Stats

Comments Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ

Displaying 1 To 30 Of 137 Comments

పెద్ద నోట్ల రద్దు నిరసనపై అనంత శ్రీరామబాణం
00

అనంత శ్రీరాం గారు చిన్నవాడైనా మహా దొడ్డమాట చెప్పాడండీ! గడ్డిమేతకు, అందులో కుంభకోణాలకు అలవాటుపడ్డ వారికి ఇంత వ్యంగ్యముగా చెబితే ఎక్కుద్దా! కర్రు కాలేసి సంధిబంధాలలో పెట్టాలని అంటే తీవ్రవాదమౌతుందని కాస్తలో ఉపసంహరించారు శ్రీరాం గారు. సిరివెన్నెల వ్రాసిన పాటలో పదాలు “…..ఈ సిగ్గులేని…..అగ్గితోటి కడుగు …..జీవచ్ఛవాన్ని …” అన్న స్థాయిలో ఉంటేతప్ప (వి) పక్షవాదానికి చలనం రాదు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On November 21, 2016 @ 10:45 pm

పెద్ద ‘నోటు’ దెబ్బ
00

విశ్లేషణ బాగుంది. ప్రతిపక్షంలో ఉన్న ప్రతీ పక్షం వింత వింత దారులు తొక్కుతున్నది, పోకడలు పోతోంది. అధ్యక్షుడి వద్దకు ఊరెరిగింపుగా వెల్లాలన్న మమత ఏకాకైపోవటం చూశాము. ప్రతీ పక్షానికి వాళ్ళే అధికులమని, కలిస్తే వారి అస్థిత్వం పోతుందని శంక. రాజ్య సభలో జరిగిన కార్యకలాపాలు చూస్తే ఈ విభజన ప్రస్ఫుటమౌతుంది. తమ దగ్గర ఉన్నది ఊడిందన్న దుగ్ధ, సామాన్య ప్రజానీకం పదే ఇబ్బందులుగా చిత్రీకరించటానికి విఫల ప్రయత్నం జరిగింది.
సామాన్యులు ఇప్పటి ఇబ్బందులకన్న జరుగబోయే శుభ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సహించటం ప్రత్యక్షముగా కనబడుతోంది.
నరేంద్ర మోడీ గారు తీసుకొన్న నిర్ణయముపై సర్వత్ర అభినందనలేకాని అభిశంశనలు లేవు.
మలిన చరిత్రగల ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన సూచనలు చేసి (చేయగలిగిన తెలివితేటలు ఉంటే) కూర్చున్నంత ఉత్తమం లేదు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On November 16, 2016 @ 10:25 pm
00

చారిత్రిక అవసరం, కేంద్ర ప్రభుత్వ నిబద్ధత, సగటు మనిషి ఆకాంక్ష ఎలా నెరవేరబోతోందో చక్కగ వివరించారు. విపక్షాల రోదనను ప్రజలు అర్ధం చేసుకోగలరు. ‘ఓదార్పు యాత్ర ‘ చేపట్టే పరిస్థితి కూడ కనబడటం లేదు. బీరువాలు తెరిస్తే భేతాళులు వెక్కిరించే పరిస్థితి. “అవాక్కయ్యారా విపక్షం? టైడ్ ప్లస్ వాడితే నలుపు తెలుపవుతుందేమో చూడండి. పది లక్షలు బ్యాంకులో జమ చేస్తే లక్ష దక్కుతుందట. ఇదే టైడ్ ప్లస్ ప్రభావం. “నిలువుదోపిడీ దేముడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం చిక్కేది…..” అని తెలిసి కూడా ఢిల్లీ చుట్టూ తిరిగే జనపధములో తిరిగితే పరిస్థితి తిరగబడ్డది. “తీర్పు దినం ” రానే వచ్చింది. కోట్లాది ప్రజల కళ్ళలో పన్నీరు, కొందరి కళ్ళలో రక్తాశ్రువులు. “దేవుడున్నాడు ” “సత్యం జయిస్తుంది “

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On November 12, 2016 @ 10:41 pm

పెద్ద ‘నోటు’ దెబ్బ- 2
00

నల్ల ‘ కోట్ల ‘ పని పట్టిన నరేంద్రుడు ఇప్పుడు నల్ల ‘ నోట్ల ‘ పని పట్టి, రేపు నల్ల ‘ వోట్ల ‘ ను కూడ దెబ్బ తీశాడు. శభాష్ మోడీజీ, శభాష్ ! నల్ల కోటీశ్వరులు ఇప్పుడు మరో ‘యాత్ర ‘ చేపడతారా!

