డిసెంబర్ 22, 2008

కన్యాశుల్కము

Posted in పుస్తకాలు at 10:35 ఉద. by kailash

మహాకవి గురజాడ అప్పరావు గారి ప్రముఖ నాటకం “కన్యాశుల్కము” మొట్టమొదటిసారిగా టీవీ కోసం 42 పాత్రలతో దాదాపు 8 గంటల ప్రదర్శనగా వచ్చింది. తెలుగుజాతి గర్వించతగ్గ కళాఖండాలు కాలదోషం పట్టకుండా రేపటి తరానికి నిక్షిప్తం చేసే బృహత్తర కార్యక్రమానికి నాంది ఇది. ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు గిరీశంగా నటించిన ఆ టీవీ సీరియల్ ఛాయాచిత్రాలతో, తెలుగు సామాజిక రంగాలలో తమదైన కృషి చేసిన కొందరు ప్రముఖుల స్పందనలతో అందించిన పూర్తి నాటక గ్రంథమిది. రచన: మహాకవి శ్రీ గురజాడ అప్పారావు పంతులు గారు. ముఖచిత్రం & పుస్తక రూపకల్పన: క్రియేటివ్ లింక్స్. ప్రచురణ, ప్రతులకు: కళాతపస్వి క్రియేషన్స్, లలితా మహల్, 10/7 ఎ, అన్నై సత్య నగర్, మెయిన్ రోడ్, రామాపురం, చెన్నై 600089 (ఫోన్: 044-22491939) లేక థర్డ్ ఫ్లోర్, నేతాజీ భవన్, హిమాయత్ నగర్, హైదరాబాద్ 500029 (ఫోన్: 040-55738890, 55738871). వెల: 170 రూపాయలు ($13). ప్రతులు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ కూడా లభిస్తాయి.

Leave a Reply

%d bloggers like this: