By అరిపిరాల On February 19, 2012 @ 5:07 pm

కథల పోటీ- ఆశ
00

గురజాడ స్మారక కథానికల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు మే సంచికలో ప్రకటించారు. సరదా కథల పోటీ ఫలితాలు వచ్చే మాసం ప్రకటిస్తామని ప్రచురించారు.

» Posted By అరిపిరాల On April 29, 2012 @ 8:38 am

ఉగాది కథల పోటీ- నవ్య
00

ఆఖరుతేదీ 2013 కాదండోయ్.. 2012. పొరపాటుకు క్షంతవ్యూణ్ణి.

» Posted By అరిపిరాల On December 1, 2011 @ 7:04 pm

అమావాస్య హారర్ కథల, నవలల పోటీ- గడువు పెంపు
00

హైదరాబాదులో ప్రముఖంగానే కనపడుతోందండీ… అమీర్ పేట్, లకడీకాపూల్, హిమాయత్ నగర్ లలోని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలలో చూశాను..

» Posted By అరిపిరాల On June 10, 2011 @ 9:15 pm

సభికులు-జూదరులు
00

తెలుగు సాహిత్యం పై మమకారం చావక ప్రతి సభలో ఆవిష్కృతమయ్యే ప్రతి పుస్తకంలొ ఏదో వుంటుందని “ఆశించి”, కొంత డబ్బు పెట్టి “కొని”, చదివి అందులొ ఏమీ లేదని “నిరాశ” పడే వాడు కూడా జూదగాడే కదా… ఆ లెక్కన చూసినా మీ పదం తప్పు కాదులెండి…

» Posted By అరిపిరాల On May 12, 2011 @ 4:33 pm

యూనికోడ్ నుంచి అనూకి
00

అంతర్జాలంలోని తెలుగు బ్లాగర్లకి, రచయితలకి ఇది శుభవార్త. ఇప్పుడు వస్తున్న బ్లాగు రచనలన్నీ యూనీకోడ్‌లోనే వున్నాయి. వాటిని పుస్తకంగా ప్రచురించాలంటే దాదాపు అందరు పబ్లిషర్లు వాడే అనూ వంటి ఫాంటుల్లోకి మార్చుకోవడం తప్పదు. ఆ కారణంగా చాలామంది రచయితలు తమ రచనలని తిరిగి అనూఫాంటులో టైపు చేసి/చేయించి ప్రచురించుకోవాల్సి వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఆ సమస్య తీరినట్టే. శ్రీ మహేందర్‌గారికి అభినందనలు.

» Posted By అరిపిరాల On December 18, 2010 @ 3:00 pm

కథావసంతం కథల పోటీ
00

ఈ పోటి ఫలితాలు ప్రకటించారు. వివరాలు మొన్నటి (20.06.2010) ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో..

» Posted By అరిపిరాల On June 23, 2010 @ 8:12 am

ఆంధ్రభూమి కథల పోటీ ఫలితాలు
00

ఈ మధ్య కథలపొటీ ఫలితాలు చూస్తుంటే నాకు పుట్టిన రెండు శంకలు –

1. ప్రధమ బహుమతికి అర్హమైన కథలు లేవు అనే ప్రకటన చాలా తరచుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం అనుబంధాలు (ఈనాడు కథల పోటీలో కూడా ప్రథమ బహుమతి లేదు), చిన్న పత్రికలు. అయితే రాసికేం కొదువలేదని వక్కాణింపులూ వున్నాయి.

2. ఇక రెండొవది విజేతలుగా అవే పేర్లు మార్చి మార్చి కనపడుతున్నాయి. (రచయితలపైన ,వారి కథలపైన, వాటి అర్హతలపైనా నాకెలాంటి అనుమానం లేదు) చెప్పొచ్చేదేమిటంటే కొందరే కథకులు తరచుగా విజేతలుగా నిలుస్తున్నారు. ఇలాంటి ఉత్తమ కథకులు కేవలం పోటిలకి మాత్రమే వ్రాస్తుండటం ఒక కారణం కావచ్చు.

పైన రెండు అనుమానాలు కలిపి చదివితే వచ్చే మూడో అనుమానం – ఇలాంటి బహుమతి పొందే రచయితలు కేవలం పెద్ద పత్రికలకి “మంచి” కథలు పంపుతూ, మిగిలిన చిన్న పత్రికలకి (పెద్దా చిన్నా వారిచ్చే పారితోషికంగా గమనించాలి) ఒక మోస్తరు కథలని పంపుతున్నారా? అలాగైతే స్వాతిలొనో మరో “పెద్ద” పత్రికలో వచ్చిన సాధారణ ప్రచురణ కథ, ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వచ్చే రెండొవ బహుమతి కథ కన్నా “మంచి” కథయ్యే అవకాశం లేదా?

ఇలాంటి తలతిక్క ప్రశ్న ఎందుకు అడుగుతున్నానో పట్టించుకోకుండా సమాధానం పదుగురికి వుపయోగపడుతుందనుకుంటే చెప్పండి.

» Posted By అరిపిరాల On February 10, 2010 @ 4:15 pm

ఆంధ్రభూమి దినపత్రిక స్వర్ణోత్సవ పోటీలు
00

ఈనాడు ఆదివారం అనుబంధం కూడా కథల పోటీ ప్రకటించింది అని విన్నాను. మీరు చూసే వుంటారు. అదికూడా తెలియజేయండి. మా లాంటి ప్రవాసులకి వుపయోగం.

» Posted By అరిపిరాల On August 26, 2009 @ 2:09 pm

సాహితీవైద్యం
00

వసుంధర గారు,

తొలి అడుగులు వేస్తున్న నా లాంటి రచయితలకు మీ ఆసరా కొండంత అండ. మీకు అనేకానేక నెనర్లు.

సాహితీ వైద్యంకోసం కథలు ఏ మైల్ ఐడికి పంపాలి? దయచేసి తెలుపగలరు.

satyaonline(at)gmail(dot)com

» Posted By అరిపిరాల On May 4, 2009 @ 11:41 am

ముందుమాట
00

ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.

» Posted By అరిపిరాల On December 21, 2011 @ 10:16 pm
00

యువకథలపోటీ కాదండి.. యువకథకుల కథాసంకలనం గురించి ప్రకటించారు. నందలూరు కథానిలయం వారు ఈ సంకలనం తెస్తున్నారు. వివరాలు ఈ లంకెలో వున్నాయి.:
http://aksharajalam.wordpress.com/2011/10/29/%E0%B0%AF%E0%B1%81%E0%B0%B5%E0%B0%95%E0%B0%A5%E0%B0%95%E0%B1%81-%E0%B0%86%E0%B0%B9%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82/

» Posted By అరిపిరాల On November 4, 2011 @ 8:03 am

«« Back To Stats Page