Stats

Comments Posted By KSLK Subbaraya Sarma

Displaying 1 To 30 Of 32 Comments

కాంగ్రెసుకి రాహు(ల్)కాలం
00

ఇటలీలో రూపు దిద్దుకొన్నవారినే ఈ భారతావని ఇన్నేళ్ళు భరించింది. క్షేత్ర బీజ ప్రాధాన్యాన్ని బట్టి ఈ అంకురం మేడ్ ఇన్ ఇటలీ క్రిందే లెక్క. ఒక చిత్ర మహారాజములో చెప్పినట్లు మాతృమూలములు అవే అయినప్పుడు అంకురము ఎక్కడ ఉంటే ఏమి? తల్లి వృక్షము క్రింద పిల్ల మొక్క ఎప్పుడూ కునారిల్లుట ప్రకృతి సహజం. పైగా ఆ వంశమునకు వారసత్వ శాపమున్నట్లు చరిత్ర చెబుతోంది. పోనీలెండి ఎక్కడున్న సుఖముగా ఉండటమేగా తల్లి కోరేది! బాధంతా మిగతా రాజకీయ పక్షాలదే ! ” అయ్యో బుడ్డబాబు రోడ్ షో లేక పోతే గెలిచేదెలా ? ” అని బెంగెట్టుకొంటున్నారని బీహారీలు చెప్పుకొంటున్నారట.

» Posted By KSLK Subbaraya Sarma On February 26, 2015 @ 11:47 pm

మంచివాడు మా నిజాంభాయి
00

కాంతారావు గారు శ్రమించి శోధించి వ్రాసిన వ్యాసము యదార్ధ పరిస్థితిని తెలియజేయునట్లున్నది. ధన్యవాదములు.
కాంతారావు గారికి ఒక మనవి: అప్పటి పాలకులను కీర్తించుచున్నారంటే ఆంతర్యము గ్రహించవచ్చును. ఎన్ని సాక్ష్యములు, ఆధారములు చూపినను చెప్పినను ఒప్పుకొనుటకు ఇచ్చగించనివారికి చెప్పబూనుట బధిరునికి శంఖనాదము వినిపించుట, అంధునికి అందమును చూపబూనుట వంటివే అని నా అభిప్రాయము. ఆత్మస్తుతి, పరనింద వంటివే పరస్తుతి, ఆత్మనింద కూడా. ఆత్మహనన సదృశం.

» Posted By KSLK Subbaraya Sarma On February 27, 2015 @ 2:36 pm

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్
00

అరవిందుడు క్షమాపణలు కోరి సీట్లు సంపాదించినట్లు, మన ముఖ్య మంత్రి బహుమార్లు పదవీత్యాగం చేసి ఓట్లు సంపాదించినట్లు సమీప భవిష్యత్తులో జరుగబోయే విధాన సభ ఎన్నికలలో లబ్ధి పొందాలన్నది మరో వ్యూహం కాబోలు. పాదయాత్రలు (ఓదార్పు యాత్రలు కాదు) చేసిన వారికి పదవీయోగం పడుతున్న నమ్మకం లాగా !

» Posted By KSLK Subbaraya Sarma On February 22, 2015 @ 11:45 pm

వ్యంగ్యరేఖలు- సాక్షి
00

సాక్ష్యాల గూర్చి, ఆధారాల గూర్చి వ్యంగ్య వ్యాఖ్యలు ‘ సాక్షి ‘ లో రావడం యాదృచ్చికం

» Posted By KSLK Subbaraya Sarma On February 22, 2015 @ 8:22 pm

నివాళిః రామానాయుడు
00

ఉన్నరోజుల్లోనే చేసిన మేలు మరిచే మనుషులున్న ఈ రోజుల్లో శేషకీర్తి అయిన రామానాయుడిగారి వ్యక్తిత్వం గూర్చి క్లుప్తంగానైనా తెలిపిన సునీత గారికి కృతజ్ఞతలు. పోయినప్పుడు చెప్పే మాటలకన్న పోయినా చెప్పేవే నమ్మాల్సిన నిజాలు.

» Posted By KSLK Subbaraya Sarma On February 22, 2015 @ 8:06 pm

స్పందనః సాహిత్యంలో వ్యావహారిక భాష
00

ఉన్నది ఉన్నట్లు చెప్పారు మహాశయా ! కేవలం పదవిలోని వారి ప్రాపుకోసమే ఆ ప్రయాసగాని , యాశ కోసం అంత ప్రయాస పడటం అనవసరమేమో !

» Posted By KSLK Subbaraya Sarma On February 23, 2015 @ 12:02 am

ప్రజాప్రతినిధి- రాజవస్త్రం
00

కలం పట్టటం కాలక్షేపానికా?
విషయాలు వినోదానికి వ్రాసినట్లున్నై.
ముగింపే వెక్కిరించినట్లుంది.
దిల్లీ ఎన్నికలు ఒబామా పర్యటన తరువాత పెట్టమని ఎన్నికల సంఘానికి ఎవరు సలహా ఇచ్చారో !
అమెరికాలో ప్రవేశానికి మోదీకి అనుమతి ఇవ్వని దేశాధ్యక్షుడిని ఆత్మీయముగా పలకరించినది ఎన్నికల వ్యూహమనుకొన్నా శ్వేతసౌధాధిపతి ఒప్పుకోవటం కూడా ఆ వ్యూహరచనలో ఒక భాగమంటే పోపులో ఇంగువ పాలు ఇంకాస్త గుబాళించేది.
గెలుపు బహుభర్తృక ఓటమి అనాధ అని మున్నెన్నడో మరో మహానుభావుడు చెప్పాడు.
వడగళ్ళ ప్రస్తావన సందర్భోచితముగా ఉన్నది. సంవత్సరములోపలే ప్రజాభిమానం కరిగి నీరై యమునా నదిలో కలసి పోవటం అర్ధాంతరన్యాసం. అలిగిన వేళ చూపిన విన్యాసాలను, క్షమాపణలు చెప్పుకొన్న భంగిమలను, చూచిన హస్తిన వాసులు మరెన్నిటిని చూడ వలసి వస్తుందో వివరించే శ్రీరమణ గారి వ్యాస పరంపర కొరకు ఎదురు చూస్తుంటాను.

» Posted By KSLK Subbaraya Sarma On February 22, 2015 @ 11:32 pm

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్
00

కొన్ని దశాబ్దాలుగా ఓట్లు వేసేవాళ్ళు చూసేదొకటిలాగా కనబడుతోంది – ” నాకేంటి ” . రోడ్లు వేస్తే ‘ నాకేంటి ‘ , విద్యుత్తు అధికంగా ఉత్పత్తి చేస్తే ‘ నాకేంటి ‘ , ఊరు వాడ శుభ్రంగా ఉంటే ‘ నాకేంటి ‘ విదేశాలతో సత్సంబంధాలు ఏర్పడితే ‘ నాకేంటి ‘, నాకు అన్నీ ఉచితంగా ఎవడిస్తాడో వాడు నావాడు, వాడికే నా ఓటు. అది స్త్రీయా, పురుషుడా, భారతీయమా, విదేశీయమా, మన మతమా, అన్య మతమా అన్న విషయాలు అనవసరము. సమర్ధత లెక్కలోనిది కాదు.
ఈ నేపధ్యములో ‘ ఉచిత ‘ పార్టీకే పట్టం. ప్రక్కరోజు నించి మొదలు అపస్వరాలు. అదిలేదు, ఇదిలేదు . ఏదో అనుకొన్నాము , ఇదేనా ! పెదవి విరుపులు, నొసల చిట్లింపు.
ఇక నమోగారు ఎప్పుడో చెప్పారు వార్తావ్యాపారుల గూర్చి.
భా.జా.పా అయినా, ఆ .అ.పా అయినా నాకు ఉచితముగా అయాచితముగా నాకు కావలసినవి ‘ అన్నీ ‘ ఇచ్చినవాడే నావాడు.
ఇక సమాచార బేహారుల గూర్చి – వాళ్ళేదో చెబుతారు, వీళ్ళేదో రాస్తారు, నాకు వేరే దారి లేక చదువుతాను, చూస్తాను.
ఈదే నేటి భారతం. ఇల్లు అలకగానే పండుగ కాదన్న విషయాన్ని చాల గట్టిగానే చెప్పిన వ్యాసం నాకు నచ్చింది.

