Stats

Comments Posted By bonagiri

Displaying 1 To 15 Of 15 Comments

ఆలస్యానికి దారేది?
00

బానే ఉంది కాని, ఉద్యమకారులు, జనం రోడ్లమీదకు వచ్చి గొడవ చేస్తే తప్ప శాసనాలు చెయ్యరా?
ఇదేమి ప్రజాస్వామ్యం?

» Posted By bonagiri On December 18, 2013 @ 5:53 pm

ఓ పాత సినిమా చిట్కా
00

చాలా పాత పార్టీ కదా, అందుకే యమగోల నాటి రావుగోపాలరావు చిట్కా ఉపయోగించారు.
వచ్చే ఎన్నికలలో ప్రజలు వాళ్ళ పార్టీనే “ఫాడ్‌కే ఫేక్‌నా” చేస్తారు.

» Posted By bonagiri On September 29, 2013 @ 1:05 pm

మిథునం- చిత్రసమీక్ష
00

మీ సమీక్ష నిష్పాక్షికంగా ఉంది. మిధునం సినిమా నాకు చాల నచ్చింది. కొన్ని చిన్న చిన్న లోపాలున్నా, మొత్తంగా చూస్తే చిత్రం అద్భుతః

భరణి గారు జోడించిన మాటలు చాలా బాగున్నాయి. నా దృష్టిలో అప్పదాసు పాత్రకి కీ. శే. పుచ్చా పూర్ణానందం గారి శరీరం, వాచకం సరైన న్యాయం చేయగలిగేవి. రెగ్యులర్ నటుడు కాబట్టి చంద్రమోహన్ అయినా ఇంకాస్త సహజంగా ఉండేది. అయినా బాలు గారు తన పాత్రని బాగా ఇష్టపడి చేసినట్టు అనిపించింది.

మళయాళ చిత్రం కూడ చూసాను కాని, దానికంటే కథలోలాంటి తెలుగుదనం ఉన్న మిధునమే బాగుంది. రెండు గుండెల మైథునం అని నేను కూడ చిన్న సమీక్ష నా బ్లాగులో వ్రాసాను. సమయముంటే చదవగలరు.

» Posted By bonagiri On May 31, 2013 @ 4:52 pm

జులాయి – చిత్రసమీక్ష
00

మీ సమీక్ష న్యాయంగా ఉంది.

సినిమా పేరే ‘జులాయి’ అయినప్పుడు హీరో మర్యాదగా ఎలా మాట్లాడతాడు?
బహుశా ‘ఇడియట్’ సినిమా నుంచే తెలుగు హీరోలు మర్యాద మర్చిపోయారనుకుంటాను.

» Posted By bonagiri On August 30, 2012 @ 6:26 pm

గబ్బర్ సింగ్- చిత్రసమీక్ష
00

మీ సమీక్షలు బాగుంటాయి.
కాని మీరు ఇంత ఆలస్యంగా ఎందుకు వ్రాస్తున్నారు?

» Posted By bonagiri On June 17, 2012 @ 8:26 am

బిజినెస్‍మేన్- చిత్ర సమీక్ష
00

నా చిన్నప్పుడు ఆంధ్రప్రభలో మీ “మొక్కలు పిలుస్తున్నాయి” సీరియల్ నాటి నుంచి మీ రచనలు చదువుతున్నాను.

నా, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నా, మీలాంటి ప్రముఖ రచయితలు నేను వ్రాసింది చదివి, బాగుందనడం నాకెంతో సంతోషం.

» Posted By bonagiri On February 20, 2012 @ 1:41 pm
00

my blog http://www.bonagiri.wordpress.com

» Posted By bonagiri On February 20, 2012 @ 12:46 pm
00

ఫణీంద్ర గారితో చాలావరకు ఏకీభవిస్తున్నాను.
“ఆరోగ్యకరమైన ధోరణి”
“నిజాయితీతో కూడిన కసి”
మీ సమీక్షలో ఈ పదాలు నాకు అర్థం కాలేదు.

నా దృష్టిలో ఈ సినిమా ఒక అనారోగ్యకరమైన ధోరణి.
ఇక దర్శకుడికి కసి, అవేశం చాలా ఎక్కువ ఉన్నాయి కాని, నాకు అందులో నిజాయితీ కనపడలేదు.

ఈ సినిమా ఒక మామూలు కమ్మర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు, రాఘవేంద్రరావు సినిమాలలా.
అలాగే మణిరత్నం నాయకుడు లేదా పరిందా లాంటి సీరియస్ మాఫియా సినిమా కూడా కాదు.

ఈ సినిమాపై నా అభిప్రాయం (సమీక్ష కాదు) నా బ్లాగులో వ్రాసాను. వీలైతే ఒకసారి చదవండి.

» Posted By bonagiri On February 19, 2012 @ 3:26 pm

రెండు ధారావాహికలు
00

పసలపూడి కథలు చదివి ఊహించుకున్నంత గొప్పగా ఈ సీరియల్ లేదండీ.
ఒకో ఆదివారం ఒకో కథ విసుగు అనిపించకుండా చూపిస్తే బాగుండేదేమో.

» Posted By bonagiri On March 24, 2011 @ 2:07 pm

బుల్లితెరపై మాట్లాటలు
00

కేవలం గ్లామరుతో టాక్ షో నిర్వహించాలనుకోవడం బాగోలేదు.
టాక్ షో కి తెలివితేటలు, సమయస్ఫూర్తి కావాలి కదా.
ఉదాహరణకి రాం గోపాల్ వర్మ తో జయప్రద ఏమీ మాట్లాడలేకపోయింది.

» Posted By bonagiri On March 24, 2011 @ 2:00 pm

పాడుతా తీయగా (ఈ టీవీ)- (పంతొమ్మిదవ భాగం)
00

టి వీ లో చూస్తుంటే ఈ కార్యక్రమం విజయవాడలో జరిగినట్లు అనిపించలేదు.
స్టూడియోలో తీసి మిక్స్ చేసినట్లు ఉంది.
మీ అభిప్రాయం ఏమిటి?
ఎవరైనా విజయవాడలో హాజరయినవాళ్ళు confirm చేస్తారా?

» Posted By bonagiri On September 7, 2010 @ 12:07 pm

కీర్తిశిఖరంపై సచిన్
00

Yes Sachin is Great Indian.

» Posted By bonagiri On February 26, 2010 @ 9:47 am

ఈటీవీ కార్యక్రమాలు
00

నిజమే బాలు గారి లాంటి సంస్కారవంతమైన ఏంకర్లు చాలా అరుదు.
హిందీలో అమితాబ్ కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు.
మిగతా చాలామంది ఏంకర్లు అతి తెలివి ప్రదర్శిస్తూ పోటీదారులని ఆటపట్టించడం, అవమానపరచడం, గేలి చేయడం చేస్తూ తామేదో గొప్పవాళ్ళమనుకుంటారు.

» Posted By bonagiri On November 29, 2009 @ 3:48 pm

పుస్తకం హస్తభూషణం. మస్తక మథనం. ఈ పుస్తకాలు మీరు చదివారా? కాళీపట్నం రామారావు రచనలు
00

ఈ మధ్యనే బెంగుళూరు పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం కొన్నాను.
ఇంకా అన్ని రచనలూ చదవలేదు.
ఆయన వ్రాసిన “కుట్ర” కథ ఎప్పుడో ఆంధ్రజ్యోతిలో చదివి ఆయన అభిమానినయ్యాను.

» Posted By bonagiri On January 2, 2011 @ 4:02 pm

ముందుమాట
00

నా చిన్నప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో బహుమతి పొందిన మీ నవల “మొక్కలు పిలుస్తున్నాయి” నుండి మీ రచనలు చదువుతున్నాను.
రచన, స్వాతి లలో మిమ్మల్ని ఎక్కువగా చదివాను.
మీ సాహితీ వ్యాసంగం నిరాటంకంగా సాగిపోవాలని ఆశిస్తున్నాను.

» Posted By bonagiri On November 29, 2009 @ 4:22 pm

«« Back To Stats Page