నవంబర్ 22, 2008

సి.పి. బ్రౌన్ అకాడెమీ

Posted in Uncategorized at 9:59 ఉద. by వసుంధర

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఇక్ఫాయ్) అనే విద్యాసంస్థ ద్వారా ఏర్పరచబడిన ఆల్ఫా ఫౌండేషన్- స్వచ్ఛంద సేవాసంస్థగా అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టింది. తెలుగు భాష, సంస్కృతీ వికాసాన్ని ప్రోత్సహించే సదుద్దేశ్యంతో ఈ ఫౌండేషన్ 2007లో సి.పి. బ్రౌన్ అకాడెమీని స్థాపించడం ముదావహం. సలహామండలిలో ప్రముఖ రచయితలు, సాహితీపరులు ఉన్న ఈ అకాడెమీ ముఖ్యోద్దేశ్యాలు: తెలుగువారి పిల్లలకి తమ భాషా, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని తెలియజెప్పి తెలుగు భాషాజ్ఞానం పెంచుకొనగోరేవారికి సులభ సరళ బొధనా ప్రణాళికలు ఎర్పరచడం, తెలుగులో మంచి సాహిత్యాన్ని అందించగల రచయితలని ఎంపికచేసి ప్రోత్సహించడం,  తెలుగు భాషలో ఉన్న అన్ని పుస్తకాలు, పత్రికలు, పరిశోధనా గ్రంథాలు సేకరించి కంప్యూటరీకరణ చేయడం; ఒక బృహద్గ్రంథాలయం ఏర్పరచి, తెలుగువారందరికీ అందుబాటులోకి తేవడం. వీరి వెబ్‌సైటు: www.cpbrownacademy.org.

ఈ సంస్థ ఇప్పటికే నవ్య వారపత్రికతో కలిసి ఒక కథల పోటీ, ఒక నవలల పోటీ నిర్వహించింది. ప్రస్తుతం స్వాతి వారపత్రికతో సంయుక్తంగా మరో కథల పోటీని  ప్రకటించింది. ముగింపు తేదీ: డిసెంబరు 15, 2008. వివరాలు స్వాతి వారపత్రికలో లభ్యం.

చిరునామా: 408, నిర్మల్ టవర్స్, మెగాసిటి నం. 200, ద్వారకాపురి కాలనీ, పంజాగుట్ట,

హైదరాబాద్- 500 082
ఈ మెయిలు:
info@cpbrownacademy.org

అవగాహన సదస్సు
 

3 వ్యాఖ్యలు »

  1. […] సి.పి.బ్రౌన్ అకాడెమీ […]

  2. సమాచారం బాగుందండి,కానీ వివరాలకు మరలా స్వాతి వారపత్రిక ను చూట్టం ఎందుకు? అవీ మీరే ఇవ్వొచ్చు కదా!తెలుగు వారు నివసిస్తున్న చాలా చోట్ల అన్ని తెలుగుపత్రికలు లభించవు కదా?
    http://www.vizagdaily.co.cc/

    • ప్రకటన పత్రికకి సంబంధించినది. పోటీకి కథ పంపాలంటే ఎలాగూ ఇండియాలో ఉన్నవారి సాయం కావాలి కాబట్టి మేమిచ్చిన సమాచారం సాయం కూడా మిగతా వివరాలు తెలుసుకుందుకు సాయపడుతుంది. పూర్తి వివరాలు మేమేఇస్తే పత్రిక అభ్యంతరపెట్టొచ్చు.


Leave a Reply

%d bloggers like this: