సాహితీవైద్యం
రచన మాసపత్రికలో నిర్వహించబడుతున్న సాహితీవైద్యం శీర్షిక కథకుల ప్రయోజనానికి ఉద్దేశించబడింది. అక్షరజాలంలో ఈ శీర్షిక- మా అనుభవం, అవగాహనల ఆధారంగా, మా పరిమితులకు లోబడి సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియలకూ అంటే కథ, నాటిక, వ్యాసం, కవిత, టీవీ సంభాషణలు, సినిమా సంభాషణలు వగైరాలకి వేదిక కాగలదని ఆశిస్తున్నాం. విశ్లేషణకీ, ప్రచురణకీ రచనలు పంపేవారు వ్రాతప్రతుల్ని లేఖిని స్క్రిప్టులో టైపుచేసి పంపవలసి ఉంటుంది.
ప్రస్తుతం టీవీలో తెలుగు ఛానెల్సు చాలా ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి. అన్నీ తెలుగు సీరియల్సుకి ప్రాధాన్యమిస్తున్నాయి. ఎంతోమంది రచయితలకి వాటికి సంభాషణలు వ్రాసే అవకాశం రావచ్చు. టీవీ, సినిమా సంభాషణలకి మామూలుగా కథలకి వ్రాసినట్లు కాక, కాగితాన్ని సగానికి మడతపెట్టి వ్రాయాలి. మచ్చుకి అమ్మమ్మ.కాం సీరియల్ కోసం మేము వ్రాసిన మొదటి ఎపిసోడ్ సంభాషణల వ్రాతప్రతిని ఇక్కడ చూడగలరు. దర్శక నిర్మాతలు వీటిలో కొన్నింటిని మాత్రమే ఉపయోగించుకున్నట్లు సీరియల్ చూసినవారు గ్రహించగలరు.
ఈ నెల రచన మాసపత్రిక సాహితీవైద్యంలో- కథా కమామీషూలో ప్రస్తావించిన పేరులొ ఏముంది కథ, టూకీగా ప్రస్తావించిన ఆకునూరి మురళీకృష్ణ 3 కథల కొసం ఇక్కడ క్లిక్ చేయండి. chandraharam manvadena ninnu_ninnuga
ఇంకా ఈ శీర్షికలో విశేషాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.
darbha lakshmi annapurna said,
ఫిబ్రవరి 26, 2014 at 11:20 ఉద.
vasundharagaariki namaskaaramulu!
RACHANA PATRIKA AAGIPOYIMDANI TELISIMDI.ADE NIJAMAYITE CHAALAA BADHAAKARAMAINA VISHAYAM.
VIBHINNAMAINA ,MANOVISLESHANAATMAKA RACHANALANI AMDIMCHE PATRIKA RACHANA!
MUKHYAMGAA AMDULO VACHCHE SAAHITEE VAIDYAMLO MEE VISLESHANA ,SALAHAALOO,SOOCHANALOO MAALAAMTI RACHAYITALAKI EMTO PRAYOJANAKAARIGAA,MAMMALNI MEMU MERUGUPARACHUKUNEMDUKU DAARI CHOOPEVIGAA VUMDEVI!
వసుంధర said,
ఫిబ్రవరి 26, 2014 at 5:27 సా.
రచన పత్రిక ఆగిపోలేదు. మార్చి సంచిక విడుదలకు సిద్ధంగా ఉంది. మేము ఏప్రిల్ నెలకి సాహితీవైద్యం matter తయారీలో ప్రస్తుతం బిజీగా ఉన్నాము. ఐతే మార్కెటింగ్‌కి సరిన సంస్థ లభించక- ప్రస్తుతానికి కొంతకాలం అన్ని పుస్తకాల షాపులలోనూ లభించదు. చందాదారులకు ఎప్పటిలాగే లభిస్తుంది. ఈ విషయమై ఫిబ్రవరి సంచికలో ఒక ప్రకటన కూడా వచ్చింది. అది మీరు పూర్తిగా చదివితే విషయం తెలుస్తుంది. మీకు పత్రిక ఆగిపోయినట్లు చెప్పినవారికి ఈ విషయం చెప్పండి.
umadevi said,
జనవరి 6, 2014 at 10:34 సా.
మీరు అందిస్తున్న యీ సేవ విదేశం లొ వున్న మాకు సహకరిస్తుంది ..ధన్యవాదాలు .