Stats

Comments Posted By M.Sri Hari Krishna

Displaying 1 To 5 Of 5 Comments

అచ్చుతప్పులు
00

తెలుగులో వచ్చే అప్పు తచ్చులు సారీ, అచ్చు తప్పులు కోకొల్లలు. నేను ఫలానా పుస్తకం లో ఫలానా
అని చెప్పలేను కానీ, యెక్కువగా మన రాజధానిలో కొన్ని బోర్డులు చూసి తెలుగును ఏ విధంగా
ఖూనీ చేస్తున్నారో అని బాధ పడుతుంటాను. ఈ తప్పులు యెక్కువగా ఇంగ్లీష్ పదాలని తెలుగులో వాడినప్పుడు దొరుకుతూంటాయి. హేర్ కట్టింగ్, లేడీస్ టేలర్, మెడికల్ సాపు. ఇటువంటి వి
ఒక్కొక్క సారి పంటి కింద రాయిలా తగులుతూ ఉంటాయి. ఇంకా కొన్ని సహస్ర నామాలు భక్తి పూరకమయిన శ్లోకాలలో కూడా భయంకరమయిన, నవ్వు తెప్పించే అచ్చు తప్పులు ఈ విధంగా ఉంటాయి.
మహాకొశో అనడానికి మహా శొకో అని పడింది. క్లేశ నాశాయ అని పడవలసిన చోట కేశ నాశాయ అని
అచ్చు వేశారు. గొవిందా గోవింద.. ఈ తప్పు తెలియక అమాయకులైన భక్తులు వాటినే వల్లిస్తూ దేవుని
పూజ చేస్తూ ఉంటారు. అర్ధం మారిపోతే పూజలు వ్యర్ధం కదా?

» Posted By M.Sri Hari Krishna On May 24, 2015 @ 11:50 pm

అవధాన ప్రక్రియ జయహో
00

శ్రి గోవింద రాజు గారి ‘ఆవధాన ప్రక్రియ జయహో’ అనే అంశం తో వ్రాసిన వ్యాసం చాలా బాగుంది.
శంకరాభరణం శంకర శాస్త్రి గారు చెప్పినట్లు, ఈ అవధాన విద్యకు (ఆయన శాస్త్రీయ నాట్యం గురించి
పాటు పడిన విధంగా) జనాదరణ, గుర్తింపు, తగ్గుతున్నాయి. తెలుగు పద్యానికి పట్టం కట్టే గొప్ప గొప్ప
అవధానులు, పండితులు అనేకులు గల మన దేశంలో యువత పర భాష కు ప్రాధాన్యత నిచ్చి తెలుగును అశ్రద్ధ చేస్తున్నారు. ఈ మధ్య ఊగాది నాడు ఇద్దరు మహిళా అవధానులు నగరంలోని సాయినాధ పురంలో 8 మంది ప్రుచ్చకులతో చక్కటి అవధానం చేసి, పండిత పామరుల ప్రశంసలను అందుకున్నారు. ఈ అవధానీ మణులు ఇంతవరకూ 95 అవధానాలు పూర్తి చేసుకుని, అనేక పురస్కారములనూ, బహుమతులనూ, అందుకొని పేరు పొందిన విదుషీ మణులు.వీరి పేర్లు
శ్రిమతి బులుసు ఆపర్ణ, కుమారి పుల్లాభట్ల నాగ శాంతి స్వరూప. వారి తల్లిదండ్రుల ప్రోత్సాహము, గురువు శ్రి ధూళిపాళ మహాదేవ మణి గారి ఆధ్వర్యంలో అతి త్వరలో 100 అవధానములు పూర్తి చేసుకొన గల పాటవము గల వారు. ఈ విద్యలో అనుభవము కల పెద్దలు ఈ మహిళలకు వారి ప్రోత్సాహము, తగిన సూచనలూ అందించి, ఈ అవధాన ప్రక్రియకు ప్రాచుర్యము, గుర్తింపు కలిగింప గలరని ఆశిస్తున్నాను.

» Posted By M.Sri Hari Krishna On April 30, 2015 @ 10:31 am

ఎబోలా, ఎయిడ్స్‍పై మన ‘ప్రావీణ్యం’
00

ఎబోలా మరియు ఎయిడ్స్ మొత్తం ప్రపంచాన్ని గడ గడా వణికిస్తున్న సమయం లో వాటికి ఒక పరిష్కార
మార్గాన్ని కనుగొన్న డా. ప్రవీణ్ కుమార్ అభినందనీయులు. దేశ విదేశాలలో ఈ ఔషధానికి గుర్తింపు మరియు ఆదరణ లభిస్తాయి. సాధారణం గా ఈ రంగం లో జెర్మనీ లో పలు రకములయిన మందులు
పరిశోధనలు గత 200 ఏళ్ళుగా జరుగుతున్నాయి. కానీ మన దేశంలో అందునా మన సిటీ కి చెందిన ప్రముఖ వైద్యుల ద్వారా ఇటువంటి ప్రయోగం సఫలం కావడం మనకు గర్వ కారణం.
Hats off to Dr. Praveen Kumar and his team for this meritorious and commendable achievement. I wish them all success. Nothing succeeds like success. BRAVO.

» Posted By M.Sri Hari Krishna On April 6, 2015 @ 2:35 pm

వ్యంగ్యరేఖలు- ఈనాడు
00

Cancer cures smoking. Go ahead.

» Posted By M.Sri Hari Krishna On April 6, 2015 @ 2:37 pm

సుధామతో ముచ్చట్లు
00

సుధామ గారి పేరు వినగానే నాకు ఒక శ్లొకము గుర్తుకు వస్తున్నది.
రోహిణీ శ సుధా మూర్తి స్సుధాగాత్ర స్సురాళనః – చ0ద్రుని వర్నిస్తూ చెప్పబడ్డ శ్లొకమిది.
వారు గళ్ళ నుడి కట్టు create చెయ్యడ0లో దిట్ట. సుధామ గారిని ప్రప0చ తెలుగు
మహా సభల సమయ0లో కలిశాను. నా అభిమాన రచయితను అలా కలవడము నాకు గొప్ప
అనుభవము. ఆకాశ వాణితో వారికి చాలా గొప్ప పేరు, గుర్తి0పు కలిగినవి.
I convey my best wishes to Sri Sudhama Garu. Great to know about him
through this article. Thanks you for sharing.

» Posted By M.Sri Hari Krishna On March 29, 2015 @ 9:58 pm

«« Back To Stats Page