తెలుగు సాహిత్యానికి విశిష్టసేవ చేస్తున్న వ్యక్తుల, సంస్థల, వెబ్సైట్ల వివరాలని అందజేసే ఈ వేదిక- తెలియనివారు తెలుసుకుందుకూ, తెలిసినవారు తెలియనివారితో పంచుకుందుకూ సహకరిస్తుందని ఆశిస్తున్నాం.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహణలో హైదరాబాదులో ఫిబ్రవరి 14-16 తేదీలలొ జరుగనున్న రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి అందరూ అహ్వానితులే. వివరాలకి ఇక్కడ క్లిక్ చేయండి
official-inviation-for-rendava-prapancha-telugu-sahithi-sadassu11
vfa-literary-club-enrollment-form11
సీపీ బ్రౌన్ అకాడెమీ- స్వాతి సపరివారపత్రిక సంయుక్త నిర్వహణలో జరిగిన కథల పోటీ ఫలితాలు స్వాతి 30-1-2009 సంచికలో వచ్చాయి. శ్రీ పసుపులేటి తాతారావు కథ “ఎక్కడో ఏదో” కి 25వేల రూపాయల ప్రథమ బహుమతి లభించింది. ఇంకా 3 కథలకి ద్వితీయ బహుమతులు, 5 కథలకి తృతీయ బహుమతులు, 6 కథలకి ప్రత్యేక బహుమతులు, 20 కథలకి సాధారణ బహుమతులు లభించాయి. విజేతలని అభినందిద్దాం. స్వాతిలో పోటీ కథల ప్రచురణకై ఎదురుచూద్దాం.
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా కథల పోటీ ఫలితాలు
స్వదేశాంధ్ర విజేతలు
మేరెడ్డి యాదగిరి రెడ్డి (కొలిమి)
అవసరాల రామకృష్ణా రావు (ముసుగు)
పి.వి. శేషారత్నం (మాయ సోకని పల్లె)
విదేశాంధ్ర విజేతలు
Nirlamaditya (గమ్యం లేని ప్రయాణాలు)
R. Sarma Danthurthi (గ్రక్కున విడువంగ వలయు)
నిర్వాహకులకి అభివందనాలు. విజేతలకు అభినందనలు. విజేతలు కానివారు తమ రచనలని వేరెక్కడైనా ప్రచురణకి పంపుకోవచ్చని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.