Stats

Comments Posted By శివకుమార శర్మ

Displaying 1 To 5 Of 5 Comments

బేతాళ కథలు
00

ధన్యవాదాలు. హైస్కూల్లో ఉన్నప్పుడు అలంకారాలని ఛాయిస్‌కింద వదిలేసివుంటాను.

» Posted By శివకుమార శర్మ On December 18, 2012 @ 4:56 am
00

భేతాళకథలకి ప్రాచుర్యాన్నిస్తూ మీ వెబ్‌సైట్‌లో వాటికి పునరుజ్జీవనం కల్పిస్తున్నందుకు మీకు అభినందనలు.

శ్రీదేవిగారి “గరుత్మంతుడి ముక్కు” తెలిసిన బేతాళకథల కోవలోకి వచ్చి, మీరుచెప్పినట్లుగానే సందేశాత్మకంగావుంది. వారికి అభినందనలు. అయితే, “మేరు” అన్న పదాన్ని “పర్వతం” అన్న పదానికి పర్యాయపదంగా వాడడం చిత్రమనిపించింది. హిమవత్పర్వతం, గంధమాదనపర్వతం లాగే “మేరు” చివరగా “పర్వతం” ని చేర్చాలిగదా! “పర్వతం”ని చివర చేర్చకపోతే అది “మేరువు” అనిగదా వాడుకలోవున్నది?

» Posted By శివకుమార శర్మ On December 17, 2012 @ 6:04 am

సరసమైన కథల పోటీ ఫలితాలు
00

వసుంధర గారికి, నమస్తే. ఈ పోటీ వివరాలూ, ఫలితాలూ రెండూ కూడా మీ అక్షరజాలంలోనే నేను మొదటిసారి చూశాను. కథలపోటీలగూర్చి మీరు అందజేస్తున్న సమాచారానికి ధన్యవాదాలు. సరిలేదు మీసేవకూ …

» Posted By శివకుమార శర్మ On October 18, 2012 @ 4:38 am

సాధారణ కథల జాబితా- ప్రజాశక్తి
00

వసుంధర గారికి,

నమస్తే. కోరికని మన్నించి “ప్రజాశక్తి” నిర్వహించిన కథలపోటీలో సాధారణ ప్రచురణకి స్వీకరించిన కథల వివరాలను పోస్ట్ చేసినందుకు మీకూ, వివరాలని అందించిన సత్యాజీ గారికీ ధన్యవాదాలు.

మీ

శివకుమార శర్మ

» Posted By శివకుమార శర్మ On February 21, 2012 @ 8:57 am

పాడుతా తీయగా
00

క్రికెట్ ఆడేవాళ్ళందరూ తెండూల్కర్ అంతటివారు కాలేరని నిరాశచెంది క్రికెట్ బాటే ముట్టుకోవద్దని పిల్లలకి చెప్పరు. ఐఐటి పరీక్షకి లక్షలమంది ఎన్నేళ్ళో కష్టపడినా ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది మాత్రమే ఎంపిక అవుతారని తెలిసికూడా తల్లిదండ్రులు పిల్లల ట్యూషన్లకోసం వేలరూపాయల్ని ఎల్కెజీనుంచే కుమ్మరించడం మానరు. అలాగని వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచేకాక నిన్నమొన్న పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీనుంచీ డిగ్రీ చేపట్టిన వాళ్లని కూడా ఇంజనీర్లని అనకుండానూ వుండరు. మనసుకు ఆహ్లాదమిచ్చే లలితకళలకి మాత్రమే, సుశీల అంతటివారో ఎస్పీ బాలూ వంటివారో కాలేకపోతే గళాన్నెత్తకూడదనీ, బాపూ అంతటివారు కాలేకపోతే కుంచె పట్టుకోకకూడదనీ ఆంక్షలు! కోటివిద్యలు కూటికొరకే అన్న సామెతని అందించిన వాళ్లెవరోగానీ వాళ్లు మనసుని ఎక్కడో వదిలేసినవాళ్లు. మ్రొక్కినవరమీని వేల్పుని వదిలెయ్యమన్నవాళ్లు అన్నంపెట్టని అమ్మని కూడా వదిలెయ్ అనేవాళ్లు కాగలరు. ఆదాయాన్ని సమకూర్చని విద్య నిరర్ధకం అనేవాళ్లు ఆలోచించవలసిన విషయం – డబ్బే ప్రధానమనుకున్నాగానీ యండమూరి వీరేంద్రనాధ్ గారికి కోట్లు గడించిపెట్టిన ప్రతిభని ఆయనకి ఏ కాలేజీలో నేర్పారు అన్న విషయాన్ని. తెలుగు వ్రాయడం, చదవడంకూడా నిరర్ధకమనుకునేవాళ్లకిగానీ, లలితకళలు సమయాన్ని వృధాచేస్తాయని అనుకునేవాళ్లకిగానీ ఎస్పీబీగారు ఇంజనీరింగ్‌చదువుని మధ్యలో ఆపేశారనీ, సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు మెడిసిన్ చదవడం మధ్యలో వదిలేశారనీ సంగీతకళానిధి డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు మెడికల్ డాక్టరనీ, వయొలిన్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్ సుబ్రమణ్యం గారు ఆయన తమ్ముడు ఎల్ శంకర్ ఇద్దరూ కూడా మెడికల్ డాక్టర్లేననిగానీ, మాజీ ప్రధానమంత్రి కీ.శే. పి.వి.నరసింహారావుగారు పదమూడు భాషల్లో కోవిదులనీ ఎప్పుడు తెలుస్తుందో, ఏమో! మనవాళ్లగూర్చి ఇలాంటి వివరాలు తెలియకపోయినా కనీసం ఈమధ్యనే స్వర్గస్థులైన స్టీవ్ జాబ్స్ కూడా కాలేజీ డ్రాపవుట్ అనీ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కాలేజీ డ్రాపవుట్ అనీ తెలిసేవుండాలి. “పాడుతా తీయగా” పిల్లల ప్రతిభల దివ్వెలని ప్రపంచం నలుమూలలా వెదజల్లడానికి తోడ్పడుతోంది. ఆ ప్రతిభని మనసారా ఆనందిస్తూ అభినందిస్తూ ఆశీర్వదించే బాలుగారు ఈ కార్యక్రమానికి రథసారథవడం అన్నితరాల ప్రేక్షకుల అదృష్టం. అమెరికన్ ఐడల్లో కూడా ఇంత ప్రతిభావంతుణ్ణి రథసారథిగా ఇప్పటిదాకా ఎవరూ చూసివుండరు.

» Posted By శివకుమార శర్మ On November 11, 2011 @ 8:19 am

«« Back To Stats Page