Stats

Comments Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ

Displaying 1 To 7 Of 7 Comments

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

రాబోయే ఎన్నికలలో, అప్పటిదాకా ఆ.ఆ.పా వుంటే, అల్ప పెట్టుబడితో ( ఆ పార్టీ గుర్తు చౌకేగా) ఉభయ సభలలో ఏదో ఒకదానిలో సభ్యత్వం వస్తే ఆశ తీరుతుంది.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 4, 2015 @ 11:06 pm
00

మతమన్నది వ్యక్తిగతమైనంతవరకు అభ్యంతరములేదు. అది సంస్థాగతము ఐతే! జరుగుతున్న సంఘటనలే దాని ఫలితాలు. వ్యక్తిగతమైనది సమాజములోనికి తెచ్చి లబ్ధిపొందిన లబ్ధప్రతిష్టులున్నారు. రామ జన్మభూమి పేరుమీద లబ్ధి పొందిన వారు ఒకరైతే రావణకాష్టం ఆరకుండా ఆజ్యంపోస్తూ అందలమెక్కుతున్నవారు మరికొందరు. మతమన్నది అంటరానిదైతే ఒక వ్యక్తి సూత్రీకరించిన భావజాలాలను భుజాలపై మోస్తూ అరాచకము సృష్టించు శక్తులను ఏపేరుతో గుర్తించాలి?ఆ ఇజాలకు మతానికి భేదమేమిటి? పేరు మార్పు, ఫలితమదే! మనుగడకు ఒక మతమో, ఒక ఇజమో ఆధారమైనప్పుడు అది గర్హనీయమే ! సమాజ శ్రేయస్సు కొఱకు ఈ పదాలను పెదాలపైకి తేకుండటం శ్రేయస్కరం.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 4, 2015 @ 11:38 pm

వ్యంగ్యరేఖలు- టైమ్స్ ఆఫ్ ఇండియా
00

నరేంద్ర దామోదర్దాస్ మోదీగారు ఏనాడో చెప్పారు ఈ తరహా వార్తా వ్యాపారుల గూర్చి. కుక్షింభరత్వమే ధ్యేయం, దేశ క్షేమం పూజ్యంగా నడుస్తున్న ఈ ప్రసార మాధ్యమాలు కాలక్షేప కేంద్రాలుగా మారినై. ఎవడి మెచ్చేది వాడు చూస్తున్నాడు, చదువుతున్నాడు తప్ప ఖచ్చితమైన సమాచారంకోసం కాదనేది తేటతల్లమౌతున్నది. గీసేవాడు గీస్తున్నాడు, రాసేవాడు రాస్తున్నాడు చూపేవాడు చూపుతున్నాడు చూసేవాడు వాడి పని వాడు చేసుకుపోతున్నాడు. ఎవడి గోల వాడిది.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 3, 2015 @ 9:50 pm

ధరణికి గిరి భారమా
00

తెలుగు భాష ప్రాముఖ్యతను తెలిపి మాతృభాషోన్ముఖులను చేయు ఇటువంటి వ్యాసములు అనుదినము తెలుగు దిన పత్రికలన్నిటిలోను ధారావాహికలుగా వెలువడితే తప్ప ఈ భాషపైనున్న చిన్నచూపు తొలగదేమో! ఈ చిన్న చూపు కు విదేశీభాషల ‘ కళ్ళజోడు ‘ తొలగించాలనే భావముకూడ సమంజసమే అయినా ఇది మనసుకు పట్టిన జాడ్యము కనుక మానసిక పరివర్తనమే మార్గముగా వ్యాసము సాగిన తీరు హర్షణీయము.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 2, 2015 @ 11:11 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

కార్పొరేట్ అనగానే ఒక శతృభావనను సామాన్యుల మనసులలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు గర్హనీయము. కార్పొరేట్ల ఆవశ్యకత తెలిసి వారిని ఆహ్వానిస్తున్నవారెవరూ అవివేకులు కాదు. కాలానుగుణముగా మార్చుకోని కొన్ని పక్షాలు సైద్ధాంతికంగా విభేదించవచ్చు, కాని బాధ్యతల గల మీడియా సరియైన దృక్పధాన్ని జనులకు అందించాలి. ఆ సంస్థల నిర్వహణలో జరుగుతున్న పొరబాట్లను ఎత్తి చూపటం బాధ్యతగల రాజకీయ పక్షాలు చేయవలసిన పని. చీమలకోసం ఇల్లు తగలబెట్టుకోవటం వివేకము కాదు.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 2, 2015 @ 11:27 pm

సే లవ్ అంటే సెలవు
00

మురళిగారి విశ్లేషణ ఆద్యంతం హృద్యముగా ఉన్నది. వారి తర్కముతో నేను సంపూర్ణముగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ రాజ్యాంగపరమైన కోణమును గూడ పరిశీలించి వివరించి ఉంటే మరింత శోభస్కరముగా ఉందేది. సెలవు చీటి ఎవరికి ఇవ్వాలి? జీతభత్యములు ఎవరు ఇచ్చేది? మరి ఈ సెలవు దినములలకు జీతభత్యములు ఇస్తారా? జీతభత్యములు లేకపోతే ఉద్యోగ కాలములో తగ్గిస్తారా? ఐదేళ్ళూ సంపూర్ణముగా ఉద్యోగములో లేని వ్యక్తికి ఆ కాలము తరువాత పించను ఇస్తారా? ఇటువంటి రాజ్యాంగ పరమైన విషయములను చూడవలసి వస్తుంది. సమావేశ దినములలో హాజరుపట్టీలో సంతకములు చేయాలని మున్నెప్పుడో ఒక శాసనసభ్యుడన్నారని ఎక్కడో వ్రాస్తే చదివినట్లు గుర్తు. ఏమైనా ఈ వ్యాసంలో విషయముంది.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 1, 2015 @ 10:58 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

ఎన్నికలు అయిన తరువాత ఎప్పుడూ ఇదే తంతు. చెయ్యటంకంటె చెప్పటం తేలిక. ఇందుకు ఉదాహరణే అధికార ప్రతిపక్షాల (పార్టీలకు అతీతముగ) వచోధోరణి. పత్రికల విశ్లేషణలు, వ్యంగ్యోక్తులు, వ్యంగ్యరేఖలు. పేర్ల మార్పు, రాజకీయ పార్టీల మార్పు.

» Posted By కంచిభొట్ల..సుబ్బరాయ శర్మ On March 1, 2015 @ 11:33 pm

«« Back To Stats Page