Stats

Comments Posted By ఆర్.దమయంతి

Displaying 1 To 4 Of 4 Comments

కథల పోటీ ఫలితాలు- స్వప్న
00

అమ్మ తనానికి అద్దం పట్టిన కథ.
నమస్తే.

మీ కథ అమ్మతనం పూర్తిగా చదివాక, నా అభిప్రాయాన్ని తెలియ చేయా ల నిపించింది.
తల్లి ప్రేమ ని, మాతృ హృదయ తత్వాన్ని – ఎన్ని విభిన్న కోణాల నించి పరిశీలించి చూసినా, చివరికి ఫలితం ఒకటి గానే వుంటుంది. అదే – అమృతత్వం.
ఆ తరహాలో నే సాగుతుంది ‘ అమ్మతనం’ కథ కూడా.
కథ, కథనం కూడా కొత్త గా వుంది.
పాత్రల మస్తత్వాలను కళ్ళకు కట్టినట్టు వుంటమే కాకుండా, చాలా సహజం గా అనిపిస్తాయి. వీళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్లేనన్నట్టు తోస్తాయి.
ఉదాహరణకి, తన భార్య తనకు పూర్తిగా అర్థం కానిదే అయినా, ఆమె లోని మానవ త్వం మీద ఆ భర్తకి ఎనలేని నమ్మ కం ఉండటం..అలాగే,
– హరి వస్తున్నాడని భర్త చెప్పగానే తన అక్కసంతా ఆమె- తన మాటల్లో వెళ్లగక్కడం అంతా సహజం గా చిత్రీకరించారు రచయిత.
నాకు బాగా గుర్తున్న కారెక్టర్ – హరి తండ్రి – జగదీష్.
కొడుకు అమెరికా నించి వస్తానంటే..రావొద్దు, ఆ డబ్బు తమ కు పంపమని కోరే తల్లి తండ్రులూ వుంటారనడానికి ఇతనొక సాక్ష్యం. ఇది నిజం గా విషాదమే అయినా, ‘ కాసుకి లోకమే కాదు, కన్నవాళ్ళూ దాసోహమే ‘ అనే నిజం – ఇక్కడ ఋ జవు గా నిలుస్తుంది.
హరి ఇండియా కొచ్చి, తన తల్లి తండ్రుల్ ని సైతం చూడ్డానికెళ్ళకుండా..కేవలం అమ్మ కాని అమ్మని చూడ్డానికెందుకొస్తున్నట్టు?
ఇదే సంశయం ఆయనకీ కలిగింది. ‘ అవును. ఎందుకొస్తున్నట్టు?’ అనే ఆయన సంశయానికి..
కథ లోని చివరి ఆ ఒక్క పేరా చాలు. ( అదేమిటనేది నేను చెప్పడం కంటేనూ, చదివితేనే బాగా అర్ధమౌతుంది. అందుకే ఆ రహస్యాన్ని నేనిక్కడ రాయదలచుకోవడం లేదు.)
అది చదవగానే, పాఠకుల కు ఒక మాతృ హృదయం కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుంటుంది. కమ్మనైన అమ్మతనం కళ్ళ ముందు కదులుతుంది. ఆ పైన, కళ్లలో కన్నీరొలికి, మనసు మీద పన్నీరు చిమ్మి పోతుంది.

కథ చదివాక, – మంచి కథ చదివామనే తృప్తి మిగులుతుంది.
కథా, కథనం రెండూ ఆకట్టుకున్నాయి. రచనలో రెండు మూడు చోట్ల కొన్ని తెలుగు పదాలు కొత్త చెరకు ముక్కల్లా తీయగా అనిపిస్తాయి.
అలాగే ఇంకో చోట కూడా ..ఎంతకూ అర్ధం కాని తన భార్య గురించి తనలో తాను విశ్లేషించుకుంటూ –
‘తన బాధేమిటో తెలీదు. సమస్యలున్నాయంటుంది. పరిష్కారాలకి ఒప్పుకోదు.’ అంటూ అనుకోవడాన్ని చదవం గానే నవ్వొచ్చింది. అసలు సిసలైన ఓ ఇల్లాలి మనస్తత్వానికి అద్దం పట్టిన ఈ వైనం అందరికీ నచ్చుతుంది.
‘ అందుకే ఈ కథ – బహుమతిని అందుకుంది ‘ అని ఒప్పుకోక తప్పదు ‘ అమ్మతనం’ చదివిన ఏ పాఠ కునికైనా!
శుభాభినందనలతో..
– ఆర్.దమయంతి.

» Posted By ఆర్.దమయంతి On April 6, 2013 @ 8:07 am
00

వసుంధర గారూ!
స్వప్న ఉగాది కథల పోటీలో మీ కథ ‘ అమ్మతనం ‘ రెండవ బహుమతి గెలుచుకున్నందుకు నా అభినందనలు తెలియ చేస్తున్నాను.
నమస్సులతో..
ఆర్.దమయంతి.

» Posted By ఆర్.దమయంతి On March 31, 2013 @ 7:10 am

కథలు, కవితల పోటీ- సాహితీకిరణం
00

నారీ భేరి
ఉగాది హాస్య కథలు, కవితల పోటీ

ఉగాది హాస్య కథలు, కవితల
ఉగాది సందర్భంగా నిర్వహించే హాస్య కథలు, కవితల పోటీ లకు నారీ భేరి మాస పత్రిక – ఆహ్వానం పలుకుతోంది.
బహుమతి వివరాలు.
హాస్య కథలకు
ప్రథమ బహుమతి రూ. 1,116.
ద్వితీయ బహుమతి రూ.516.
తృతీయ బహుమతి రూ.216.
కవితలకు
ప్రథమ బహుమతి రూ.516
ద్వితీయ బహుమతి రూ.216.
తృతీయ బహుమతి రూ.116.
పోటీ నిబంధనలు:
* కథ, కవిత ప్రతుల మీద పేరు మాత్రమే ఉండాలి. రచయితకు సంబంధించిన సమాచారంతో పాటు హామీ పత్రాన్ని ప్రత్యేకంగా జతపర్చాలి.
* ఎ4 సైజు కాగితం పై చక్కని చేతి వ్రాత్రతో ఒక పక్క మాత్రమే రాయాలి. 2 పేజీలకు మిం చకూడదు.
* అశ్లీలత, అసభ్యత కుల, మత విద్వేషాల్ని రెచ్చగొట్టే ధోరణులు, రాజకీయాలు, వెకిలితనం లేకుండా హాయిగా నవ్వించే కథలు, సృజనాత్మక కవితలు పంపాలి.
* ఎంపిక కాని కథలు, కవితలపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలుండవు.
* రచనలు తిప్పి పంపాలని కోరుకునే రచయితలు అందుకు అవసరమైన స్టాంపులు అంటించిన కవర్లు జత పర్చాలి. రచయితలు తమ చిరునామాను స్పష్టం గా (ఫోన్ నెంబర్ తో సహా) రాయాలి.
*అంతిమ నిర్ణయం న్యాయ నిర్ణేతలదే.
* రచనలు చేరవల్సిన ఆఖరి తేది : ఏప్రిల్ 15.
చిరునామా:
సంపాదకులు
నారీ భేరి సంపూర్ణ మహిళా మాస పత్రిక
డోర్ నెంబర్ 12-3-129, మేడ పైన 4 వ క్రాస్, సాయి నగర్, అనంతపురం.
సెల్ : 9492330110
*****

» Posted By ఆర్.దమయంతి On March 31, 2013 @ 12:24 pm

సాహిత్య పురస్కారాలకు ఆహ్వానం
00

సాహితీ కిరణం చతుర్థ వార్షికోత్సవం సందర్భంగా
కార్తికా డవలపర్స్ వారి సౌజన్యం తో..
హాస్య కథల పోటీ
బహుమతుల మొత్తం రూ. 5000/-

ప్రధమ బహుమతి రూ. 1800/-
ద్వితీయ బహుమతి రూ. 1200/-
తృతీయ బహుమతి రూ.750/-
5 ప్రోత్స్చాహక బహుమతులు ఒకొక్కరికి రూ.250/-
* కథ ఏ అంశానికైనా చెందినదై హాస్యం గా ఉండాలి. హాస్యం పేరుతో అశ్లీలత చోటు చేసుకో కూడదు. కథ అచ్చులో మూడు పేజీలకు మించ కూడదు. హామీపత్రం విధిగా జత చేయాలి. కవరు మీద ‘ కార్తీక డవలపర్స్ హాస్య కథల పోటీ కి’ – అని స్పష్టం గా పేర్కొనాలి.
**
డా. .పట్టాభి కళాపీఠం సౌజన్యం తో
కవితల పోటీ
బహుమతుల మొత్తం రూ. 4000/-
ప్రధమ బహుమతి రూ. 1500/-
ద్వితీయ బహుమతి రూ.1000/-
తృతీయ బహుమతి రూ. 500/-
5 ప్రోత్స్చాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ. 200/-
కవిత ఏ అంశానికైనా చెందినదై ఉండవచ్చును. కవిత 20 లైన్లకు తక్కువ కాకుండా 30 లైన్లకు మించకుండా వుండాలి. హామీ పత్రం విధిగా జత చేయాలి. కవిత పంపే కవరు మీద సాహితీ కిరణం చతుర్థ వార్షికోత్సవ కవితల పోటీ కి అని స్పష్టం గా పేర్కొనాలి.
కవి/కవయిత్రి/రచయిత/రచయిత్రి/ చిరునామా ఫోన్ నెం. వగైరా కవిత/హాస్య కథ ఉన్న పేపరు మీద కాకుండా విడిగా హామీ పత్రం పై రాయాలి. బహుమతి పొందని కవితలు, కథలు కొన్నింటిని సాధారణ ప్రచురణకు స్వీకరించబడతాయి. వాటికి ఎటువంటి పారితోషికం ఉండదు.
బహుమతి ప్రధానోత్సవం 28 మే 2013 న హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గాన సభ కళా సుబ్బారావు కళా వేదికలో జరుగుతుంది.
విజేతలు స్వయంగా వచ్చి బహుమతి తీసుకొనవలసి వుంటుంది.
హా స్య కథ లు/ కవితలు చేరవలసిన ఆఖరి తేది
30 ఎప్రియల్ 2013
చిరునామ 11-13-154, రోడ్ నెం. 3 అలకాపురి, హైదరాబాద్ – 35, సెల్: 9490751681

» Posted By ఆర్.దమయంతి On March 27, 2013 @ 8:07 am

«« Back To Stats Page