Stats

Comments Posted By krishnaraohyd

Displaying 1 To 5 Of 5 Comments

మాధ్యమంలో అధమం
00

అధమ మాధ్యమాలలో మన తెలుగు ప్రైవేటు మీడియా చానళ్ళు ప్రథమం లో ఉంటాయని శాస్త్రి గారు సోదాహరణం గా వివరించారు. వారు వివరించిన విషయాలలో ఏమాత్రమూ అసంబద్ధము, అవాస్తవము లేవు. మనుషుల దగ్గర్నించి దేవుళ్ళు, దైవారాధన ప్రదేశాలు, దైవాంశ సంభూతుల వరకూ దేనినీ వదల కుండా, ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకుని, వాళ్ళ ప్రాచుర్యం (?) పెంచుకున్నారు(కుంటున్నారు). సున్నిత మైన మనస్సు గల సకల జనులందరినీ సైకో లు గా మార్చడానికి కంకణం కట్టుకున్న కఠోర కసాయిలయ్యారు. అన్నింటికీ వారి ఆశయం, ఆలోచన ఒక్కటే! తిట్టుకుంటూ అయినా తమ చానలే కోరుకుని, జారుడు మెట్ల పై అన్ని విధాలా అధోగతి చేరాలని. ఇలాంటి కుసంస్కార కనికట్టులకి అసలైన అంతం స్వతహా సొంతం చేసుకున్న సంస్కార సాన్నిహిత్యమే తప్ప,బలవంతాన రుద్దే చట్టప్రమేయం ఎప్పటికి తూతూ మంత్రం మాత్రమే.

» Posted By krishnaraohyd On July 3, 2014 @ 2:16 am

రెండు మహా రాష్ట్రాలు
00

నూతన రాష్ట్రానికి నవ్య తేజం నవ నవోత్సాహం కలిగించే ఎంచక్కటి ఆచరణీయ మైన ఆమని. ఇది సంకుచిత భావాలతో పొరుగు వారితో పోరి ఉన్న వారిని రెచ్చ గొట్టి సాధించుకున్న సొంత రాష్ట్ర వాసులకు విశాల దృక్పథం తో పరిణతి చెందిన పులకరింత లాంటి పలకరింత. నిస్వార్థ మైన నిజాయితీ కి నిలువెత్తు నీరాజనం, కన్నతల్లికి మాతృ భూమి కి సేవ చేసే సౌభాగ్యం కోసం సొంత లాభం సంపూర్తి గా మానుకుని అందించ బోయే అద్భుత ఆలింగనం.

» Posted By krishnaraohyd On May 21, 2014 @ 8:14 pm

ఒక తేజం కొండెక్కింది
00

ఇన్ని రకాల ఇంటర్వ్యూ లని చూసాం గాని కార్టూనింటర్వ్యూ ని ఫస్ట్ టైం చూస్తున్నా. చిక్కు ప్రశ్నలకి చకచకా మాటల కంటే పదునుగా బొమ్మలు చెక్కేసిన ఘనత కార్టూనిస్టు లకి మాత్రమే దక్కే అరుదయిన అవకాశం. దానిని అందం గా ఆనందం గా ఆకళింపు చేసుకున్న ఘనుడు శేఖర్. అటువంటి కళాకారుడికి హృదయ పూర్వక అశ్రు నివాళి.

» Posted By krishnaraohyd On May 21, 2014 @ 7:59 pm

లెజెండ్- చిత్రసమీక్ష
00

సినిమా బావుందా లేదా అన్నది ప్రేక్షకుడే తేల్చుకోవాలి కాని ఆ సినిమా చూడాలా వద్దా అన్నది వసుంధర గారి సమీక్ష చదివాకే అన్నది నా మట్టుకు నిజం. అది ఎలా అంటే – సినిమా రివ్యూ లకి కొంత వరుకు స్వాతి లో రాజా గారి రివ్యూ బావుంటుంది అనుకుంటే, వసుంధర గారి ఎంత వరుకూ అన్నది నేను ఎప్పటికీ తేల్చు కోలేను అన్నంత నిజం. సినిమా పత్రికల లోని రివ్యూ లు సర్క్యులేషన్ దిశ గా అభిమానులని ఆకట్టుకునే వైపు ఉంటాయన్నది నిర్వివాదం. కాని అక్షరజాలం లో వసుంధర గారి సమీక్షలు నిష్పక్షపాతం గానే కాక నిర్భయం గా నిజాయితీ గా వుంటాయి. దీనికి సర్క్యులేషన్ బాధ వీరాభిమాన వెర్రి వర్తించదు కనక. సినిమా బావుందో లేదో మేం నిర్ణయించుకుంటాం మీరు మీ తరహా లో మీ కాలాన్ని కత్తి లాగ అవసరం అయిన చోట అందమైన పూల గుత్తి లాగ వాడటం మానద్దు. అభినందనలు అందుకోండి.

» Posted By krishnaraohyd On May 3, 2014 @ 5:22 pm

హార్ట్ ఎటాక్- చిత్రసమీక్ష
00

సినిమా చూడటం ఒక ఎత్తు, చూస్తూ ఉన్నంత సేపూ అనిపించిన ఐడియాలు,అనుభవించిన ఆలోచనలు, సినిమా చూసి వచ్చాక, అదే క్రమం లో,అదే ఒరవడి తో అక్షర బద్ధం చేయటం ఇంకో అసలైన ఎత్తు. రచనా చదరంగం లో ఎలాంటి ఎత్తు నైనా చిత్తు చేయగల కత్తి వసుంధర గారి సొత్తు. అసలు సినిమా రివ్యూ ఎలా రాయాలో ఆది లో ముళ్ళపూడి వెంకట రమణ గారు రాసి రాసి, వాసి కెక్కారు. కాని ఈ డిజిటల్ యుగం లో సినిమా రివ్యూ రాస్తూ, పాటలు విని (కని) పిస్తూ రాయటం ఒక వైపు అయితే, సినిమా లోని మంచి ని మెచ్చు కోవటానికి వెనుకాడని విద్య తో పాటు, చెడు ని చెప్పడానికి వెరవని విజ్ఞత ఇంకో వైపు వున్న వున్న వసుంధర గారి కత్తి, కలాని కి మరో పేరు కదా. (హార్ట్ ఎటాక్)సినిమా ఎందుకు చూడాలో ఒక వేళ చూడ లేక పొతే లాభమో నష్టమో తేల్చు కోలేని సందిగ్ధత లో పడేసే దే సమీక్ష (రివ్యూ) అన్నది మరో సారి రుజువయ్యింది.
సమీక్ష చాలా బావుంది అన్న ఒక్క మాట రాసి వూరుకోలేని నా బలహీనత ని అర్థం చేసుకుంటే చాలు .

» Posted By krishnaraohyd On March 9, 2014 @ 2:11 pm

«« Back To Stats Page