Stats

Comments Posted By పసుపులేటి తాతారావు

Displaying 1 To 5 Of 5 Comments

ముందుమాట
00

శ్రీ వసుంధర గారికి,

నమస్కారము. స్వాతిలో సరసమైన కథల పోటీలొ బహుమతి గెలుచుకున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు. బహుమతులు మీకు కొత్త కాదు. అయినా మా సంతృప్తి కోసమే ఈ శుభాకంక్షలు.

పసుపులేటి తాతారావు.

» Posted By పసుపులేటి తాతారావు On April 2, 2010 @ 7:33 am
00

శ్రీమతి లక్ష్మి రాఘవ గారికి

నమస్కారం. పాత తరం రచయిత “శ్రీ ద్వారక” గరి గురించి పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. సాహిత్యపరమైన మరెన్నో అమూల్యమైన విషయాలను మీ నుంచి ఆశించవచ్చనిపిస్తోంది.

» Posted By పసుపులేటి తాతారావు On March 22, 2010 @ 12:59 am
00

శ్రీ అంబళ్ళ జనార్ధన్‌గారి కథాసంకలనం (bomma venuka)లోని కథ “బొమ్మ వెనుక” కథ చదివాను. చాలా బాగుంది. కేరెక్టరైజేషన్ అద్భుతం. కథ చదువుతున్నంతసేపూ నిజ జీవితంలోని మనుషులే పాత్రలై కళ్ళముంది మెదిలాయి. ఆ విషయం శ్రీ జనార్ధన్ గారితొ ప్రస్తావించినప్పుడు ఆ పాత్రలు నిజమైనవే అని తెలిసి విస్తుపోయాను. మనిషి మెత్తగా ఉంటే మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొంత మంది ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తారో కళ్ళకు గట్టినట్టు వర్ణించారు. వీకర్ సెక్స్ పట్ల సమాజం చూపిస్తున్న సానుభూతిని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఒక అమాయకుణ్ణి సొంత భార్యే వేధిస్తే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. కానీ అలాంటి మనస్తత్వాలు కూడా మన చుట్టూ చాలానే ఉన్నాయి. కథ చదువుతున్నంతసేపూ మనసంతా సాగర్ (కథలోని ప్రధాన పాత్ర) పట్ల సానుభూతితో నిండిపొయింది. ఒక మనిషిని ప్రెమించలేనప్పుడు, అతనితో కలిసి జీవితాన్ని పంచుకోలేనప్పుడు అతని ఆస్థిని ఆశించడం, అందుకోసం వేరే దేశం వెళ్ళి మరీ విడాకులు కోరడం ఘోరం. ఇది నిజంగా గొప్ప కథ. ఆ పుస్తకం దొరికితే అక్షరజాలం పాఠకులు చదువుతారని నా భావాల్ని ఇక్కడ పంచుకుంటున్నాను.

» Posted By పసుపులేటి తాతారావు On March 15, 2010 @ 8:54 am
00

శ్రీ వసుంధర గారికి.

నమస్కారములతో. నవ్య వీక్లీలో ద్వితీయ బహుమతి పొందిన నా కథ “ముందడుగు వెనకడుగు” మీద రచనలో మీ విశ్లేషణ నాకు కొత్త ఊపిరినిచ్చింది. అక్షరజాలం సైటుని సాహిత్య ప్రయోజనానికి ఉపయోగించుకొనే దిశగా నాకు అప్పుడప్పుడూ కలిగే కొన్ని సందేహాలని పోస్ట్ చేస్తుంటాను. నివృత్తి చేయగలరు.

అయినను పోయిరావలయు హస్తినకు దీని అర్ధమేమిటి? ఎవరికి తెలిసినా చెప్పగలరు

» Posted By పసుపులేటి తాతారావు On February 17, 2010 @ 11:23 pm
00

గతంలో శ్రీ అంబళ్ళ జనార్ధన్ గారు ఒక మాట వ్రాసారు. రచయతలందరూ పరస్పరం తమతమ అభిప్రాయాలను తెలుపుకోడానికి ఈ సైటుని ఒక వేదికగా వాడుకోవాలని. అది నిజం. చర్చలు, విశ్లేషణలు, వాదోపవాదాలు, సద్విమర్శలూ ఇంకా ఇంకా వేగం పుంజుకోవాలి. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన శ్రీ ‘వసుంధర ‘ రచయతద్వయానికి అభినందనలు.

భూమి మంత్లీ ఫిబ్రవరి 2010 సంచికలో రచయిత్రి బి.గీతిక గారి కథ “నరుడా ఏమి నీ ఒక్క కోరిక” ప్రచురితమయ్యింది. చాలా బాగుంది. మంచి సందేశం ఉంది ఆ కథలో. హేతుబద్ధమైన కోరికలే మనిషికి సుఖాన్నిస్తాయి, దురాశతో కూడుకున్న కోరికలు దుఃఖాన్ని కలిగిస్తుందని ఉదాహరణ పూర్వకంగా వివరించారు. ఇది తప్పక చదవవలసిన కథ.

» Posted By పసుపులేటి తాతారావు On February 17, 2010 @ 11:05 pm

«« Back To Stats Page