డిసెంబర్ 22, 2008

పుస్తకం హస్తభూషణం. మస్తక మథనం. ఈ పుస్తకాలు మీరు చదివారా? కాళీపట్నం రామారావు రచనలు

Posted in పుస్తకాలు at 10:31 ఉద. by kailash

అభిమానులు “కథల మేస్టారు” గా పిల్చుకునే కారా మేస్టారి వ్యక్తిగత, సామాజిక, సాహిత్య జీవిత నేపధ్యాన్ని ఆరు కాలాల విభాగంగా సూచనప్రాయంగా వివరించిన పుస్తకమిది. ఒక రచయిత సమగ్ర రచనాపాటవాన్ని , రచనాకాలం ప్రామాణికంగా , ఒకే పుస్తకంగా తేవడం తెలుగులో ఇదే ప్రథమమనీ, బహుశా ఇతర భారతీయ భాషలకూ ఇదే ప్రథమం కావచ్చుననీ అంటారు ప్రకాశకులు. వివిన మూర్తి, రచన శాయి సంపాదకత్వం, చంద్ర ముఖచిత్రం వన్నె తెచ్చిన ఈ అపూర్వ గ్రంథాన్ని స్వంతం చేసుకోవడం కథని అభిమానించేవారి బాధ్యత. తెలుగునాట సంచలనం సృష్టించిన “యజ్ఞం” కథతో సహా ఎన్నో ఆసక్తికరమూ, ప్రయోజనాత్మకమూ ఐన విశేషాలనిముడ్చుకున్న ఈ పుస్తకం విలువ paperbackగా 150, hardaboundగా 300 రూపాయలు. ప్రోగ్రెసివ్ పబ్లికేషన్స్ (205, అమీర్ మహల్ అపార్ట్‌మెంట్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ 500029) ప్రచురించిన ఈ పుస్తకం ప్రతులు హైదరాబాద్‌లో విశాలాంధ్ర బుక్ హౌస్, నవోదయా బుక్ హౌస్ వారివద్ద లభిస్తాయి.

5 వ్యాఖ్యలు »

  1. bonagiri said,

    ఈ మధ్యనే బెంగుళూరు పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం కొన్నాను.
    ఇంకా అన్ని రచనలూ చదవలేదు.
    ఆయన వ్రాసిన “కుట్ర” కథ ఎప్పుడో ఆంధ్రజ్యోతిలో చదివి ఆయన అభిమానినయ్యాను.


Leave a Reply

%d bloggers like this: