కథల మేస్టారుగా వాసికెక్కిన వాసి కథల రచయిత శ్రీ కాళీపట్నం రామారావు తాను కన్న కలలకిచ్చిన వాస్తవరూపం కథానిలయం. తెలుగులో అచ్చైన ప్రతి కథా ఒకచోట లభింపజేయాలనే సదాశయంతో ప్రారంభమైన ఈ సంస్థ శ్రీకాకుళం పట్టణంలో నెలకొల్పబడింది. పరిశోధనాభిలాష ఉన్నవారికి వరప్రదమనిపించేలా ఇప్పటికే ఇక్కడ చాలామంది రచయితల కథలు లభ్యమౌతున్నాయి. 2004లో తెలుగు అకాడమీ విడుదల చేసిన “తెలుగు కథాకోశం” (తెలుగు కథకుల గురించిన సమగ్ర సమాచారం లభించే గ్రంథం) కూర్పులో కథానిలయం కృషి-విలువ కట్టలేనిది. ప్రచురితమైన కథ ఒక్కటే ఐనా సంకోచించక- స్వీయ వివరాల్నీ, కథ జిరాక్సు కాపీనీ పంపవలసిందిగా కథానిలయం కథకుల్ని అభ్యర్ధిస్తోంది. వారికి సహకరించడం మన కర్తవ్యం. దేశ విదేశాల్లొ కథకులు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా దరఖాస్తు ఫారంఇక్కడ పొందుపరుస్తున్నాం. కథానిలయం వెబ్సైట్ www.kathanilayam.org నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ప్రముఖ రచయిత శ్రీ వివిన మూర్తి కథానిలయం నిర్వహణలో రామారావు మేస్టారికి తమ సహాయ సహకారాలందజేస్తున్నారు.
కథానిలయం అప్లికేషన్ ఫారం పిడిఎఫ్
వివరాలకు:
కథా నిలయం
సూర్యా నగర్ Extension విశాఖ బ్యాంకు “A” కాలనీ
శ్రీకాకుళం 532 001 ఫోన్: 08942 – 220069