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On November 9, 2016 @ 11:22 pm

మారుతీయం
00

మారుతీ రావు గారి వ్యాసం సుందరకాండను తలపించింది. అయితే విభీషణులాంటి పాత్రలేదు ఆ ప్రతిపక్షములో! దేశభోక్తల నాయకులకు తెలిసిన చిదంబర రహస్యాలకు ఋజువులు చూపి అటుపై మాట్లాడితే ఆ మాటలకు విలువ. ప్రజా క్షేత్రములో నిర్ద్వందముగా తిరస్కరింపబడినవారు మాట్లాడుటకు సిగ్గుపడరేమిటి అనిపిస్తుంది. ఇటువంటివారికి ఆ ద్రోహులకు తేడా ఏమిటని ప్రశ్నించిన మారుతీ రావు గారు అభినందనీయులు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On October 21, 2016 @ 10:14 pm

శ్రీరమణీయం
00

సగం గ్లాస్ నిండా నీళ్ళు కనపడవు ఫలానా వారికి ఫలానా వార్తా పత్రికలో అచ్చు వెయ్యటానికి. వార్తా వ్యాపారులని మన ప్రధాన మంత్రిగారు అనేది ఇటువంటి వారినే కాబోలు!

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On October 9, 2016 @ 11:01 pm

రామాయణంలో సర్జికల్ ఆపరేషన్
00

నరసింహా రావు గారి వివరణ బాగుంది. మరి రామాయణములోని విషయాలను కూడా ప్రధాన మంత్రి ఋజువు చెయ్యాలనే కలి వారసులు ఉన్నారు. ఈ నరాధములను ఆ నరేంద్రుడే సరి చెయ్యాలి.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On October 7, 2016 @ 10:21 pm

ధర్మక్షేత్రంలో కురుక్షేత్రం
00

చలపతి గారు మనసు, బుద్ధి చెప్పిన మాటలు కాక చైనా పలుకులు పలుకుతారన్నది జగద్విదితమే! వారు ఒక వ్యర్ధ మేధావి. ఒక ఉలిపికట్టె. వారి రాజకీయ మనుగడ కోసం వ్యర్ధ ప్రయత్నాల్లలో భాగమే ఈ పలుకులు. మొన్న జరిగిన పస్చిమ బెంగాలు రాష్ట్రములో ఘోర పరాజయము జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆ ప్రేలాపన.
వయసులో చిన్నవాడని, తెలుగువాడని వారికి ఒక ఉచిత సలహా: రాజకీయాలనుండి వైతొలగి వారి మేద స్వరాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తే మంచిది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On October 4, 2016 @ 10:50 pm

నాకూ మెలకువొచ్చింది
00

బూటు విసురుతో వర్తమానములోకి వచ్చినట్లున్నాడు, పప్పు

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On October 2, 2016 @ 11:09 pm

ప్రత్యేక హోదా- కొన్ని వాస్తవాలు
00

చక్కటి వ్యాసం. ఆవేశం అనర్ధానికి దారి తీస్తుంది. “ఆతడనేక యుద్ధముల ఆరితేరిన…” నాయకుడు. అతడు తప్ప నవ్యాంధ్రమును నిర్మించగల శక్తియుక్తులున్న నాయకులు లేరు. ఇక తాటియాకుల చప్పుళ్ళు చేసేవారివలన ప్రయోజనము సున్న. జనం మెచ్చి అధికారమిచ్చిన నాయకుని మేధస్సు, సమర్ధత ప్రజలకు తెలుసు. అనవసరమైన అల్లరి చేసి అభాసుపాలైన మాజీలను చూచైనా వివేకముతో మెలిగితే సర్వులకు మంచిది.
వ్యాసకర్తకు అభినందనలు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On September 18, 2016 @ 11:03 pm

మోదీ, వెంకయ్య – ప్రత్యేకం
00

అధికారములో ఉన్నప్పుడు కాంగోలు చేసిన ఘనకార్యాలకు తలెత్తుకోకుండా చేసిన ప్రజల ముందరే నిస్సిగ్గుగా మాట్లాడటం, లేస్తే మనిషిని కానన్న చందాన అధికారములోకి వచ్చే అవకాశము కలలో కూడా లేని వ్యక్తి, అవినీతి అందలాన్ని మోసే అనుచరగణం చేసే బాధ్యాతారహిత వ్యాఖ్యలకు జనములో కలిగే అపోహలను తొలగించాల్సిన సామాజిక బాధ్యత మీడియా వ్యక్తులకు ఎంతో ఉంది. వారి బాధ్యతారాహిత్యం క్షమించరాని నేరం.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On September 11, 2016 @ 10:39 pm

పచ్చకామెర్ల కళ్లు
00

పాడిందే పాడే పాచిపళ్ళ దాసు

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On June 8, 2016 @ 11:49 pm

ఎప్పటికెయ్యది నెససిటి
00

కాలక్షేపము కాదు. యదార్ధాన్ని చక్కగా చెప్పారు. రచయితకు అభినందనలు

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On May 8, 2016 @ 11:09 pm

వెర్రాడి పెళ్లాం వాడకెల్లా వదిన
00

వ్యాస రచయిత ఆవేదన హేతుబద్ధంగాను, సమంజసముగాను ఉన్నది. హిందువులలో నిర్లిప్తత, స్తబ్దత, సమసమాజమనే ముసుగులో తమ భయాన్ని కప్పిపుచ్చుకోవటం, మంచితనమనే ముసుగులో తమ నిరాసక్తత, నిస్సహాయతలను దాచుకోవటం వంటి ఎన్నో, మరెన్నో కారణాలు ఈ స్థితికి రహదారులు వేస్తున్నై. ఈ హేతువాదులు, సమసమాజ స్థాపకులు అందరూ హిందువులని చెప్పుకొనేవారే! శని శింగణాపూరుకు కాని, త్రయంబకేశ్వర దేవాలయలులోనికి కాని, శబరిమలైకి కాని ఈ తీర్పు వచ్చిన తరువాత ఈ సమ సమాజ కార్యకర్తలు ఎన్ని సార్లు వెళ్ళి వారి ‘దర్శనమూ చేసుకొన్నారో? ” నీ కాపురం చెడగొట్టకపోతే నేను నీ……….కాను” అని సవాలు విసిరేరట సమ సమాజ స్థాపకులు – వారి వాదన కోర్టులో వినిపిస్తే బహుశః వారికి న్యాయం జరిగేదేమో ! వారి వాదన : ” హిందూ స్త్రీకి పాతివ్రత్యమేమిటి? డామిట్! ఆమెకు ఆ మాత్రం స్వేచ్చ లేదా? “వంటి వాదన తమదాకా రాకపోతే సమంజసముగానే వినపడుతుంది.
సిగ్గు, సిగ్గు.
ఈ సమ సమాజ స్థాపకులకు భారత దేశములో అన్య మతములలో ఉన్న ‘ లింగ ‘ వివక్షత కనపడదా? లేక నోబెల్ బహుమతిపై కళ్ళు వేశారా!
వ్యాస రచయితకు మరోసారి అభినందనలు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On May 3, 2016 @ 10:31 am

పనికిరానివాళ్ల కాలనీ
00

వ్యాస రచయిత పని చేయని ప్రధాన మంత్రులను, పనికిరాని పార్టీ అధినేతల గూర్చి ప్రస్తావన చేయక పోవటంతో వ్యాసం అసంపూర్ణముగా ఉందనిపించింది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On April 21, 2016 @ 10:52 pm

