Stats

Comments Posted By kslkss

Displaying 1 To 9 Of 9 Comments

నర నారాయణులెక్కడ?
00

క్రియా శక్తి చంద్రబాబు, మైనో భక్తి తత్పరుడు కిరణ్. మొక్కుబడిగా పాత్రోచిత్రంగా వ్రాసి ఇచ్చిన సంభాషణలు పలికిపొయిన గాలికోడి కొణిదన. చాణూర ముష్టికులు హనుమంతరావు, ఉత్తం కుమార్, ( ఎలెక్ట్రానిక్ దృశ్యమాధ్యమాల ఆధారంగా )

» Posted By kslkss On June 27, 2013 @ 11:05 pm

మిథునం- చిత్రసమీక్ష
00

ప్రస్థుతం సినిమాలలో పాత్రలు మానవత్వంతో ప్రవర్తించటం మృగ్యమైన సందర్భములో ఈ చిత్రం రావటం హర్షణీయం. ఎక్కువ తక్కువలను ప్రక్కన పెడితే మానవ సంబంధాలకు సామాన్య గ్రామీణ జీవనానికి అగ్ర తాంబూలమిచ్చి, మాటలలో, పాటలలో తెలుగుదనాన్ని నింపినవారందరు అభినందనీయులే. సంవత్సరమంటే అత్యాశ అవుతుందేమో, కనీసం రెండు సంవత్సరాలకైనా ఇటువంటి సినిమా వస్తే బాగుంటుందేమో ! సీతారామయ్యగారి మనవరాలు తరువాత ఈ చిత్రమే నన్ను ఆకట్టుకొంది. జాతీయ స్థాయిలోను, ప్రాంతీయ స్థాయిలోను ఉత్తమ చిత్రముగ గుర్తించి వారి సంస్కారమును నిరూపించుకొంటారని ఆశిస్తాను.

» Posted By kslkss On May 30, 2013 @ 11:23 pm

తెలుగు తోటలో కరుణశ్రీ
00

ఆనందానుభవం. శ్రీ శ్రీ లాంటి కవి, తను రచించిన పాటలో పతాక సన్నివేశఘట్టానికి కరుణశ్రీ గారి శివ ధనుర్భంగములోని పద్యాన్ని యధా తధముగ తీసికొనటం ఆ పద్యానికి పట్టాభిషేకము చేసినట్లు నేను భావిస్తున్నాను. శ్రీ శ్రీ గారి వినయానికి, కరుణశ్రీ గారి కవనానికి చెయ్యెత్తి జైకొట్టవలసినదే.

» Posted By kslkss On February 25, 2013 @ 11:40 pm

శుభాకాంక్షలు
00

ఆశించటం మనిషి బలం, బలహీనత. “కలలు కను, సాఫల్యం చేసికొనటానికి కృషి చెయ్యి” అన్నది భారత రాష్ట్రపతి (ఒకానొకప్పటి) సలహారూపములోని సందేశం. బలం బావుందని మెచ్చుకోవటం, బలహీనత దాన్ని విస్మరించటం. మార్పు సహజం. ఎప్పుడన్నది శేష ప్రశ్న. అతిత్వరలో అన్నది ఆశావహుల సమాధానం. ఆలోచింపజేసిన మీ భావన బాగుంది.

» Posted By kslkss On January 2, 2013 @ 12:36 am

డమరుకం
00

శ్రీనివాసరెడ్డి గారు హాస్యాన్ని నమ్ముకొంటేనే మంచిదని నా సలహా.