» Posted By KSLK Subbaraya Sarma On February 26, 2015 @ 1:50 pm

తల్లి భాష
00

శుష్క ప్రియాలు కర్ణకఠోరంగా ఉంటున్నై ! బాధకొద్దీ చెబుతున్నా సహృదయముతో స్వీకరించండి. సంవత్సరీకం పెట్టటం ఎంత బాధాకరమో ఇదీ అలాగే అనిపిస్తుంది నాకు. గత సమావేశాలలో చేసిన తీర్మానాలలో ఎన్ని అమలు జరిగినై ! జరుగనివెన్ని ? ఎందుకు అమలుకు నోచుకోలేదు అన్న అవలోకనములేని ఈ కార్యక్రమాలు ఉత్సవమూర్తుల ఊరేగింపంత మొక్కుబడి అని నా అభిప్రాయము.

» Posted By KSLK Subbaraya Sarma On February 23, 2015 @ 12:12 am

ఇదీ సామరస్యం!
00

ముఫ్తీ మొహమ్మద్ ఇల్యాస్ గారు వారి అభిప్రాయాన్ని వారి మత గ్రంధములోనుండి ఉదహరిస్తే బాగుండేదేమో !

» Posted By KSLK Subbaraya Sarma On February 23, 2015 @ 2:30 pm

తెలుగుకి తెగులు
00

క్లుప్తంగా చెప్పాలంటే ఈ పరిస్థితికి కారణాలు రెండు: మిడి మిడి జ్ఞానం, నమంత్రపు సిరి.
ఆంగ్ల అధ్యాపకురాలి ఆవేదన ఆశ్చర్యం కలిగించకపోగా వారిమీద గౌరవం రెట్టింపైంది.
చాలా మందికి కోపం వచ్చినా నేను నమ్మిన విషయాన్ని చెబుతాను, సహృదయులు అర్ధం చేసుకొంటారన్న నమ్మిక ఉన్నది.
ఈ దినాలు పెట్టే దుష్ట సాంప్రదాయాలకు స్వస్తి పలకటం మన దృక్పధములో మార్పు తీసుకురావటానికి ఒక ముందడుగు.
ఆ దినం, ఈ దినము అనటమే మన సంప్రదాయము కాదు కదా!

» Posted By KSLK Subbaraya Sarma On February 20, 2015 @ 10:28 pm

పదుగురాడు మాటలు
00

పార్వతీశం గారి సోదాహరణ వ్యాసం సమయాని తగినట్లున్నది. వ్యాసపు అవసరమును సమర్ధిస్తూ రచయిత పేరు త్రిమూర్త్యాత్మికంగా ఉండటం సందర్భోచితముగా ( మహా శివరాత్రి ) ఉన్నది. చనువు తీసుకున్నందులకు క్షమిస్తారని భావిస్తూ :
వరుసగా విష్ణువు, బ్రహ్మ , శివులను స్ఫురింపజేస్తున్నది.
ఏకత్వములో భిన్నత్వం.
శివోహం.

» Posted By KSLK Subbaraya Sarma On February 17, 2015 @ 12:20 am

ప్రేమికుల రోజు
00

ఎందుకంటే, ఎందుకంటే ప్రేమ ప్రేమను కోరుతుంది, పెళ్ళి కాదు !!!
పెళ్ళి పెళ్ళిని కోరుతుంది, ప్రేమను కాదు. ఎందుకంటా, అలా ఎందుకంటా???
ఎందుకంటే పెళ్ళి అంటే ఏమిటో తెలుసు……
కాని ప్రేమంటే ఎవరికీ తెలియదు …..
ప్రేమ పరిధి ఎక్కువ,
పెళ్ళి పరిధి తక్కువ.
అదీ కత.

» Posted By KSLK Subbaraya Sarma On February 14, 2015 @ 10:48 pm

మారుతీయం
00

వ్యాసం చాల సందేశాత్మకముగను, అనుసరణీయముగను ఉన్నది. అయితే విస్మరించకూడని విషయం ఒకటున్నది. ఓటరు దురాశ దేశానికి ముప్పు. రాత్రికి రాత్రే దేశం నందనవనం కావాలని, ప్రభుత్వం ప్రతి పెరడులోను ఒక కల్ప వృక్షమును, కామధేనువును సమకూర్చాలని.
రాజ్యాంగము ప్రభుత్వము ఏర్పడిన తరువాత పని చేయుటకు ఐదు సంవత్సర కాలం ఇచ్చింది. ఈ సమయములో పాత ప్రభుత్వపు తప్పులను సరిదిద్దుతూ కొత్త ప్రభుత్వము తన ప్రణాళికలను రచించుకొని, అమలు పరచుకోవాలి.
ఈ విధానములో ఎదురయ్యే ఆటుపోట్లను సహృదయముతో అర్ధం చేసుకొని అవకాశమివ్వాలి. ఆలోచనతో, వివేచనతో ఓటు వెయ్యాలి కాని క్షణికావేశములతో కాదు.
పెడితే పెళ్ళి, పెట్టకపోతే తద్దినమనుకుంటే అది సరి కాదు.
పాలకుల నిజాయతి చూడాలిగాని ఫలితాలు కాదు. కొన్ని స్వల్పకాలిక పధకాలు, కొన్ని దీర్ఘకాలిక పధకాలు. వాటి వాటి స్వభావమును బట్టి సమయము ఇవ్వాలి.
దిల్లీలో ఫలితాలు ఆవేశపూరతమైనవేగాని, ఆలోచనపూరితములు కావని నా ఉద్దేశ్యము.
ఇటువంటి ప్రవర్తన దేశమునకు మేలు చేయదని నా అభిప్రాయము.

