Stats

Comments Posted By Sarma Kanchibhotla

Displaying 1 To 30 Of 185 Comments

వ్యంగ్య రేఖలు- ఆంధ్రజ్యోతి
00

వ్యంగ్య చిత్రము అనుటకు బదులు వ్యంగ్యవాణి అనుటలోని ఔచిత్యము తెలుపండి.

» Posted By sarma kanchibhotla On December 12, 2014 @ 5:09 pm

మీలో నోరు జారనివారు ఎవరో చెప్పండి
00

కాలు జారితే పరవాలేదు కాని నోరు జార కూడదన్నది ప్రాధమిక సూత్రం. కొందరు కాలు జారవచ్చు, నోరూ జారవచ్చు, అది వారి ప్రాధమిక హక్కు. ఇది ప్రాధమికమైనదానికి కొనసాగింపు. అందునా అధిక సంఖ్యాకులకు మినహాయింపు లేదన్నది ముక్తాయింపు. అల్ప సంఖ్యాకులకు ఇది అనునయింపు. వ్యాసము మంచి తాలింపు, శ్లేషల మేళవింపు.

» Posted By Sarma Kanchibhotla On December 6, 2014 @ 11:33 pm

నవ తెలంగాణ- ఒక స్పందన
00

ముంజేతి కంకణము వ్యాసములో బాగా ప్రతిబింబించింది. గోపీనాధ్ గారి కాలజ్ఞానం బాగుంది.

» Posted By Sarma Kanchibhotla On December 5, 2014 @ 10:44 pm

చదువుకి రంగులు పులమొద్దు
00

కాలవగట్టు ప్రధాని కుమార్తెకు వ్రాసిన ఉత్తరాలు పాఠ్యాంశముగా పెట్టినప్పుడు లేని బాధ, కాలవగట్టు ప్రధాని వీలునామా పుస్తకాలలో జొనిపినప్పడు లేని నెప్పి ఇప్పుడెందుకో?

» Posted By Sarma Kanchibhotla On December 5, 2014 @ 10:52 pm

మేకకు తోడేలు సలహా
00

వార్తకు మీరు పెట్టిన మకుటము అపార్ధాలకు దారి తీస్తుందేమో గమనించండి.

» Posted By Sarma Kanchibhotla On December 2, 2014 @ 11:04 pm

స్పందనః జెపి తీరు
00

వ్యక్తికి, వ్యవస్థకు తేడా తెలియకనా, నిరాశానిస్పృహలతోనా, విద్యాధికుడినన్న అహంకారమా? పరిపాలనా దక్షుడనిపించుకొన్న అహంభావమా? ఇవన్నీ కలిసి మితిమీరి, స్మృతితప్పి అరిషడ్వర్గాలు అదుపు తప్పి ప్రవర్తించిన తీరు గర్హనీయం. సమైక్య ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగానా గురించి మాట్లాడిన సందర్భములో మీడియా పాయింట్ దగ్గర తలమీద తగిలిన దెబ్బకు వివేచన, వివేకము గాడి తప్పినట్లు కనబడుతున్నది. వైద్యుడే కనుక తగిన ఉపచర్యల పిమ్మట మాట్లాడటం మొదలు పెడితే పరువేమన్నా మిగిలిఉంటే అది దక్కుతుంది.

» Posted By Sarma Kanchibhotla On December 2, 2014 @ 10:58 pm

తెలుగుతనానికి గానపథం
00

అంతటివాడు, అంత సహనముతో, అకుంఠిత దీక్షతో, తెలుగుదనానిని ప్రోత్సహించుటకు తనదైన శైలిలో చేయుచున్న ఈ యజ్ఞము నిరంతరముగా సాగాలని మనసారా కోరుకొంటున్న అశేష తెలుగువారిలో నేనొకడినని వినమ్రతతో తెలియజేస్తున్నాను. ఈ యజ్ఞమునకు వనరులు సమకూర్చుచున్న ఈటివి యాజమాన్యపు తోడ్పాటు అనన్యసామాన్యము. అందరికి కృతజ్ఞతాభివందనములు.

» Posted By Sarma Kanchibhotla On November 25, 2014 @ 11:25 pm

వెడలెను కోదండరాము…. (శ్రీరమణీయం)
00

శ్రీరమణ శ్రీ రమణయే ! ఆద్యంతం రమణీయం, కోదండరరామునితో అంతము చేయటముతో సరయూ స్ఫురణ కలిగింది.

» Posted By Sarma Kanchibhotla On November 22, 2014 @ 11:36 pm

పంజరంలో చిలుక
00

నియమించిన పెద్దలకు ఏ –త్రాళ్ళు వేయలేదేమనే సామాన్యుని సణుగుడులో ధర్మం దాగిలేదా?

» Posted By Sarma Kanchibhotla On November 22, 2014 @ 11:44 pm

నిజం నిలకడమీద తెలిసింది….
00

పోయినోళ్ళు అందరు మంచోళ్ళు అన్న సూక్తి చెప్పి వదిలేస్తే ఇందర్ గారు నా సమయం చాల ఆదా చేసి వుండేవారు.

» Posted By Sarma Kanchibhotla On November 13, 2014 @ 11:27 pm

పోలీసు వ్యవస్థలో బాంచన్ కాల్మొక్త
00

నిన్న మిత్రపక్షం సభ్యుడు చెప్పిన “శ్రవణానందం” కధ గుర్తుపెట్టుకొంటే మానసిక ఆరోగ్యాలకు మంచిది. “శాసన” సభ పేరు నిలబెట్టేట్లు అధికార పక్షం విపక్షాలను శాసిస్తోంది అని బాధితులు చెప్పటం గమనార్హం.

» Posted By Sarma Kanchibhotla On November 13, 2014 @ 11:17 pm

మీ చావు మీది మా గొడవ మాది
00

చెవిటివారి చెవిలో శంఖం ఊదినా ఉపయోగము లేదన్న ప్రాధమిక సూత్రం ప్రతిరోజు స్మరణకు తెస్తున్న ‘ వారికి ‘ అభినందనలు.

» Posted By Sarma Kanchibhotla On November 13, 2014 @ 11:32 pm

ఈశ్వర్ అల్లా తేరే నామ్
00

ఎల్లా అన్నా ఈ దేవుడే దిక్కు.

» Posted By Sarma Kanchibhotla On November 13, 2014 @ 11:10 pm

నెహ్రూ జాతీయ నాయకుడా, కాంగ్రెస్ నాయకుడా?
00

నరేంద్ర మోదీగారిని పిలవకపోవటంవలన నరేంద్రుని స్థాయి ఏమీ తగ్గలేదు. కాలవగట్టువాళ్ళకు తెలుసుకాబోలు ఆ జాతర నరేంద్ర మోదీ గారు రావలసిన స్థాయి కాదని. మోహన్ దాస్ కరంచంద్ గారి ప్రాపుతో ప్రధాని అయిన వ్యక్తికి స్వయంశక్తి వలన ఆ పదవి వరించిన వ్యక్తికి నక్కకు నాకలోకానికి ఉన్నంత అంతరమున్నది. తల్లివేరు చచ్చి ఎండిపోతున్న చెట్టుకున్న కొన్ని పండుటాకులు నరేంద్ర ప్రభంజనములో కొట్టుకుకొని పోగా మిగిలినవి.

» Posted By Sarma Kanchibhotla On November 12, 2014 @ 9:49 pm

కరణేషు మంత్రీ….
00

అక్షరం అక్షరం నిజాయితీ తొణికిసలాడుతోంది. ఇన్నేళ్ళకు భారతమునకు రత్నమై నిలిచిన వ్యక్తి గుండెలోతుల్లోంచి వచ్చిన వాక్యాలకు స్పందనేముంది – నా వందనమే

» Posted By Sarma Kanchibhotla On November 10, 2014 @ 11:18 pm

ఓటిది అనుకోకండి- ఓటు ఇది!
00

వ్యాసము కంటె మీరు పెట్టిన మకుటం చదివించేలా చేసింది

» Posted By Sarma Kanchibhotla On November 10, 2014 @ 11:12 pm

త్రివిక్రమ్‍పై అక్షర స్పందన
00

తెలుగువాడు గర్వించే రచయిత. చీ కొట్టించుకొనే జీరోలను హీరోలుగా చూపించి చప్పట్లు కొట్టించుకొనేటట్లు చేయగల బ్రహ్మ. సినిమాను రన్ వే మీద వేగముగా పరిగెత్తే విమానములా నడిపించగల స్థితికర్త. ప్రేక్షకుల మనసులను కధలోను, కధనములోను, సంభాషణలలోను లయముచేయగల లయకర్త. “ఇంతవాడు ఇంతింతై ఎంతో ఎదిగిపోయాడమ్మ” అనిపించుకొన్న త్రివిక్రముడు, నిర్మాతల పట్ల శ్రీనివాసుడు. వయసుతోపాటు మనసు, బుద్ధి నిత్య యవ్వనముగా ఉండి ఎల్లలులేని కాలములో శాశ్వతకీర్తి సంపాదించుకొంటూ పూర్ణాయుష్మంతుడుగా ఉండాలని మా ఆకాంక్ష

» Posted By Sarma Kanchibhotla On November 7, 2014 @ 10:35 pm

మోదీ- ఒక సానుకూల స్పందన
00

ఉమాపతిగారి వ్యాసము సమర్ధనీయముగా ఉన్నది.

