Stats

Comments Posted By డా.తాడేపల్లి పతంజలి

Displaying 1 To 6 Of 6 Comments

నమో నమో బాపూ- 3




0



0

నమస్సులు. టివీయస్ శాస్త్రి గారి బాపురే మీ లంకె ద్వారా చూసాను. బాగుంది. అభినందనలు .-డా.తాడేపల్లి పతంజలి

» Posted By డా.తాడేపల్లి పతంజలి On September 5, 2014 @ 6:04 am

తెలుగు తోటలో కరుణశ్రీ




0



0

ఫెల్లుమనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు
భిల్లుమనె గుండె నృపులకు , ఝల్లు మనియె
జానకీ దేహ మొక నిమేషంబునందె;
నయము, జయమును, భయము, విస్మయముగదుర.
1.నిమేషంబు=నిముసము, ఱెప్పపాటుకాలము2.నయము=లాభము;3.జయము=గెలుపు;4.విస్మయము =వింత,ఆశ్చర్యము;5.కదురు=కలుగు, అతిశయించు)
కదురు – అను క్రియను కదుర అని కరుణశ్రీ ప్రయోగించారు.;విస్మయము + కదుర= విస్మయము గదుర అని సంధి రూపం.
2.తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమ నిస్వనః (ధనుస్సు విరిగిన ధ్వని పిడుగుపాటులా భయంకరంగా ఉంది) అను వాల్మీకి రామాయణ వాక్యాన్ని ఫెల్లుమనె విల్లు అని అందంగా కరుణశ్రీ అనువదించారు.
నయము, జయము, విస్మయము ఎవరెవరికి కలిగాయో , కారణాలేమిటో కవి మనకే వదిలేసారు. పాఠకుడి ఆలోచనలకు కొంత భాగాన్ని వదిలేదే ఉత్తమ కవిత్వం.

» Posted By డా.తాడేపల్లి పతంజలి On February 26, 2013 @ 6:30 am

నవగ్రహ స్తోత్రం




0



0

దేవిరాం గారికి
నాకు స్వామి అనుగ్రహం తో లభించిన నవగ్రహ సంస్కృత స్తోత్రంలో అర్థాలు వివరించే ప్రయత్నం చేసాను .
పూర్వ శ్లోకాలలో పాఠ భేదాలు తప్పవు. అయినా అర్థాలలో పెద్దగా మార్పులు రావు. ఉదాహరణకి ‘మహా వీరం’ అన్నా ‘మహా వీర్యం’ అన్నా ఒక్కటే . అర్థంలో మార్పు లేదు. మహావీర్య ప్రయోగం వాల్మీకికూడా చేసారు. (కిష్కింధ -16-15శ్లో.)
మీరు చెప్పిన కుండలీకరణములలోని పదాలు కూడా ప్రసిద్ధాలే. రెండు పాఠాలు ప్రసిద్ధాలైనప్పుడు,మనస్సుకు పట్టిన పాఠాన్ని శ్రద్ధగా చదువుకొంటే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. నవగ్రహ స్వరూపుడైన జనార్దనుడు భావగ్రాహి. చదివే వాడి మనస్సులోని భక్తిని , భావాన్ని గ్రహించి రక్షిస్తాడు.
యదక్షర పద భ్రష్టం మాత్రా హీనంతు యద్భవేత్. తత్ సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ నమోస్తుతే

» Posted By డా.తాడేపల్లి పతంజలి On December 15, 2012 @ 10:00 pm




0



0

గౌరవనీయులు శివరాం గారికి,
మీరు చెప్పినది నిజమే.
పిడిఎఫ్ మెర్జ్డ్ ఫైల్ లో పొరబాటున శనిదేవుని స్తోత్రం రాలేదు.
శనిదేవుని స్తోత్రం కలిసిన పిడిఎఫ్ మెర్జ్డ్ ఫైల్ వసుంధర గారికి పంపించాను.
తప్పును సవరించుకొనే అదృష్టం కలుగజేసిన మీకు ధన్యవాదములు . -డా.తాడేపల్లి పతంజలి

» Posted By డా.తాడేపల్లి పతంజలి On December 15, 2012 @ 8:59 pm

మన కథకులు




0



0

19-3-2009 గురువారం
వసుంధరగారికి,
నమస్సులు.
కథక ప్రపంచంలో నా చిరునామాను భద్రపరిచినందుకు ధన్యవాదములు.
డా.తాడేపల్లి పతంజలి

» Posted By డా.తాడేపల్లి పతంజలి On March 19, 2009 @ 6:48 am

ముందుమాట




0



0

http://teluguvijayam.org/gumi.html
పైది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి కొత్త తెలుగు ఖతుల (fonts) లంకె.
మీ గణన యంత్రంలో (computer) కూడా ఈ పేజీ లోని లంకెల ద్వారా ఖతులను దిగుమతి చేసుకొని వ్రాయటానికి ప్రయత్నించండి.
శుభాకాంక్షలతో
-డా.తాడేపల్లి పతంజలి

» Posted By డా.తాడేపల్లి పతంజలి On November 9, 2012 @ 5:23 am

«« Back To Stats Page