» Posted By KSLK Subbaraya Sarma On February 12, 2015 @ 11:16 pm

క్షణక్షణముల్ మనవాండ్ర ప్రాయశ్చిత్తముల్
00

రాజ్యాంగాన్ని క్రమబద్ధీకరించటం ఈ ప్రక్రియకు శ్రీకారామా శ్రీరమణ గారూ ? అటుపిమ్మట సామాన్యులు పాలకులను క్రమబద్ధీకరించి క్రొత్త ముఖాలతో బొమ్మల కొలువు తీరుస్తారు కదా ? మరి ఈ బొమ్మలు మరొక క్రమబద్ధీకరణ (సాధారణంగా ఐదేళ్ళు) వరకు ఆడింది ఆట, పాడిందే పాట. ఏమైనా నాప చేలలో నవ్వుల పంట పండించారు శ్రీరమణ గారు.

» Posted By KSLK Subbaraya Sarma On February 7, 2015 @ 11:48 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

తల్లిలేని బుడ్డోడిని వేశారేమిటి? 10 వ తారీకున ” దిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాము. మా ఓటమికి దారి తీసిన పరిస్థితులను లోతుగా చర్చిస్తాము ” అన్న వాక్యాలు భట్టీయం వేస్తోందా?

» Posted By KSLK Subbaraya Sarma On February 6, 2015 @ 10:25 pm

పాదుతా తీయగా- ఒక సవరణ
00

మీ పరిశీలన సరియైనదని నాఅభిప్రాయము, నిర్వాహకులు ఈ సవరణ రాబోయే కార్యక్రమములో ఇస్తారని ఆశిస్తాను.

» Posted By KSLK Subbaraya Sarma On February 6, 2015 @ 10:11 pm

భువినుంచి దివికి
00

వెంకటేశ్వర రావు గారు నటించారని వ్యాసములో ఉదహరించిన చలన చిత్రములన్నీ చూచితిని. ఆయన నటనలోని సౌలభ్యం చాల బాగుండేది. నాటకరంగ అనుభవము తోడైనదని మీ వ్యాసము వలన గ్రహించితిని.
వారి కుటుంబ సభ్యులకు నా సహానుభూతి.

» Posted By KSLK Subbaraya Sarma On February 3, 2015 @ 11:42 pm

వ్యంగ్యరేఖలు- ఆంధ్రజ్యోతి
00

“మూడేళ్ళ తరవాతని చెప్పు”

» Posted By KSLK Subbaraya Sarma On February 4, 2015 @ 9:55 pm

జై స్వేచ్ఛభారత్
00

బా.ఒ గారు వచారు. వెళ్ళారు. దిల్లీ ఎన్నికలకు పనికి వస్తుందేమోనని ఒకరి ఆలోచనైతే అంతకంటె చేసేపని అక్కడ లేదని అక్కడివారి వ్యాఖ్యట. మొత్తానికి మీడియావారికి మూడు రోజులు ఆటవిడుపు.
తూర్పు జర్మనీ జాగిలం పస్చిమ జర్మనీలో ముచ్చట తీర్చుకొన్నదని పాతబడ్డ సామెతను గుర్తు చేశారు శ్వేతసౌధ వాసి.

» Posted By KSLK Subbaraya Sarma On February 5, 2015 @ 10:30 pm

వరవీణా మృదుపాణి
00

సత్సంకల్ప సిద్ధి తప్పక జరుగుతుంది శ్రీమాత అనుగ్రహముచేత.

» Posted By KSLK Subbaraya Sarma On January 26, 2015 @ 11:44 pm

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
00

తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది. పొరుగింట చూపు మన పెద్ద చెయ్యి.

» Posted By KSLK Subbaraya Sarma On January 26, 2015 @ 11:35 pm

భువినుండి దివికి
00

నవ్వుల నారాయణుని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా సహానుభూతి.

» Posted By KSLK Subbaraya Sarma On January 24, 2015 @ 10:21 pm

పేరులో ఏముంది?
00

కాలం ఆకృతిలో మార్పు తెచ్చినా ఆమె నటన కలకాలం జ్ఞాపకాలలో నవయవ్వనముగా ఉంటుంది.

» Posted By KSLK Subbaraya Sarma On January 23, 2015 @ 11:20 pm

గురువును ముంచిన శిష్యుడు
00

అనతికాలమున అందలమెక్కాలన్న అత్యాశతో తనను మరచి నేల విడిచి సాము చేసి శృంగభంగము జరిగినను స్మృతితప్పి అడ్డదారిన అధికారము చేజిక్కించుకొనుటే జీవితపరమావధిగా తిరుగుతున్న నూటిలో ఒక పుంలింగం. తెలివిగలవాడు ఎలా ప్రవర్తించకూడదో చెప్పుటకు అతని నడవడిక ఒక పాఠం.

» Posted By KSLK Subbaraya Sarma On January 23, 2015 @ 11:39 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

బుడ్డబాబు ప్రక్కనలేకుండా మైనో గారిని చిత్రించటములో చిత్రకారుని భావమేమి?

» Posted By KSLK Subbaraya Sarma On January 24, 2015 @ 11:03 pm

అసలైన ఆస్తికత్వం
00

ఒక ప్రవాచకులు ఒక ఉదాహరణ చెప్పారు “ఒక నాస్తిక సభ జరిగిన తరువాత ఆ సభాధ్యక్షులను ఒకరు సభ ఎలా జరిగింది అని అడిగితే ఏదో దేవుని దయవలన బాగానే జరిగిందని జవాబిచ్చారట”. అదేమిటని ఎవరైనా అడిగితే అక్కినేనిగారి వలెనే ” సభకు విచ్చేసిన వారే నా దేవుళ్ళు ” అని చెప్పేవారేమో ! పోయినోళ్ళు అందరు మంచోళ్ళు కనుక ఇంతకంటె వ్రాయటం సభ్యత కాదేమో !

» Posted By KSLK Subbaraya Sarma On January 24, 2015 @ 11:11 pm

మన చిత్రాలు నాడు, నేడు- ఒక స్పందన
00

ఆనందరావు గారి వ్యాసం నేటి పరిస్థికి దర్పణం. దయనీయమైన స్థితి. దిగజారిన పరిస్థితి. తెలుగు సినిమాకు మంచిరోజులొస్తాయా అనుకోవాల్సిన దుర్గతి.

» Posted By KSLK Subbaraya Sarma On January 24, 2015 @ 10:53 pm

కూచిపూడిలో ఆర్ట్ అకాడెమీ
00

చంద్రబాబుగారి నిర్ణయం హర్షదాయకం. కళలకు ప్రోత్సాహ మిచ్చుట వారికి సమాజముపట్ల గల అవగాహన, బాధ్యత తెలియజేస్తొంది. సిలికానాంధ్ర వారు కూడ ఆ గ్రామము దత్తత తీసుకొనుటకు నిర్ణయించిన వార్త చదివి అలనాడు సిద్ధేంద్ర కళాక్షేత్రమునకు మాన్యులు నందమూరి తారక రామారావు గారు చేసిన అంకురారోపణ ఇన్నాళ్ళకు మహా వృక్షముగా ఎదగనున్నదని భావిస్తున్నాను.

» Posted By KSLK Subbaraya Sarma On January 24, 2015 @ 12:01 am

సంస్మరణః నవాబ్ ఆలీ జంగ్ బహదూర్
00

తులసి మొక్కలాంటి వాడు. పేరుకోసం కాక ప్రజల కోసం పని చేసిన మనీషి. ఇప్పటికీ ఆయన ఉపయోగ పడుతూనే ఉన్నాడు ప్రజలతోపాటు పాలకులకు. వినాయక్ సాగర్ ఒడ్డున బొమ్మ ఎప్పుడు పెడతారో !

» Posted By KSLK Subbaraya Sarma On January 22, 2015 @ 11:38 pm

 Page 1 of 2  1  2  » 
«« Back To Stats Page