Stats

Comments Posted By hari.S.babu

Displaying 1 To 22 Of 22 Comments

గాంధీ-జిన్నా-నెహ్రూ ఓ కొత్త కథ
00

ఆ వొక్క మనిషి ఈ దేశానికి పెట్టిన కుంపట్లు యెన్ని వున్నాయో?ఇంకెన్ని బయటికి వస్తాయో?ప్రపంచ చరిత్ర లోనే దేశభక్తుడి గా చెలామణీ అయ్యే యే వ్యక్తీ తన దేశపు చరిత్రకి ఇంతగా హాని చెయ్యలేదు!అయినా అతను ఇంకా పండిట్ అనే గౌరవించడుతున్నాడు?

» Posted By hari.S.babu On October 4, 2014 @ 1:47 pm

‘సర్వే’స్వరం
00

చాలా బాగుంది సార్!రచయిత అనుభవమూ, శర్మ కంచిభొట్ల గారి సమర్ధనా రెండూ అట్టడుగున వున్న ప్రజల వాస్తవ పరిస్థితిని తెలియజేస్తున్నాయి!ఇలాంటి అనుభవాలు తెలుస్తుంటేనే భేదభావాలు సమసిపోతాయి.

» Posted By hari.S.babu On August 28, 2014 @ 3:05 pm

పాల్కురికి సోమన
00

“జాతుల్ సెప్పుట, అన్యాయ విఖ్యాతిం బొందుట, మృషల్ సంధించుట, కొండె కాడవుట” అని ఒక పెద్ద జాబితా ఇచ్చి “అన్నియు పరద్రవ్యంబు నాశించి” చేస్తారని చెప్పి “ఈ శ్రీ తానెన్ని యుగంబు లుండగలడో” అని నిట్టూర్చాడు పాతకాలం నీతిసూత్రాల శతక కర్త!

మంచి వాదనా పటిమతో అందమయిన భాషలో సిధ్ధాంతములు చెప్పగలిగిన ఆధునికులు ఆ మిత్రవాక్యమును పాటించ కున్నారు, యేమి చేద్దాం?

» Posted By hari.S.babu On August 12, 2014 @ 11:59 am

మరో కొత్త కులంగా స్థానికులం!
00

ఈ పిట్టకధలు యెవరినీ మార్చలెవు, ముఖ్యంగా వెయ్యి అబధ్ధాలు చెప్పయినా ఒక పెళ్లి చెయ్యమన్న చందంగా లక్ష అబధ్ధాలు చెప్పయినా మనం విడిపోవలసిందే నని చదువుకున్న వాళ్ళు కూడా యేమాత్రం సిగ్గు పడకుండా అబధాలు చెప్పడానికి సిధ్ధపడిన చోట ఇవన్నీ చెవిటి వాళ్ళ ముందు శంఖమే కదా!

» Posted By hari.S.babu On August 5, 2014 @ 2:10 pm

బాపూ రమణీయం- భరణిలో
00

wow!bharani is great!

» Posted By hari.S.babu On August 4, 2014 @ 3:37 pm

భలే రాముళ్లు
00

ఈ తొమ్మిది మందీ నవగ్రహాలై ఆంధ్రావాళ్లని యేమి యేడిపిస్తున్నారు?వీళ్ళ బారి నుంచి తప్పుకోవదానికి కొత్త నవగ్రహ స్తోత్రం రాసుకోవాలేమో?

» Posted By hari.S.babu On July 30, 2014 @ 12:08 pm

మనమూ మన ఆలయాలూ
00

పేరుకే సెక్యులరిజం అనే గొప్ప.ఇదంతా హిందూ ధర్మాన్ని లోకువ చెయ్యటమే.హిందూ ధార్మిక సంస్థల్నీ దేవాలయాల్నీ ప్రభుత్వ పరిధి నుంచి తప్పించి తీరాలి – టీటీడీ తో సహా అన్ని దేవాలయాల్నీ మిగతా మతాలకు చెందిన వాటికి లాగే వ్యవహరించేటట్టుగా చట్తాల్ని మార్చాలి.

» Posted By hari.S.babu On July 18, 2014 @ 3:02 pm

పిట్ట తగవూ పిట్ట తగవూ
00

నూతనంగా యేర్పడిన తెలంగాణా ప్రభుత్వ వైఖరీ వుద్యమ కాలం నుంచీ ప్రభావ శీలురయిన మేధావుల తీరూ తెలంగాణాని బాగు చేసుకోవడం కన్నా ఆంధ్రాని యెలా దెబ్బ తియ్యాలా అనే దాని మీదే దృష్టి పెట్టినట్టుగా వుంది వారి వ్యవహార శైలి చూస్తుంటే.

కృష్ణా డెల్టాకు నీటి విషయంలోనే జలసంఘంలోని అధికారులే కావాలంటే మీకూ అడగండి,అంతే కానీ అంతా నిండే వరకూ నీళ్ళు వదలబోమంటే యెలా అంటున్నా వినిపించుకోకుండా ఆంధ్రాకు వాటాయే ఇవ్వదల్చుకోనంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు!

మనుషుల్లో యెంత దుర్మార్గుడయినా యెదటివాడికి మంచి నీళ్ళు ఇవ్వని వాడు వుండదంటారు, మరి ఇదేమి చిత్రమో మాకు అన్యాయం జరిగిందని పోరాడిన వాళ్ళు ఇవ్వాళ ఇంత అన్యాయానికి తెగబడుతున్నారు?సాటి వాళ్ళకి మంచినీళ్ళ సాయమే చెయ్యని వాళ్ళు భాషని గురించి సాయాని కొస్తారా?

» Posted By hari.S.babu On July 11, 2014 @ 11:54 am

ముప్పై రోజుల తెలంగాణ ప్రభుత్వం
00

నెల రోజుల్లో భూనభోంతరాళాలు బద్దలవుతాయని ఆశించలేదు గానీ పని తీరు యెలా వుంటుందో తెలిసింది.

1.విధ్యార్ధి అయినా వుద్యొగి అయినా స్థానికత గురించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోనూ రాజ్యాంగంలోనూ వున్న వాటికి బదులుగా ఫీస్ రీ ఇంబర్స్మెంట్ కి మాత్రం తండ్రి పుట్టుక అనే కొత్త ప్రతిపాదన తెచ్చారు.విధ్యార్ధికి సంబంధించిన అతి ముఖ్యమయిన స్థానికతకు సంబంధించిన సాంకేతిక వివరాలకు విరుధ్ధంగా వున్నందువల్ల చెల్లకుండా పోతే?
2.విడిపోయి కలిసుందామని సుద్దులు చెప్పిన వాళ్ళు సచివాలయంలోనే బ్యారికేడ్లు కట్టేశారు.మాకు తెలీదు గవర్నరు కార్యాలయం చేసింది అనేశారు స్కూలు పిల్లల్లాగ.గవర్నరు కార్యాలయం వాళ్ళు కూడా మేము కట్టలేదంటున్నారు, మరి కాకులు కట్టాయా పిల్లులు కట్టాయా?
3.నీటి పారుదలకి సంబంధించిన వ్యవహారాలన్నీ గవర్నరు కార్యాలయం ద్వారానే నడవాలని నిబందనల్లో వున్నా కృష్ణా దెల్టాకు మంచి నీళ్ళకి కూడా అడ్దం పడుతున్నారు,అదేమంటే ఆంధ్రోళ్ళు సాగునీరుగా వాడుకుంటున్నారని అక్కడి నుంచే ఇక్కడ జరుగుతున్నదేంటో చూసినట్టుగానే మాట్లాడు తున్నారు.
4.ఒకప్పుడు ఆంధ్రోళ్ళు “మావన్నీ మాకే, మీవి కూడా మాకే” అనే విధంగా మమ్మల్ని దోచుకున్నారు అన్నవాళ్ళు ఇవ్వాళ కరెంటు విషయాని కొచ్చేసరికి “మా కరెంటు మాకే, మీ కరెంటు కూడా మాకే” అంటున్నారు.చాలా గంభీరమయిన నైతికాంశాల్ని కూడా లేవనెత్తుతున్నారు.
5.కరెంటు విషయంలో మాత్రం ఆంధ్రా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా బిల్లులేని అంశాల్ని మక్కీకి కి మక్కీ గా అమలు చెయ్యాలట, పోలవరం విషయంలో మాత్రం తెలంగాణా అభ్యంతరాలకి విలువ నిచ్చి డిజయిను వారు చెప్పినట్టుగా మార్చాలట!
6.ఆర్భాటంగా ల్యాంకో హిల్ల్స్ మీదకి వెళ్తే అక్కడ సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టు మైక్రోసాఫ్ట్ లాంటివి కూడా పక్కనే వున్నాయని తేలింది.వాళ్ళని బయటికి లాగాలంటే తామే పరిహారం ఇస్తే తప్ప కుదరదు,వారు ముందు చెప్పినట్టుగా అవి వక్ఫ్ భూములు అనే వాదనకి కట్టుబడితే తామివ్వాల్సింది ఒంకా తడిసి మోపెడవుతుంది!ప్రస్తుతానికి కిమ్మనకుండా వుండి పోవటమా దొడ్డిదారిన వెళ్ళటమా యేది శ్రేయస్కరం?
7.పాత భవంతుల్ని కూలుస్తున్నారని దాదాపు పూర్తి కావచ్చే మెట్రో పనుల్ని అర్ధాంతరంగా నిలిపెయ్య మన్నారు,దాని వల్ల చేసే పని మధ్యలో ఆపడం ద్వారా లార్సన్ అండ్ టబ్రో వాళ్లకి యెంత నష్టం?అది వాడు భరించడే, మళ్ళీ పని మొదలెట్టినప్పుడో మరొకప్పుడో ప్రభుత్వం దగ్గిర్నుంచే వసూలు చేస్తాడు గదా!
8.విభజన జరిగిన తీరు చూస్తే చేసిన వాళ్లకి ఇంతకు ముందు రాష్ట్రంలో తేంగాణాతో పాటూ ఆంధ్రా రాయల సీమా అనే మరో రెండు ప్రాంతాలు కూడా వుండేవి అని గానీ విడిపోయాక కూడా అవి వుండాలని గానీ అనే అవగాహన వున్నట్టు కనిపించదు.యేది పడీతే అది వేసెయ్ తెలంగాణాకే, అక్కడ పడే వోట్ల వర్షంతో ప్రధాని పదవి రాహు బాబుకే అన్నట్తు రెచ్చిపోయారు.ఆఖరి నిముషాల్లో వెంకయ్య నాయుడు నోతి మాటగా కొన్ని హామీలు రాబట్టాడు గాబట్టి ఆంధ్రా ఈ మాత్రమయినా ధెమ్మాగా వుంది, లేకపోతే?నోటి మాటే తప్ప నికరమయిన హామీలు కాదని వొకవైపున యేదుస్తుంటే వాటికి కూడా వై మాకూ కావాలి అని పోటీకి తగులుకున్నారు, అవి కూడా రాకుండా చెయ్యటానికి!.
9.రెండున్నర జిల్లాలోళ్ళు అనే వంకర కూత వొచ్చినప్పుడే తెలివి తెచ్చుకుని జవాబు చెప్పకుండా ఆ మాట అన్నందుకా అన్నట్టు ప్రజాకవనీ మహాకవనీ మోసినందుకూ, ఇన్నేళ్ళ నుంచీ వుద్యమం యే తీరుగా జరుగుతుందో చూసి కూడా విబజన తప్పదని తెలుసుకోకుండా హైదరాబాదు ఆదాయంలో తమ న్యాయమయిన వాటా గట్టిగా అడగకుండా తెల్ల మొహాలేసుకుని చూసినందుకు ఆంధ్రోళ్లకి ఈ శాస్తి జర్గాల్సిందే గానీ ఈ రకంగా జరిగిన గందరగోళపు విభజన వల్ల తెలంగాణా కూడా నష్టపోతుందని యెంతమందికి తెలుసు?విభజనకి ముందు ప్రతిపాదించబడి నిర్మాణం మొదలయిన నీటి పారుదల ప్రాజెక్టులు యెన్నో వున్నాయి.వాటికి అప్పుడు అవిభక్త రాష్ట్రం నుంచి వచ్చినంత కేటాయింపులు ఇప్పుడు కొత్త రాష్ట్రం నిక్కచ్చిగా చెయ్యగలదా?ఇష్తం లేని వాళ్ళని పరిహారాలిచ్చి బయటికి పంపడానికీ,జరుగుతున్న పనుల్ని హఠాత్తుగా అపేసి తీరిగా మొదలు పెట్టటానికీ, ధారాళంగా యెక్కణ్ణించయినా సరే యెంత ఖర్చయినా సరే నని కరెంటు కొనడానికీ యెంత ఖర్చవుతుంది?ఇప్పుడు పంపకాలు పూర్తయ్యాక తెలంగాణా వార్షికాదాయం యెంత?వీటన్నింటికీ అయ్యే ఖర్చు ఆదాయాన్ని మించితే కొత్త ఆదాయ మార్గాలు యేమిటి?
10.ఈ ప్రశ్నల్లో వేటికయినా నికరమయిన జవాబు వుందా ముఖ్యమంత్రి గారి నుంచి గానీ ఇక్కడ బ్లాగుల్లో తిరుగుతున్న వీర తెవాదులకి గానీ?