శరత్కాలం
00

అక్కడ తేడా చేసింది. కొందరి హస్తవాశి అది. రాజకీయ రంగుతో కళంకితమైన సత్కారాల కంటె గాన గంధర్వుని పేర ఇచ్చిన సత్కారం గణనీయం.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On April 20, 2016 @ 10:59 pm

భారత మాతకి జై రాజకీయం
00

బధిరునికి శంఖారావం వినిపించినట్లు గుర్తింపు కొఱకు మతాన్ని, ఇజాలను అడ్డంపెట్టుకొని బ్రతికేవాళ్ళకు ఈ సత్యబోధ చెవికెక్కదు. వ్యాసం సత్యమును ఆవిష్కరించింది. వ్యాసకర్త అభినందనీయుడు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On April 20, 2016 @ 10:38 pm

చెప్పుకుంటేనే భక్తి?
00

బాధ ఆ తరువాత సినిమాలు ఆడటంలేదనేమో! వ్యాఖ్యలతో కూడిన విడియోల సంగతేమిటి?

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On April 17, 2016 @ 11:17 pm

బాబా సాహెబ్‍నుంచి బాబాగా…
00

స్థాలీపులాకన్యాయముగా పత్రిక పేరుబట్టి వ్యాసము స్థాయి తెలుస్తుందనిపిస్తోంది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On April 16, 2016 @ 10:36 pm

అంబేద్కర్ ఇలా కూడా చెప్పారు….
00

శ్యాం ప్రసాద్ గారి వ్యాసం ఇజాలను కాక నిజాలను ప్రతిబింబించింది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On April 14, 2016 @ 10:42 pm

కన్నయ్య సన్నిధి అదే మాకు పెన్నిధి
00

నీనించి నే చెడితినే, నానుంచి నువ్వు చెడితివే అని ఒక తత్వం. స్వాతంత్ర్యము వచ్చాక, రాజ్యాంగములో వాక్స్వాతంత్ర్యము పొందుపరిచాక, వాక్స్వాతంత్ర్యము కోసం పోరాటమని వారు వేణువు వూదుతుంటే భళా భళీ అని భజంత్రీలు వంత పాడుతుంటే, విద్యాలయాలు విద్య కొరకా, అల్లర్ల కొరకా అని జనం విస్తుపోతున్నారు. ఒకరు మరణించుకొనుటకు నిర్ణయించుకొని ఉత్తరం వ్రాసిపెట్టి మరణించిన విషయాన్ని విస్మరించి, రాహు కేతులు, ఎర్ర నాయకులు, రాజకీయ నిరుద్యోగులు మండుటెండలను లెక్క చేయక ఆ అయ్యను భుజానికెత్తుకొని ఊరేగింపులు, సమాజములోని శాంతిని భగ్నం చేసే ప్రదర్శనలు చేస్తూపోతుంటే సగటు మనిషి చీదరించుకొంటున్నాడు. భావ ప్రకటనకు స్వేచ్చ అంటే రాజ్యాంగమును, రాజ్యాంగము ప్రకారము ప్రతిష్ఠితమైన న్యాయ వ్యవస్థను సభ్యతను దాటి విమర్శించటామను కొనే కొద్ది మందికి సరియైన మార్గము చూపటము పోయి, అసహనపు జ్వాలలలో ఆజ్యం పోసే రాజకీయులను చూసి జనం అసహ్యించుకొంటున్నారు. వోట్ల కోసం పడేపాట్లు ఇంతకు దిగజారుస్తున్నాయా అని సమాజం చీత్కరించుకొంటున్న విషయాన్ని చక్కగా ఆవిష్కరించిన వ్యస రచయిత అభినందనీయుడు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On March 27, 2016 @ 11:37 pm

భారతంలో జాతికి భరతం
00

కొందరికి తిట్లే దీవెనలు. తెగడ్తలే పొగడ్తలు. రాజకీయులు, ఆత్మను హననము చేసుకొని అమ్ముడుపోయిన వార్తా వ్యాపారులు, విద్యార్ధులన్న ముసుగులో దేశద్రోహులు దీనికి అపవాదమేమీ కాదు. వీరికి మాటలను, వ్రాతలను, చేతలను అలక్ష్యము చేయుటే మంచిది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On March 26, 2016 @ 11:18 pm

