Stats

Comments Posted By bhanumathi mantha

Displaying 1 To 6 Of 6 Comments

మన కథకులు
00

కథకుల పరిచయం చాలా బాగుందండీ! (నాది తప్ప).
ఏమిటో! కెమిస్ట్రీ డిపార్ట్మెంట్‍లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్లు రాశాను.
త్వరలో, మార్చి పంపిస్తాను మళ్ళీ, ఫొటో తో సహా. వెబ్ అందుకే మనకి ఎంతో ప్రయోజనకారి.
మంథా భానుమతి.

» Posted By bhanumathi mantha On February 11, 2009 @ 7:43 pm

ముందుమాట
00

సాహితీ మిత్రులకి నమస్కారం.
చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పలుకరిస్తున్నాను. ఈ మధ్యన మా కారులో కాశీ వరకూ వెళ్ళొచ్చాం.
ఇదేదో ప్రాసకోసం పాట్లనుకుంటారేమో! నిజంగా నిజం. ఫిబ్రవరి ౧౭న బయల్దేరి, తూర్పు కోస్తా మార్గంలో కాశీ వెళ్ళి, మధ్య భారత మార్గంలో వెనక్కి వచ్చాం. ఆవిశేషాలు మళ్ళీ వ్రాస్తాను.
అంతకు ముందు ఫిబ్. ౧౪,౧౫ తేదీల్లో, వంగూరి చిట్టెంరాజుగారి ప్రపంచ సాహితీ సదస్సులో పాల్గొన్నాము.. రెండో రోజు మహిళా సదస్సులో చాలా మంది రచయిత్రులు ప్రసంగించారు, తమ స్వీయ రచనలు చదివారు. అందులో నేనుకూడా అనుకోండి.
ఈనెల కౌముది చదివారా? అందులో మంచి కథలున్నాయి. ముఖ్యంగా, శారదగారి “ఊహాచిత్రం” మనసుకి హత్తుకు పోయేలాగుంది. నాదే కాదు, వారణాసి నాగలక్ష్మిదీ, కె.బీ.లక్ష్మిది కూడా అదే అభిప్రాయం. నిర్మలాదిత్యగారి కథకూడా చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి.. తప్పకుండా చదవండి.
ఈనెల ౧౯న బయల్దేరి అమెరికా వెళ్తున్నాము. కొన్ని నెలలు అక్కడ మనవలతో కాలక్షేపం.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
మంథా భానుమతి.

» Posted By bhanumathi mantha On March 16, 2009 @ 8:27 pm
00

రమాదేవి గారికి,
ఒక ప్రపంచ సమ్మేళనం హైద్రాబాదులో జరగబోతోంది, వంగూరి చిట్టెంరాజుగారి ఆధ్వర్యంలో.
వివరాలకి, కౌముది.నెట్(ఇంగ్లీష్‍లో చూడాలి) సైట్‍కి వెళ్తే దొరుకుతాయి. త్యాగరాజ గానసభలో, ఫిబ్రవరి ౧౪ నించీ జరుగుతున్నాయి.
అందులో మీరు ప్రముఖ రచయితలనందర్నీ కలవచ్చు.
మంథా భానుమతి

» Posted By bhanumathi mantha On January 13, 2009 @ 1:06 pm
00

సాహితీ మిత్రులకి,
నిన్న నేను రాసిన సమాచారంలో ఒక తప్పు దొర్లింది. క్షమించాల్సిందిగా కోరుతున్నాను.
పొత్తూరి విజయలక్ష్మిగారి బదులుగా పాటిబండ్ల విజయలక్ష్మి అని వ్రాశాను.
నా ఉద్దేశ్యం, హాస్య కథల రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారని.
ఇట్లు, మంథా భానుమతి.

» Posted By bhanumathi mantha On November 24, 2008 @ 8:11 pm
00

వసుంధర గారికి,
నమస్కారములు. ఏ ఉపోద్ఘాతమూ లేకుండా నేను ఒక లేఖ వ్రాశాను. చూసేఉంటారు. మిమ్మల్ని పలుకరించకుండానే వ్రాశానని అనిపించి మళ్ళీ రాస్తున్నాను. మీ అక్షరజాలం చూడగానే ఉత్సాహం ఆపుకోలేక రాసేశాను.
మళ్ళీ వచ్చిందాలేదా అనికూడా చూసుకున్నాననుకోండి.
లేఖిని సభకి వెళ్ళినప్పుడే అందరూ, “శనివారం కార్తీకభోజనాలు పెట్టుకున్నాం..మీరుకూడా రావాలి” అని ఆహ్వానించారు.
సంజీవయ్య పార్కులో ఉదయం పదిన్నరకి అన్నారు.
నేను మామూలుగా అన్ని పిక్నిక్కుల్లాగే ఉంటుందిలే అని పదకొండున్నరకి వెళ్ళాను..కానీ అది లేఖిని వాళ్ళు నిర్వహించేసి కదా..
అందరు వచ్చేసి, కొన్ని ఆటలు కూడా ఆడేశారు.
నేను చిన్నప్పట్నుంచీ చూడాలని కలలు కనే రచయిత్రులందర్నీ కలవగలిగాను.
శ్రీమతులు యద్దనపూడి సులోచనారాణీ, పోలాప్రగడ రాజ్యలక్ష్మి, డి.కామేస్వరి,శారదా అశోకవర్ధన్, తురగా జానకీరాణి, పాటిబండ్ల విజయలక్ష్మి, తమిరిశ జానకి, ఇంద్రకంటి జానకీబాల, శరజ్యోత్స్నారాణి, వారణాసి నాగలక్ష్మి, గంటి భానుమతి, కన్నెగంటి అనసూయ, ఉంగుటూరి శ్రీలక్ష్మి..ఇంకా చాలామంది..మొత్తం ఇరవైనాలుగు మంది కలిశాము.
సరదాగా ఆటపాటలతో సమయం ఎలా గడిచిందో తెలియలేదు.
కమ్మని తెలుగు వంటకాలతో, చమత్కారాల రుచులతో భోజనాలు చేసి ఇళ్ళకి వెళ్ళాము.
ఇట్లు,
మంథా భానుమతి.

» Posted By bhanumathi mantha On November 23, 2008 @ 9:01 pm

సాహితీ సమాచారం
00

సాహితీ మిత్రులందరికీ నమస్కారం.
నాకు నవంబర్ ఇరవయ్యో తేదీన “లేఖిని” మహిళా చైతన్య సంస్థ వారి నిర్వహించిన డా.వంగూరి చిట్టెంరాజు గారి సన్మాన సభకి వెళ్ళే అవకాశం కలిగింది. రచయిత్రి గంటి భానుమతిగారు ఫోన్‍లో వివరాలు అందించగా అందరినీ పరిచయం చేసుకోవడానికి వీలవుతుందని వెళ్ళాను.
ఆహ్లాదకరమైన సాయంకాలం..అదే మొదటిసారి లేఖిని సభలకి హాజరు కావడం. ఎలా ఉంటుందోనని సంకోచంతోనే వెళ్ళాను. కానీ అక్కడ అసలు కొత్త అనిపించకుండా చక్కగా పలుకరించారు, పేరుపొందిన రచయిత్రులందరూ.
వాసా ప్రభావతి గారు, ముక్తేవి భారతి గారు నాకు అంతకుముందే పరిచయం.
“చుట్టుప్రక్కలంతా తవ్విపోసేశారండీ! ఎక్కడ పడిపోతానో అని భయంవేసింది నడుస్తుంటే..” వెళ్తూనే జనాంతికంగా అన్నాను. అక్కడికి నేనే ఏదో కష్టపడిపోయినట్లు.
“అదే కదండీ మరి..సాహిత్య సభల మీది ఆసక్తికి పరీక్ష..” పాటిబండ్ల విజయలక్ష్మి గారు సహజధోరణిలో నవ్వుతూ పలుకరించారు.
అలసట పోయేలా, మిత్రులు తేనీటి విందుతో స్వాంతన పరిచారు.
సన్మాన సభ అనుకున్న టైమ్‍కీ ఖచ్చితంగా ఆరుగంటలకి మొదలుపెట్టారు.
పోతుకూచి సాంబశివరావుగారు వ్యాఖ్యాత. చిట్టెంరాజుగారు చెయ్యికి కట్టుతో (ఫ్రాక్చర్ అయిందిట) చిరునవ్వుతో కూర్చున్నారు. ఆంధ్రభూమి లక్ష్మిగారు, వాసా ప్రభావతి, వంశీ రామరాజు గారు వేదిక నలంకరించారు. వేదిక మీద కాకుండా కింద వేశారు..ముఖ్య అతిధులకి కూడా. అందుకే నేను “డ్రాయింగ్‍రూంలో కూర్చుని మాట్లాడు కుంటున్నట్లు గా ఉంది” అని వ్యాఖ్యానించాను.
అందరూ చిట్టెంరాజు గారి గురించి, ఆయన హాస్య, చమత్కార రచనల గురించీ చెప్పారు. ఆఖరుకి నేను కూడా.
చిట్టెంరాజు గారు కృతజ్ఞతలు చెప్తూ, మస్కట్‍లో జరగబోయే ప్రపంచ సాహితీ సభల గురించి ప్రస్తావించి, ఆహ్వానించారు.
ఆ విధంగా నా ప్రధమ లేఖినీ సభ, మరపురాని అనుభవంగా మిగిలింది.

» Posted By bhanumathi mantha On November 23, 2008 @ 8:34 pm

«« Back To Stats Page