ఆవిడెవరూ “విడిపోతే చాలు గుగ్గిళ్ళయినా తిని బతుకుదాం గానీ ఈ ఆంధ్రోళ్ళతో మాత్రం కలిసుండకూడదు” అనేసింది.ఆవిడ కేం ఖర్మ గుగ్గిళ్ళు తినడానికి?తండ్రీ భర్తా కోట్లకి పడగ లెత్తి వున్నారు!ముఖ్యమంత్రిగా శ్రీమాన్ కచరా గారు చేసే ఈ మహాద్భుత కార్యాల్ని చూసి సంబరంగా తెలంగాణా ప్రజలు తింటారు ఇనప గుగ్గిళ్ళు!!

» Posted By hari.S.babu On July 5, 2014 @ 5:17 pm
00

@jai
భాష పేరుతొ రాష్ట్రంలోని ప్రజలు వేరు చేయడం ఇకనయినా ఆగిపోతుందనీ
>>
భాష ప్రజల్ని వేరు చెయ్యడం అంటే యేమిటి?
>>
“తెలంగాణాలో ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, గోండీ, బంజారా తదితర భాషలు మాట్లాడేవారికి తగు స్థానం ” యే విధంగా లభిస్తుందో కొంచెం వివరంగా చెప్తారా?
>>
ఈ మాత్రం యెవరికి ఇష్టమయిన భాష వాళ్ళు మాట్లాడుకోవటానికి కూడా ఆంధ్రా వాళ్ళు అడ్డు పడ్డారా?మరి మీరు కొత్తగా రాసుకున్న రాష్ట్ర గీతం లో ఈ గంగా జమునీ తెహజీబ్ లేకుండా పాత తెలుగు వాసనే వేస్తుందేం?!

» Posted By hari.S.babu On July 4, 2014 @ 5:19 pm

ఆత్మహత్యే ఆకాంక్షగా
00

చదివాను.కంచె ఐలయ్య గారు కూడా యెన్నదూ లేనిది క్యామిడీకి దిగారంటే కాంగ్రెసు యెంత పిచ్చిపని చేసిందో తెలుస్తుంది.

» Posted By hari.S.babu On June 7, 2014 @ 11:38 am

ఒకరు దివ్యధాత్రి ఒకరు సరస్వతి
00

గతంలో తెలంగాణా వారు మహా భారత యుధ్ధంలో పాందవుల పక్షాన పోరాడారు, ఆంధ్రా వాళ్ళు కౌరవుల పక్షాన పోరాడారు అన్నారు కదా!

భారత ప్రభుత్వం చరిత్ర కు సంబంధించి మాపుల్ని కూడా ఉదహరించింది. వాట్ని ఆధారం చేసుకుని చూస్తే బహమని సుల్తానుల కాలంలో తెలంగాణా అని కనబడుతున్న భూభాగం వరంగల్, విజయవాడ, రాజమండ్రి కలిసిన సముద్ర తీర ప్రాంతంగా కనిపిస్తున్నది మరి?

బహమనీ రాజ్యం మ్యాప్:
http://mahabubnagar.tripod.com/bahamani_dynasty.htm

బహమనీ రాజ్యం విశేషాలు:
http://www.iloveindia.com/history/medieval-india/bahamani-kingdom.html

మహా జనపదాల మ్యాప్ :
http://forum.paradoxplaza.com/forum/showthread.php?577646-(MOD)-650-b.c.

శాతవాహనుల రాజ్యం మ్యాప్:
http://ideechadavamdi.blogspot.in/2013/08/blog-post.html

ఆ మహా భారత కాలంలో పాండవుల తరపున యుధ్ధం చేసిన వారి అనువంశికత ఇప్పుడు ఉన్నదా ఈనాటి తెలంగాణాలో? ప్రపంచంలో జాతులను గుర్తించటానికి మూడే మూడు ఆధారాలు.మొదటి కాలం తెగలుగా ఉన్నప్పుడు పుట్టుక కు సంబంధించిన కుదురు జాతిని నిర్నయించేది.భరత గణం తృత్స గణం – ఇలా.తరవాత మహా జనపదాలు వచ్చాక ప్రాంతం ఆధార మయింది: అంగ, వంగ, కళింగ – ఇలా.ఈ మహా జనపడాల్ని చూపంచే ఒక మాపులో తెలింగ అనే ప్రాంతాన్ని చూశాను.అది సముద్రతీరాన్ని తాకుతున్నది మరి?

ఈ దశ దాటిన తర్వాత అర్వాచీన కాలంలో ప్రపంచమంతటా ప్రాంతమే జాతిని నిర్ణయిస్తున్నది. భాష కూడా ఆ జాతి పేరుతోనే ఉన్నది. రష్యన్లు మాట్లాదేది రష్యన్ అనే దగ్గిర్నుంచి గుజరాతీలు మాట్లాడేది గుజరాతీ అనే వరకు.ఆధునిక కాలంలో ఒక్క తెలంగాణా వారికి తప్ప మిగతా ప్రపంచం లోని జాతు లన్నిటికీ ప్రాంతం, జాతి మరియు భాష అనే మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది,అవునా కాదా?

వారు విడగొట్టుకున్న ఈ నాటి భాగం రజాకారుల్ని జనం మీదకి వొదిలి ఈ దేశంలోనే కలవనని భీభత్సం చేసిన నిజాముకు సంబంధించిన హైదరాబాదు రాష్ట్రం కాదా?

» Posted By hari.S.babu On June 7, 2014 @ 3:57 pm
00

—ఆవునూ గోమాయువునూ ఒకే చోట?!

» Posted By hari.S.babu On June 7, 2014 @ 11:47 am

మాయామేయ జగంబె నిత్యమని
00

ఫాంటసీ అంటే అందుకే మనకి ఇష్టం. అందుకని మరీ పెద్దలు చిన్నలైపోవాల్సి రావడం మాత్రం యేమీ బాగా లేదు

» Posted By hari.S.babu On March 15, 2014 @ 12:41 pm

యాబై ఏళ్ల మూగమనసులు
00

మన తరానికి సంబంధించిన తీపి గుర్తులవి!ఇప్పటి వాళ్ళకి అవి యెలా ఉంటాయో తెలీదు. దేవదాసు మళ్ళీ తీస్తే దేవదాసు చంద్రముఖిని చేసుకున్నట్టూనో లేకపొతే పార్వతి లేచిపోయి వొచ్చేసి దేవదాసుని చేసుకున్నట్టుగానో తియ్యాలేమో?

» Posted By hari.S.babu On February 1, 2014 @ 10:41 am

డిటెక్టివ్ వెంకన్న కథలు
00

వావ్! మీరు అపన రచయితలు కూడానా? చిన్నప్పుడు కొన్ని సార్లు చదివాను. చాలా బాగుండేవి. ఒకప్పుడు వేమన పద్యాల్ని అసలు కవిత్వంగా గుర్తించని కాలమూ ఒకటుందేది. యేమయినా ఆ సాహిత్యానికీ మీరన్నట్టు పరమార్ధం ఉంది.నేరాలు లేని సమాజం కావాలంటే నేరాలు యెందూ జరుగుతాయో తెలుసుకోవటం. ఆ పని అపన సాహిత్యం సీరియస్గా చెయ్యడం మంచిదే.

మీకు నా శుభాభినందనలు!!

» Posted By hari.S.babu On November 3, 2013 @ 8:21 pm

విశ్వనాథ వాణి
00

really a genius can speak like that. real practicality in that openion. superb.

» Posted By hari.S.babu On October 10, 2013 @ 11:03 pm

విభజనలో మట్టి మనుషులు
00

hats off to common people.

» Posted By hari.S.babu On October 7, 2013 @ 11:13 am

ఇండియా హిందూ దేశమా?
00

అధాతో విశ్వ జిజ్ఞాసా అధాతో బ్రహ్మ జిజ్ఞాసా – అంటే ఈ విశ్వం గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నవంటే ఆ బ్రహ్మని గురుంచి తెలుసుకోవాలనుకుంటున్నావాన్నమాట. ఈ వైజ్ఞానిక దృష్టి వల్లనె భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినందుకు కోపర్నికస్ ని సజీవ దహనం చెయ్యడానికి ముందే వరాహ మిహిరుడూ ఆర్యభట్ట లాంటి వాళ్ళు గ్రహాలు గుండ్రంగా ఉంటాయనీ, భూమి, సూర్యుడూ, చంద్రుడూ తిరిగే అమరిక వల్లనే గ్రహణాలు యేర్పడతాయనీ చెప్పారు. మనలో ఉన్నతమైన విషయాల పట్ల ఆసక్తి ఉంటేనే ఇలాంటివి తెలుస్తాయి. సంపాదన తప్ప మరేదీ ఉన్నతంగా కనిపించక పోవటం అనె స్థితిలో ఉన్నాం మనం ఇవ్వ్వాళ.

» Posted By hari.S.babu On October 1, 2013 @ 6:37 am
00

నేను వేసిన కామెంటు ఒకటి పబ్లిష్ అవటం లేదు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల అది సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదేమో అని మళ్ళీ వేస్తే డూప్లికేటు కింద తిరస్కరించబడుతున్నది.దయ చేసి కారణాలు వివరించ గలరు.

» Posted By hari.S.babu On October 1, 2013 @ 6:35 am

అరుదైన అపురూప నాణెం
00

In my openion culturally we are not living in independent india when such things happened my stringency becomes much more deeper Still our educational system doesn’t change from macaualay times. Now e are living in a market economy dominated age, and our education follows macaulay’s cleck manufacturing factory. EEven East India company made a coin remembering rama. But our First Prime minister of India felt ashamed to be a hindu and calling the name of rama on public appearences. from him every body is carrying the same legacy.

» Posted By hari.S.babu On September 25, 2013 @ 11:44 am

కరచాలనరాగం- కీరవాణి
00

అదిరింది పద్యం. నేనెప్పుడూ అంతగా నవ్వలేదు ఈ మధ్యకాలంలో – అట్టహాసాలే!!

» Posted By hari.S.babu On September 24, 2013 @ 9:01 am

«« Back To Stats Page