» Posted By kslkss On December 25, 2012 @ 12:36 am

బేతాళ కథలు
00

మీ భావనలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మహాత్ముని స్ఫూర్తి: భారతీయత గ్రామాలలోనే ఉన్నదన్నది పల్లెలలో విద్యాభ్యాసం, పల్లెలలోనే పండుగలు జరుపుకొనటం, పల్లెలలోనే జరుపోకోవాలని ఆరాటపడే వారి అనుభవాల అద్దాలలోనుండి చూస్తుంటే ప్రపంచీకరణ లాంటి శబ్దాలు వినటనికి, పరిణామాలు కనటానికి జుగుప్స కలుగుతోంది. దురదృష్టవశాత్తు, ప్రణాళికారచన, విదేశాలలో విద్యాభ్యాసం చేసిన వారి చేతులలోనికి పోవటం కఠోర సత్యం. ఈ నేపధ్యములో మీరు వ్రాసిన కధ సందర్భోచితముగా ఉన్నది. ఒక్కటే వర్తమానములోని అపశృతి. పాదయాత్రలలోని పరమార్ధం, పదవిని చేజిక్కించుకోవటం తప్ప కళ్ళ ఎదుట కనపదుతున్న కఠోర వాస్తవాలను గ్రహించి, చట్ట సభలద్వారా మూలాలలో మార్పులు తేవాలని కాదన్నట్లు చరిత్ర తెలియజేసిన నిజం.
మీ సమయానికి కృతజ్ఞతలు.

» Posted By kslkss On December 21, 2012 @ 11:06 pm
00

శ్రీమతి శ్రీదేవి గారు, మనసును చిన్నతపురోజులకు తీసుకెళ్ళారు. కధనం బాగుంది. ఒక వివరణ కోరవచ్చా? వసుంధర గారు చెప్పిన కోణంలో చూడటానికి విఫల ప్రయత్నం చేశాను. రచయిత్రిగా మీరు ఇప్పటి రాజకీయ/సామాజిక వ్యవస్తకు ఎలా అన్వయించారో తెలుసుకోవాలని భేతాళుని వలె నా బుద్ధికి అందుటలేదు. అభ్యంతరములేకపోతే వివరించ ప్రార్ధితులు.

» Posted By kslkss On December 18, 2012 @ 11:11 pm

కెమేరామన్ గంగతో రాంబాబు- చిత్రసమీక్ష
00

పవన్ కల్యాణ్ సంభాషణలు చెప్పే తీరు మూసలో పోసినట్లుంటై. అవి ఆయన అభిమానులకు నచ్చినా ఆయన నటునిగా ఎదుగుదలకు ఆటంకమని నా అభిప్రాయం. ఆంగికము, వాచికములో వైవిధ్యము చూపితే ఆయనలోని నట లక్షణాలు వ్యక్తమవచ్చు. సమస్యలు భావోద్రేకాలు రెచ్చగొట్టబడి పతాక స్థాయి చేర్చినప్పుడు ఇటువంటి కధలు, సంభాషణలు అగ్నికి ఆజ్యం పోస్తయ్యేమోనని ఒకటి పది సార్లు యోచించి తీస్తే అనవసరపు సంఘర్షణలకు తావుండదు. న బ్రూయత్ సత్యమప్రియం.

» Posted By kslkss On December 18, 2012 @ 11:33 pm

నీతి గీతలకు ఆవల
00

శ్రీ పి.వి. తెలుగు వాడు కావటం, గుంటూరు మిరపకాయలో కారం చచ్చినట్లే, తెలుగు వాడి తేజం మసకబారుతోంది. ఉత్తరానికి, దక్షిణం ప్రదక్షణాలు చేయటం, ప్రాణాచారాలు పడటం చరిత్ర చాటుతున్న వైనం, మినహాయింపు ద్రవిడులు. ఈ నేపధ్యంలో, మొగుడు ముండంటే అన్న చందముగా పి.వి గూర్చి తెలుగునాటే సద్భావన లేదు. అర్ధయుస్సు ముఖ్యమంత్రికి వాడ వాడలా బొమ్మలున్న రాష్ట్రములో, పి.వి.కి ఒక్క శిలావిగ్రహము కూడ కనీసం రాష్ట్ర రాజధానిలో లేకపోవటం గమనార్హం. తమిళనాట అన్నాదురై, ఎం.జి.ఆర్ విగ్రహాలు అడుగడుగునా కనపడతై. ఎం.జి.ఆర్ భారట రత్నముగా భాసిస్తాడు. ఎందుకంటే అతడు ఇందిరకు హితుడు. ఇది చాలు పి.వి కి రావలసిన గుర్తింపు రాక పోవటానికి గల కారణం.

» Posted By kslkss On July 9, 2012 @ 12:35 am

«« Back To Stats Page