» Posted By Sarma Kanchibhotla On November 6, 2014 @ 10:09 pm

నవ తెలంగాణలో తొలి బడ్జెట్- ఒక విశ్లేషణ
00

ప్రణాళికారచన, అమలుచేయుట మధ్యనే వుంటుంది విషయమంతా! ఇది సర్వులకు విదితమే! అంకెలను చూసి మురిసిపోవటం అల్పసంతోషుల పని. అమలుచేయు విధివిధానాలు, సమర్ధత, నిబద్ధత, శాస్త్రీయత, చతురత ఇవి కాలాంతరమున బయల్పడు విషయములు. నిందిస్తూ కాలము వ్యర్ధముచేయుటకంటె కాలు గడప దాటించి కర్తవ్యము చేపట్టి వేసే ప్రతి అడుగూ ప్రజలు, విజ్ఞులు గమనిస్తారు, స్పందిస్తారు.

» Posted By Sarma Kanchibhotla On November 6, 2014 @ 10:24 pm

నాయకుడు ఆదర్శాలు పాటిస్తే….
00

రొమ్ము విరుచు తిరిగేవాళ్ళని, వళ్ళు వంచమంటే కష్టమే !

» Posted By Sarma Kanchibhotla On November 3, 2014 @ 11:32 pm

(కె)మేరా భారత్ మహాన్
00

శివ, శివ, నారాయణ, నారాయణ

» Posted By Sarma Kanchibhotla On November 3, 2014 @ 11:24 pm

జెపికి కోపమొచ్చింది
00

జేపిగారు తెలుగువారిని విడదీయటములో పోషించిన పాత్ర తెలుగుజాతి మరువదు. అప్పటి అసమర్ధ ప్రధాని తమను సంప్రదించేవారనీ, జైరాం రమేష్ గారికి సమైక్య ఆంధ్రమును విడగొట్టుటలో కావలసిన వివరములను అందించానని చేసిన ప్రకటనలను చూసి తెలుగువారు ఆగ్రహించిన ఫలితమే జేపిగారి కల చెదిరిపోవుటకు కారణమని నా అభిప్రాయము. ఆ అక్కసు, ఆగ్రహము, ఆక్రోశము, ఆవేదన అసందర్భం. మౌనముగా ప్రజాతీర్పును గౌరవించి ఆత్మవిమర్శ చేసుకొంటే వారంటే సదభిప్రాయమున్న కొందరి సానుభూతి లభిస్తుంది కొంతవరకు. సిద్ధాంతాలను విమర్శించటం తప్పుకాదు, వ్యక్తులపేర్లు పెట్టి అగౌరవంగా మాట్లడితే ఆకాశంవైపు తిరిగి ఉమ్మి వేసినట్లే అవుతుందని గ్రహించటానికి ఎక్కువకాలం పట్టదు.

» Posted By Sarma Kanchibhotla On November 3, 2014 @ 12:09 am

ఇందిర-మోదీ సాపత్యాలు
00

ఈ వ్యాసములోని విషయాలతో నేను పూర్తిగా విభేదిస్తున్నాను. నా దృష్టిలో ఇందిర తెలివిలేని వ్యక్తి. గాంధి, నెహ్రు పేర్లు పెట్టుకొని కాలం వెళ్ళదీసింది. సుఖము తప్ప కష్టము తెలియని వ్యక్తి. స్త్రీలు గౌరవింపబడే భారతావనిలో కేవలం సానుభూతితో, మరోనేత లేని కారణాన ఆ స్థానములో కొనసాగింది.
నరేంద్రుని క్రమశిక్షణ, నిబద్ధత, స్వయంకృషి, వ్యక్తిత్వం, జాతీయాభిమానం, పట్టుదల, ఆయనను ఇంతవరకు భారత దేశములో ఏ ప్రధాని చేరలేని స్థానములో నిలిపింది.
ఇందిరకు నరేంద్రునికి పోలికపెట్టచూచిన వ్యాస రచయిత ఉద్దేశ్యములో నిజాయితి లోపించిదనిపించింది.

» Posted By Sarma Kanchibhotla On November 2, 2014 @ 11:50 pm

తెలుగుల విభజన- ఒక స్పందన
00

ఐలయ్య గారి వ్యాసం చాలా ఆలశ్యముగానైనా బయటకు వచ్చింది. ప్రతి అక్షరం ఆలోచింపచేసేదిగా ఉంది. ఇప్పుడు ఆకులుపట్టుకొన్నా కాలినబాధ, కలిగిన గాయం మానదు. ఆచార్యులు జయశంకర్ గారు పోయి బతికారు. కోదండరాం గారికి మాటలులేక పాఠాలు చెప్పుకొంటున్నారు విద్యార్ధులకు. తెలంగానా ప్రజానీకానికి భవిష్యత్తుపై ఆశ కలిగించే శక్తి ఏదో !

» Posted By Sarma Kanchibhotla On November 1, 2014 @ 10:37 pm

ఆంధ్ర రాష్ట్రం అవతరణ దినోత్సవం
00

జూన్ 2 తరువాత ఏర్పడిన రాష్ట్రాన్ని విశాలాంధ్రగా వ్యవహరించటం మంచిది. కాల్వగట్టు ప్రధాని సమయములో ఏర్పడిన సమైక్య తెలుగు రాష్ట్రం కల్వకుంట్లవారి సమయములో తెలుగును విభగించి తె వారు తీసుకొన్నాక మిగిలిన రెండు భాగాలు విశాల ఆంధ్రమే అందముగా ఉండును. అక్టోబరు 1 జరుపుకొనుటే ఉచితము. జూన్ 2 విద్రోహక దినముగా పాటించుట సమంజసము.

» Posted By Sarma Kanchibhotla On October 30, 2014 @ 10:37 pm

కారే రాజులు….
00

రాహుల్ మా హిందూదేశములో ఉందా?

» Posted By Sarma Kanchibhotla On October 30, 2014 @ 11:43 pm

ఒక గొడవ- ఒక స్పందన
00

అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతీ ! అక్రమముగా విభజన జరిగినది అని సీమాంధ్ర, తెలంగాణాలో చాలమంది తమ వోటు ద్వారా తెలియజేశారు. ఆ స్పృహలేక, ముందుచూపులేక, పరిపాలన అనుభవములేక, అయోమయ స్థితిలో ఉండి తన అవిజ్ఞతకు తనే కారణమనుకోంటే కొంత మెరుగు. కార్యశీలత లోపించి ఇతరులను నిందించుకుంటూ కాలం గడిపితే తరువాత తీరికగా విచారించవలసి వస్తుంది.

» Posted By Sarma Kanchibhotla On October 30, 2014 @ 11:28 pm

ప్రాచ్యమా అప్రాచ్యమా
00

భాషకు కూడ ప్రాంతీయతత్వాన్ని అంటగట్టి రచ్చమంటలో చలికాచుకొనే ప్రయత్నాలు గర్హనీయము. ఒక విషయమును పరిశోధనాంశముగా చర్చ సాగితే అది హర్షణీయము. అట్లుగాక ఎవరికి తోచిన ఆధారాలు వారు చూపుతూ వారి అభిప్రాయమే సరియైనదని సిద్ధాకరించుట వెర్రితలలపని. విజ్ఞులు గమనించాలని మనవి. పార్వతీశంగారి అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.

» Posted By Sarma Kanchibhotla On October 25, 2014 @ 10:48 pm

తెలుగూ తెలుగూ హాయ్ హాయ్
00

అధికార దాహముతో ప్రజాసంక్షేమాన్ని పణముగాపెట్టి చేసిన పనులకు ఫలితం ఇది. ఈ రావణకాష్టం ఆరేది కాదు.

» Posted By Sarma Kanchibhotla On October 25, 2014 @ 11:03 pm

ప్రాచ్యమా అప్రాచ్యమా?
00

తోకలవారి శిరోవేదన తగ్గినదని తలుస్తాను. ఎవడిగోల వాడిది అని వదిలేస్తే ఇంత అల్లరి ఉండదు.

» Posted By Sarma Kanchibhotla On October 20, 2014 @ 11:26 pm

«« Back To Stats Page