Stats

Comments Posted By ఆకునూరి మురళీకృష్ణ

Displaying 1 To 10 Of 10 Comments

ఆటోనగర్ సూర్య- చిత్రసమీక్ష
00

చిత్ర సమీక్ష, మీ అనుభవం చాలా బాగున్నాయి. బహుశా తెలుగు రచయితలు దర్శకుల దగ్గరకీ, తెలుగు దర్శకులు రచయితల జోలికీ రాకుండా, ఇలా రచయితలని సినిమా విశ్లేషణ (పోస్ట్ మార్టమ్) కి మాత్రమే పరిమితం చేయడానికి ఇదే కారణం అనుకుంటా. మెన్ ఆర్ ప్ర్హమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ లాగా రచయితల, దర్శకుల ఆలోచనా ధోరణిలో వున్న ఈ వ్యత్యాసమే ఇద్దరికీ సాపత్యం కుదరకుండా చేస్తోందేమో. మీరిచ్చిన లింకు ప్రకరం కలికాలం ఆడది సినిమా చూడాలని ప్రయత్నించాను. నాలుగు సీన్లకి మించి చూడలేకపోయాను. మీరిచ్చిన స్క్రిప్టు గురించి తెలుసుకోవాలని వుంది.

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On July 12, 2014 @ 9:11 am

మనం- చిత్రసమీక్ష
00

ఈ చిత్రం చూసినప్పుడు నాక్కూడా ఏదో లోపం వుందని కొద్దిగా అసంతృప్తిగా అనిపించింది. అది లోపం కాదనీ, ఇంకా బాగా తీయగలిగే అవకాశాన్ని దర్శకుడు మిస్ చేసుకున్నాడన్న అసంతృప్తితో అలా అనిపించిందన్న విషయం మీ లోతైన విశ్లేషణ చదివాక అర్ధమైంది. ఒక సినిమా సినిమా వచ్చినప్పుడు- దాని మీద మీ స్పందన కోసం ఎదురు చూసేలా వుంటున్నాయి మీ సమీక్షలు. అభినందనలు ‘వసుంధర’ కి!!

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On June 29, 2014 @ 1:44 pm

ఆలస్యానికి దారేది?
00

‘అర్జునుడూ అనసూయమ్మ’ కథ బాగుంది. చాలా పాత కథ అనుకుంటాను, సందర్భానుసారంగా మీరు శ్రధ్ధగా స్కాన్ చేసి పెట్టిన విధానం ఆకట్టుకున్నాయి. మీరు కథ చెప్పే విధానం అద్భుతం !! అందుకోండి మరోసారి అభినందనలు !!

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On December 18, 2013 @ 11:43 pm

తెలుగులో టైపింగుకి కొన్ని చిట్కాలు
00

మీకూ, విశాలాన్.నెట్ వారికీ అనేక ధన్యవాదాలు వసుంధర గారూ

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On December 19, 2013 @ 12:40 am

అత్తారింటికి దారేది- చిత్రసమీక్ష
00

మల్టీ ప్లెక్స్ ల పుణ్యమాని ఈ మద్య తెలుగు సినిమాలు ప్రవాసాంధ్ర లో కూడా విడుదలవుతున్నాయి. అలా పి.వి.ఆర్. ధియేటర్స్ వారు చండీగర్ లొ కూడా విడుదల చేయడంతో, రద్దీ బాధ లేకుండానే మొదటి ఆదివారం నాడే ఈ సినిమాని చూడగలిగాం. వసుంధర గారి రివ్యూ ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తుండగా రానే వచ్చింది. సినిమాలాగే రివ్యూ అలరించింది.
సినిమాలో పవన్ అత్త ఇంట్లో కి అడుగు పెట్టే సీన్, బయటికి వచ్చే సీన్ చిత్రీకరించిన విధానాం, రైల్వే స్టేషన్ లో క్లైమాక్స్ సీన్ లోని పవన్ డైలాగ్స్ ఇలాంటివి ఎన్నో సార్లు చూసిన ఈ పాత కథకి మంచి హైప్ ని తీసుకుని వచ్చాయి. సాధారణ కథని కథనం లో ప్రతిభ చూపించడం ద్వారా ఎలా ‘అధ్బుతం’ చేయచ్చో ఈ సినిమా చెప్పింది. అయితే, కథనం కథ కి అలంకారం కావాలి తప్ప కథ అలంకార ప్రాయమైపోవడం ఆరోగ్యకరమైన పరిణామం కాదు.

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On November 6, 2013 @ 12:21 am

డిటెక్టివ్ వెంకన్న కథలు
00

అభినందనలు, మరియు శుభాకాంక్షలు వసుంధర గారికి !!

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On November 11, 2013 @ 9:44 pm

కరుణాకర్ ఇక లేరు….
00

కరుణాకర్ గారు ఇక లేరన్న వార్తని జీర్ణించుకో లేక పోతున్నాను. ఈ సందర్భంగా వారు నా కథలకి గీసిన ఎన్నో అందమైన చిత్రాలు గుర్తొస్తున్నాయి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On September 13, 2013 @ 10:44 pm

ఇయం సీతా మమ సుతా
00

కథ అనువాదం, పేరు పెట్టడం అద్వితీయం. నాగమణిగారి కామెంట్ బాగుంది.

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On July 26, 2013 @ 8:47 am

మిథునం- చిత్రసమీక్ష
00

వసుంధర సినిమా సమీక్ష చదవడం నా మటుకు నాకు వొక అధ్బుతమైన అనుభవంలా ఆనిపిస్తుంది. చిన్న పిల్లలు దాచుకుని దాచుకుని మిఠాయి తిన్నట్టుగా నెమ్మదిగా గంట సేపు చదివాను. మిథునం కథాపుస్తకానికి మీరు రాసిన ముందుమాట లింకు ద్వారా చదివే భాగ్యం కూడా కలిగింది. కథంత బాగా వుంది ముందు మాట.

పదిహేనెళ్ళ క్రితం మిథునం కథ చదివాను. మొన్న జెమిని టివి లొ మిథునం సినిమా చుసాను. తరువాత మళ్ళి నెట్లొ మిథునం కథని చదివాను. వెటికవే అధ్బుతం అనిపించాయి.

మార్పులు, చేర్పులతో సహా అలా కథ, సినిమా రెండూ రెండే అని నేను చుసిన వాటిల్లొ నాకు అనిపించిన సినిమాలు – గోరింటాకు (రంగనాయకమ్మ గారి ‘ఇదే నా న్యాయం’ నవల) ఛాలెంజ్ (యండమూరి వీరెంద్రనాథ్ గారి డబ్బు టు ది పవరాఫ్ డబ్బు నవల), త్రీ ఇడియెట్స్ (చేతన్ భగత్ ఫైవ్ పాయింట్ సం వన్ నవల- ఈ నవలని ఐ ఐ టి లో అత్తెసరుగాళ్ళు అన్న పేరుతొ శ్రిమతి శాంత సుందరి తెలుగులోకి అనువదించారు)

మిథునం సినిమాలో బాలు, లక్ష్మి గార్ల ఆకారం, ఆహార్యం విషయంలొ (ముందుగానె కథ చదివి వొక వూహ మనసులో వుంది కనుక) నాకూ మీలాగే ఫిర్యాదు వున్నా, శ్రీరమణ గారు కథలో రాసిన సంభషణలని యథాతథంగా ఎంతో సహజంగా వాళ్ళు పలికిన తీరుకి (ముఖ్యంగా లక్ష్మిగారు) హ్యట్సాఫ్ అనాలనిపించింది.

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On May 31, 2013 @ 12:03 am

గుండె జారి గల్లంతయ్యిందే- చిత్రసమీక్ష
00

సినిమాని కళ్ళకి కట్టించారు. ఇలాంటి సినిమాలూ, ఇలాంటి సమీక్షలూ వర్థిల్లాలి.

మంచి మాట : ” ఈ చిత్రంలో నితిన్‍కి ఏ అలవాటూ లేకపోయినా కథకి, కథనానికి ఏ లోటూ రాదు. ప్రతిభ గల దర్శకులు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని మన యువతని తప్పుదారి పట్టించడం మానుకోవాలని మనవి”.

» Posted By ఆకునూరి మురళీకృష్ణ On May 17, 2013 @ 10:57 pm

«« Back To Stats Page