Stats

Comments Posted By jonnalagadda markandeyulu

Displaying 1 To 9 Of 9 Comments

శ్రీశ్రీపై వివాదం
00

స్త్రీ అరణ్యరోదన లైంగిక ఇతివృత్తము
ఆంధ్రభూమిలో 1-9-14 దాసోజు లలితగారి వ్యాసము అరణ్యరోదనగా మిగిలిపోకూడదు. స్త్రీని లైంగిక కోణములో చూపుతున్న ఇతివృత్తాలుకు స్వస్తి చెప్పాలి. ముఖ్యంగా రచయితలు ఒక విషయం మరిచిపోతున్నారు. కావ్యము కావచ్చు, మరేదేని ఇతివృత్తము కావచ్చు. నీతిని బోధించకపోయినా పరవాలేదు. అవినీతిని మాత్రం ప్రబోధించకూడదు. శ్రీశ్రీ, చలంరచనలలో విచ్చలవిడితనం పురుషుడికిసహజకవచంలా భాసిల్లింది. అలాంటిదే స్త్రీదికూడా అనే చెప్పేమనస్తత్వం మన సమాజ పరిస్థితికి సరిపడలేదు. శీలమేముఖ్యముగ స్త్రీకిశిక్షలేవేశారు. స్త్రీని ఘోరావమానాలు పాలు చేస్తూ ఇతివృత్తాలు శీలంపేరిట అమెను వేశ్యగా ముద్రవేస్తాయి.శీలంకోల్పోవడముపురుషుడికుండదా?. లైంగికానందము స్త్రీపురుషులిరువురికీ కావాలి. భర్త అనుమతిస్తే సంతానవతి కావడానికి పరపురుష సంగమము అభ్యంతరము లేదని మన పురాణాలు చెబుతాయి. కర్ణుడివంటి గొప్ప కుమారుడిని పాండురాజు బ్రతికుండగా భర్తకు పరిచయం చేయలేకపోవడం భర్త అనుమతిలేని కన్యకుమారుడంటే అభ్యంతరముండకూడదు. భీష్ముడివంటి కొడుకునుశంతనుడువదులుకోగలిగాడు. మనం గగ్గోలు పెట్టే శీలాన్ని పోగొట్టుకుని వ్యాసభగవానుని జన్మకు కారణమైన గొప్ప స్త్రీసత్యవతి. ఆసంతానవతిని అంగీకరించి గాంగేయుని తండ్రి వివాహమాడాడు. కాని పంచభూతాలచేత సాక్ష్యం పలికించి శకుంతల దుష్యంతుడికి శీలాన్ని నిరూపించడం మనకు నచ్చలేదు. అభిజ్ఞాన శాకుంతలము పేరిట కవికులతిలకుడు ఈ పురుషాహంకారినికి మరింత నీరాజనం పట్టాడు. ఈశీలం గొడవ శాపముగా స్త్రీని బాధించే పరిస్థితులు మారటంలేదు. స్త్రీని అడవులపాలుజేసే రామరాజ్యం మనకిష్టము. బాపుబొమ్మల రమణులు ఆయన దర్శకత్వంలో సినిమాలలో అగ్నిప్రవేశము చేయలేదుకాని సీతపాత్రవంటి కష్టాలు పడ్డారని ఆనందించాము.ఆంజనేయుడిని భూమికి రప్పించి స్త్రీపాత్రలకు సానుభూతి చూపిన బాపూ రమణీయము కూడ సీత రావణమారిగానే కాక దశకంఠ రావణుని సంహరించడానికే రాముడిలా కారణజన్మురాలన్నఇతివృత్తాలజోలికి వెళ్ళి స్త్రీశక్తికి పూర్తి న్యాయం చేయలేక పోయారు. లైంగిక ఇతివృత్తాల గురించి కుటుంబసభ్యులు సిగ్గుపడడం మానేసిన నేటి టి.వి సీరియల్సులోని ఇతివృత్తాలు గురించి లలితగారు ప్రస్తావించలేదు. సభ్యసమాజము సిగ్గుపడేలా స్త్రీని రామాయణ విలన్ శూర్పణఖలా ఆకారంఅందంగా హృదయము వికారంగా స్త్రీకి స్త్రీయేశత్రువన్న రీతిగా చిత్రీకరిస్తున్నారు .ప్రేమించినవాడినితనను పెళ్ళాడేలా చేసుకోవడానికి పడేపాట్లు,సంసారాలుకూల్చేయత్నాలు,శిశుహింస జుగుప్సాకరం .ఏఆచారాలు,అనాచారాలు స్త్రీలపాలిటశాపమని భావించి ఉద్యమాలు జరిగాయో వాటికేప్రాముఖ్యమిస్తూ కథానాయికకు సమాజము నిరసించిన ఒకప్పటికష్టాలను చిత్రీకరించడమే లక్ష్యముగా స్త్రీకి ఏడుపే అలంకారముగ పైకికనపడని పురుషాహంకారము స్త్రీసమాజాన్ని అనాగరికజీవితానికి మళ్ళించే ప్రయత్నము,కుట్ర త్రిప్పికొట్టగలిగే స్థితిలో స్త్రీలులేరు. వ్యక్తులుగాకాదు. రచయితలుగా శ్రీశ్రీ, చలాల్ని చదవడం మరిచిపోకూడదు. స్త్రీ సానుభూతి పురుషాహంకారములో కూడ స్త్రీభోగవస్తువు అనే అభిప్రాయము మారలేదు. స్త్రీ మాత్రమె శీలము ఎందుకు కలిగిఉండాలనే దృక్ఫధకోణ అరణ్యరోదన. ప్రతిస్పందనకు స్త్రీలుతిరగబడి బోల్తాపడిన రచనా వికాసమే శ్రీశ్రీ, చలాల కలాలను విమర్శిస్తూ స్త్రీజాతిని వెక్కిరిస్తూ రచనలు చేస్తున్నాయన్నది. కళ్ళుమూసుకున్నా కనపడే నిజం. అదృశ్యదృశ్యకావ్యం.

» Posted By jonnalagadda markandeyulu On September 23, 2014 @ 1:51 pm

మోదీ ముబారక్
00

నూరుగొడ్లను తిన్న రాబందు ఒక గాలివానతొ సరి. అవినీతిపరుల పరాభవమును గురించినసామెతిది. అయెతే పర్యావరణ పరిరక్షణలో భాగంగ భగవంతుడు వాటికి సృష్టి స్థితిలయలు కల్పించాడని భావించడముకూడా ఉంది.అవినీతి ఉనికి తప్పనిసరి. వ్యాపారధోరణి లేదా ఆరోగ్యసూత్రముగ పాలల్లో నీరు కలుస్తున్నాయి..చిక్కదనముతో బాటు పాలరుచి చెడిపోయేకొలది కలిసిన నీళ్ళు పాలపోలిక ఉనికిని చాటాకా కేవలం పాలను వేరుచేయలేము. హంసకు మాత్రమే ఆ శక్తిఉంది. నీతి అవినీతి “పాలు నీళ్ళల్లా” కలిసిపోయాయి. వాటిని వేరుచేయగల శక్తి హంసఅనే చట్టానికి ఉంది. చట్టంతనపని తానుచేస్తుంది. అవినీతిపరులను వదిలేది లేదు. మంచిగతమున కొంచమేఅయినా స్వీకరిస్తానని చెప్పిన మోడి హంసన్యాయమును జీర్ణించుకున్న అజాతశత్రుత్వము మనము అలవరచుకోవాలి. ప్రజలు ఇందిరాగాంధిని తిరస్కరించారు. తెలుగువారి ఆత్మగౌరవప్రతినిధి రామారావును ఓడించారు. ఆయనను వెన్నుపోటు పొడిచాడని వెక్కిరించిన వ్యక్తికి అధికారయోగమును, పదవీచ్యుతిని సంవత్సరాలతరబడి రుచి చూపించారు. సోనియా భజనపరులను తలదించుకునేలా చేశారు. వీరందరి వెంట నడిచినవారిలో పాలునీరు న్యాయములా నీతిమంతులున్నారన్నది నిజం.మంచిని స్వీకరిస్తాననిమోది చెప్పారు. అరవైఆరు కళలలో దొంగతనము కూడా ఉంది. అదినీతి అనలేము. రామాయణ కావ్యకర్త వాల్మీకి గజదొంగ. ఋషి ప్రబోధముతో ఆదికావ్య నిర్మాత అయ్యాడు. జ్ఞానపీఠకవి మొదలు అనామకకవి వరకు వాల్మీకిని స్తుతించినవారే!కావ్యసుందరికి కావలసిన అలంకార భాష వాల్మీకినుంచి సంగ్రహించిన దొంగలమేనని ప్రశంసిస్తారు. దొంగకవిత్వముగ నిరాదరింపబడలేదు.ప్రజాస్వామ్యప్రజలు ఋషులు వంటివారు. నహుషునివంటి నూరుయజ్ఞాలను చేసిన వ్యక్తిని ఇంద్రునిగా చేసి పల్లకెమోసిన సహనముగలవారు. సహనము నశిస్తె శక్తిచూపించగలిగారు. ఆ ప్రజల వ్యక్తి ఆరాధన ఎంతసహజమో వ్యక్తిగతదూషణకూడ అంతే సహజము. చట్తము తనపనితనుచేస్తుంది. అజాతశత్రుత్వము సర్వులకు మేలు చేస్తుందన్నమోడి నిజమైన భారతీయాత్మ. అధికారముకోసం చేసేరాజనీతి కూడ వేలెత్తి చూపుతుందని చెప్పడమే నాఉద్దేశము.

» Posted By jonnalagadda markandeyulu On May 21, 2014 @ 11:33 am
00

మోడి విజయం
సార్వత్రిక ఎన్నికలలో నాగరికము-అనాగరికము మధ్యగలవిభజనరేఖ స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడ నాగరికమంటే పల్లె-పట్టణ వ్యత్యాస జీవితము కూడ తొంగి చూస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రెండు చోట్ల సమానమే! కాని సౌకర్యాలవిషయంలో పట్టణవాసులకున్న సుఖజీవనము పల్లెవాసులకు లేదు. ఐ.టి రంగ అభివృద్ధి జీతభత్యాలలో ఆయా సంస్థల ఉద్యోగులతో పోల్చుకున్నపుడు సామాన్యజీతము,జీవనముగల పల్లెపట్టణ గ్రామప్రాంతవాసులు ఐ.టి ప్రతిభకు జోహారు చేస్తారు తప్ప అది తగినవేతనము కాదని మాది అనాగరిక జీవనమని పోట్లాటకు దిగరు. కాని ఈ ఉద్యోగమునకింత అని స్థిరీకరణ వేతనవిధానములో కూడ ఉద్యోగస్థుల శ్రమవిధానము అవహేళనకు గురయింది. ఇంజనీరింగు, మెడిసిన్ చదువులే చదువులు?! మిగిలినవారి చదువులు, ప్రతిభ ప్రభుత్వ దయాధర్మ భిక్షంగా మారిపోయింది. కాంట్రాక్టు ఉద్యోగులుగ కూలిపని మాట్లాడుకునే భద్రతలేని ఉద్యోగాలయువతరం మామూలుడిగ్రీ, పోష్టుగ్రాడ్యుయేట్లుగ తగిన జీతముందా అని ప్రశ్నించుకోచడము కొంత నాగరికము,పూర్తిగా అనాగరికముకూడ. ఉద్యోగ, నిరుద్యోగ సంతృప్తి అసంతృప్తి మధ్య రాజీ అగాథంలా ఉంది. రాజీపడడంతప్పదు. ఇక మోతుబరి రైతులను ఆర్థికంగా ఉన్నతులని చెప్పలెము. కాని వ్యవసాయము తప్ప ఇతరము చేతకాని సామాన్య రైతు కూడ వ్యవసాయము దండగ అనే సూక్తిని వినవలసి వచ్చింది. మబ్బును నమ్మి చెరువులోని నీటిని ఖాళీ చేయించేలా మాట్లాడకూడదు. ముందుపాదము మోపిన తరువాతే భయంలేదని నిశ్చయించుకుని వెనకపాదము ఎత్తాలన్నది పంచతంత్ర నీతిగ ఆంధ్రప్రదేశ్ ను సింగపూరును మించిపోవాలని కోరుకుంటూనే తెలుగుదేశ విజయంలో అనాగరికము కూడ తమను గుర్తుచేసుకుని చేసిన వాగ్దానాలను స్వాగతించి ప్రయాణముచేయించింది. కానినిబద్ధతగల అభివృద్ధిమంత్రముగ మోడీ హవా నాగరిక అనాగరిక జీవనములో యువత ఊపిరిగ నిలద్రొక్కుకుంది.. శాస్త్రీయంగా ఎంతోముందుకు సాగాలి. చాయ్ అమ్మవలసివచ్చినా కృషి పట్టుదల గల అన్ని వర్గాల జీవన విధానము మోడి ఆదర్శముగ శుభము కోరుకుంటు హలాహలమువంటి ఒడిదుడుకులు అధిగమించగల ఆశాపూరిత జనతరంగమయింది. మోడి విజయము సర్వేజనా సుఖినోభవతు నమో మోడీగా చరిత్రసృష్టించాలి. భవిష్యత్తర యువతరము నాగరిక,ానాగరిక హామీలను నమ్మదు.పల్లెపట్టణసకలజనసమ్మోద అఖండ భారతముగ కష్టేఫలే సూక్తికి యువతరమిచ్చిన ఈవిజయములో సర్వేసర్వత్రా మోడి హలాహలమును వ్యాపింపజేయని శివుడై క్షీరసాగర ఉద్భవ అమృతకలశధారి ధన్వంతరిగ కనిపింపజేసిన మీభావలహరికి అభినందనలు

» Posted By jonnalagadda markandeyulu On May 19, 2014 @ 11:28 am

విశ్వనాథ వాణి
00

బొమ్మా బొరుసూ ఉన్నానాణేనికి చలామ ణిలో ఉంటేనే విలువ.కవికీ వ్రాతగాడికి ఎప్పుడూ తన రచన రమ్యంగానే అనిపిస్తుంది. బంగారు నాణెం చలామణి ని ఒక కాలం లో బొమ్మా బొరుసులు నిర్ణయించినా కాలంగడిచేకొలదీ విలువ ను అధికంచేసుకు ని బంగారమై మిగిలి మంచి చెడులతో నిమిత్తమవకుండా బంగారునాణెము మాత్రమె కాలాన్నిగుర్తుకు తెస్తుంది. బంగారంవంటి విలువలు లోకానికి అందించిన రచయిత విశ్వనాథకవి జ్ఞానపీఠ పలుకు నిత్యసత్యము .ప్రోత్సాహకముగ నిలుస్త్తాయి.

» Posted By jonnalagadda markandeyulu On October 11, 2013 @ 1:09 pm

నేటి కార్టూన్- ఆంధ్రజ్యోతి
00

రవిగాననిచో కవిగాంచును.కాని కార్టూనిష్టు చిత్రీకరించు కుంచె గాంచిన సజీవచిత్రము జనహృదయవాస్తవ ప్రతిబింబము. శేఖర్ గారికి అభినందనలు

» Posted By jonnalagadda markandeyulu On October 10, 2013 @ 10:09 am

అరుదైన అపురూప నాణెం
00

ఓట్ల రాజకీయ నాయకత్వమ్ ఎంత విజృంభించినా ప్రజలమధ్య సాంస్కృతిక అవగాహన విలువలకు పాలకులు విలువనివ్వా లన్న సందేశము సజీవ సాక్ష్య ముగ నాణెము అపురూపమై ఎవరు పాలించినా “మేరా భారత్’ మహాన్’ సత్యాన్ని పదిలపరిచి కలిగించిన అనుభూతి అక్షరజాలానికి అందడం మాటలలో చెప్పడం కష్టం.

» Posted By jonnalagadda markandeyulu On September 26, 2013 @ 8:00 am

ముందుమాట
00

ముందడుగు ప్రబోధమే అవుతుంది. ఆలోచించిగాని లేదా అనాలోచితంగాకాని అగాధం చేరాకా ముత్యాలే దొరుకుతాయి. నేలమీదకావచ్చు నీటిలోకావచ్చు దారిదోపిడీకి, మాంసాహరులకు భయపడితేఎలా? వలసపక్షులుకూడ స్థిరనివాసం కోరుకోకుండ నిరంతరప్రయాణం చేస్తూ ప్రబోధాన్నందిస్తున్నాయి.. వేటగాని వలలో చిక్కిన పావురాలు ఆరోపణలు మానుకుని శాంతిపావురాలై ఒక్కటై ఎగిరిమిత్రలాభాన్ని రచించిన నాయకత్వప్రబోధము ఎప్పుడూ గొప్పది. మిత్రవాక్యమెప్పుడూ ఆప్త వాక్యమే! ధన్యవాదములు.

» Posted By jonnalagadda markandeyulu On September 3, 2014 @ 12:57 pm
00

ముందుఅడుగు భూమి మీద ఆనితేనే వెనక అడుగు ముందడుగు అవుతుంది.
సమతల ప్రదేశంలో కూడా ఈ జాగ్రత్త అవసరము. వెనకడుగు ఆలోచింపజేయాలి.
విభజన ప్రయాణము ముందున్నది సమతల ప్రదేశమో అగాధమో తెలియదు.
ముందడుగు, వెనుకడుగు లేని అగాధం నూతికప్పకు పైరవీలు తెలిస్తేమంచిదే!
నూతిలోనే జీవితం సుఖం దానికలవాటు. ఉభయచరము గా నేలమీద ఉండగలదా?
అగాధమైన జల నిధిలోపడినా ఆణిముత్యాలశాల నిర్మించి సుఖించే శక్తితెచ్చుకోవాలి
ముందడుగు వేయాలన్నది మీ ప్రబోధమైతే స్వాగతించాల్సిందే!

» Posted By jonnalagadda markandeyulu On August 30, 2014 @ 4:53 pm
00

దశ, దిశ బాగోలేదని నూతిని మూసేస్తే సమాధికప్పల గోడు వినాలిగాని హేళనేల!
ఉద్యోగికి దూరభూమి, విద్వాంసునకు పరదేశము ఉండవు కవివర్యా!

» Posted By Jonnalagadda Markandeyulu On August 27, 2014 @ 2:43 pm

«« Back To Stats Page