భయమ్ము నిశ్చయమ్మురా జయమ్ము లేదురా……
00

పాపపు సొమ్మును ఏమి చెయ్యాలో చక్కని మార్గదర్శకాలు నెలకొల్పినారు ఆనాటి రాజశేఖరులు. వానిని తు.చ తప్పక ఆచరిస్తున్నారు వారి వారసులు. ఆసేతు హిమవన్నగ పర్యంతము స్వతంత్రభారతములో ఆరు దశాబ్దాలపాటు ఏలిన వారు, వారి అనుయాయులు, వారసులు చతురతతో విదేశములలో భద్రపరచుకొనే దిశానిర్దేశము కూడ చేసినారు. వీలున్న చోటుల విదేశీయులతో బంధుత్వము కలుపుకొని ఆ సొమ్మును మళ్ళించు మార్గములనుకూడ సూచించినారు.
ఈ నేపధ్యములో ఈ వ్యాసము రచయిత స్థాయికి తగినట్లు లేదు. అందునా, ఈ వ్యాసమునకు స్థలశుద్ధి లేదనిపించుచున్నది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On March 5, 2016 @ 10:44 pm

ఇదెక్కడి స్వేచ్ఛ?
00

రాజకీయ అల్ట్రాల సిగ్గులేనితనం, తెరవెనుక భాగోతం లోక్ సభలో ప్రత్యక్షముగా వీక్షిస్తున్నాముగదా? స్వపక్షము దాదాపు హీనమైన స్థితితో ఒకరు, రాజ్యసభ సభ్యత్వమును అడ్డుపెట్టుకొని ఒకరు వారి పెదవులకు చేటు తెచ్చుకొంటూ, యదార్ధ పరిస్థితిని ప్రజలముందుంచుతున్న పాలక పక్షీయుల విజ్ఞతకు తాళలేక, అస్థిత్వాన్ని నిలుపుకొనుటకు మార్గాంతరములు లేక విద్యావ్యవస్థలను కలుషితం చేస్తున్నారని దేశ ప్రజలకు అర్ధమైనది.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On March 4, 2016 @ 11:31 pm

అభినందనః గరికిపాటి
00

శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి భాష, ప్రతిభ, వ్యుత్పత్తులతో పాటు వారి సామాజిక వ్యాఖ్యలు నన్నెంతో ప్రభావితుణ్ణి చేస్తాయి. శ్రీమాత్రేనమః.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On January 24, 2016 @ 12:13 pm

అమ్మ నన్ను కొట్టింది, ప్రధాని రాజీనామా చెయ్యాలి!
00

దగ్గుల మావయ్య, పెళ్ళికాని పిల్లాడు, వయసుమళ్ళిన వృద్ధనారీమణులు, రాజకీయ నిరుద్యోగులు, ఒకళ్ళేమిటి ఏ ఆందోళనకైనా తాము సిద్ధమని దూరాభారాలు చూచుకోకుండా అక్కపల్లి అసోసియేషనుకు మద్దతు ప్రకటిస్తారు, వారి అనుచరులతో సహా! ఎర్రజండాలకు ప్రత్యేక ఆహ్వానముండాలి. మరువకూడదు.
వ్యాస రచయిత అభినందనీయుడు.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On January 24, 2016 @ 11:19 pm

లౌకిక యాగం
00

బొజ్జా తారకం గారి గుండె, కడుపు యాగశాలలో జ్వలించే అగ్నిహోత్రపు మంటలతో నిండిపోయినట్లు కనబడుతోంది. మరి అల్పుల తీర్ధయాత్రలకు ప్రభుత్వాలు పెట్టే ఖర్చు లౌకికమా? ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు స్వంత డబ్బుతో యాగం నిర్వహిస్తే బొజ్జగారి ఉబ్బరమేమిటో తెలియటంలేదు. ఇదే చంద్రశేఖర రావు గారు అల్పుల పండుగలకు వారి సాంప్రదాయ దుస్తులు ధరించి వారి మత పెద్దలు చదివేవి అర్ధం తెలిసి ఆమోదిస్తున్నారా? అప్పుడు అధికులకు ఇలా గుండెలు, బొజ్జలు మండలేదే! హిందువుకు ఆయన స్వధర్మాచరణ అలౌకికమెలా అవుతుంది. న్యాయశాస్త్ర పట్టభద్రులు కోకొల్లలు. ఈ రోజుల్లో నిరక్షరాశ్యునికి కూడ రాజ్యాంగము గూర్చి, చట్టాల గూర్చి తెలుసు. ఈ యాగానికి వచ్చే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, పీఠాధిపతులు ఏమీ తెలియనివారు కారు.
తారకముగారి మాటే మంత్రము కాదు. అధికులను ఎకసెక్కెములాడితే ఆకాశమువైపు తిరిగి ఉమ్మినట్లే!
వ్యాస రచయిత కంటె వెటకారముగా వ్రాయగల సమర్ధులున్నారని వారు మరువకూడదు. సభ్యత సంస్కారములు అడ్డు వచ్చి పరిమితులు దాటరు. అంతే. గ్రహింతురుగాక!

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On December 25, 2015 @ 11:02 pm

శ్రీరమణీయం
00

మంచి పత్రికే! పోచికోలు, పాచి కబుర్లకి. వ్యంగ్య రచనలు అని వ్రాసినవి ఏవగింపు కలిగిస్తున్నవి. డూ, డూ, బసవన్నల విన్యాసాలతో పేజీలు నింపుకొని అచ్చేసి పాత పేపర్లవాడికి అమ్ముకొనే పత్రికలు సామాజిక బాధ్యతలను మంటకలుపుతున్నై.

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On December 12, 2015 @ 11:17 pm

అసహనంపై సామవేదం
00

సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చాల సహనముతో తన వాదనను గట్టిగానే వ్యక్త పరచినారు. మన భాషలో ఒక సామెత ఉంది : మాంసం తింటుంటే ఎముకలు మెడలో వేసుకు తిరుతారా! అని.
ఇది కేవలం ఒక పార్టీ తమకున్న ప్రబుద్ధుల ద్వారా ఆడిస్తున్న వికృత రాజకీయ క్రీడ. శిఖండి అడ్డముపెట్టుకొని అసహనము, ఈర్ష్యలతో చేస్తున్న దుర్మార్గపు చర్య. అదే పార్టీ నాయకులు పదవులకోసం సామాన్యుల ప్రాణాలు తీసిన సంఘటనలు ముఖ్యముగా ఈ రాష్ట్రాల ప్రజలు మరచిపోలేదు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి వంటి దేశ భక్తులు, యదార్ధవాదులు బహిరంగముగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చాలి. అధికుల మౌనం అల్పులకు అవకాశమివ్వటమే

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On December 8, 2015 @ 11:59 pm

CATCHING MODI MOOD CENTURIES BACK
00

చాణక్య వాణి అక్షర సత్యం. ఈ రాజకీయ రోగ పీడిత రోగులు, దేశద్రోహులు ఈ సత్యాన్ని జీర్ణించుకోలేక బాధాతప్త హృదయులై వెర్రిగా కేకలు వేస్తున్నారు. సమన్వయం, శాంతి, సౌభ్రాతృత్వం అల్పులు అర్ధం చేసుకొని జీవిస్తే సర్వులకు మంచిది. ప్రపంచం చిన్నదైన రోజుల్లో ఎవరికి ఎక్కడ ప్రశాంతత, భద్రత ఉన్నదనుకొంటారో అక్కడికి వెళ్ళటానికి ఎవరు అభ్యంతర పెడతారు? “సహనావవతు…….

» Posted By కంచిభొట్ల...సుబ్బరాయ శర్మ On December 1, 2015 @ 6:27 pm

 Page 1 of 5  1  2  3  4  5  » 
«« Back To Stats Page