వసుంధర అక్షరజాలం

పోటీల కబుర్లు

స్వాతి మాసపత్రిక నిర్వహించిన పోటీలో మంథా భానుమతి
నవల ‘మౌనంగానే ఎదగమనీ…’కి అనిల్ అవార్డ్ వచ్చింది. విజేతకు అభినందనలు. ఈ నవలను స్వాతి జూన్ 2009 (విడుదల మే 1) సంచికలో నవలానుబంధంగా చదువుకోవచ్చు. 
స్వాతి వారపత్రిక నిర్వహించిన ప్రతిష్ఠాత్మక “పదహారు వారాల సీరియల్” పోటీ ఫలితాలు మే 8 సంచికలో వచ్చాయి. ఎంపికైన 7 సీరియల్స్:
ప్రాజెక్ట్ భూభవ (పోడూరి కృష్ణకుమారి)
ఆరు నెలలు ఆగాలి (పి.ఎస్. నారాయణ)
అందమైన తుపాన్ (ఆకునూరి హాసన్)
మిస్టర్ సత్తిబాబు (సి.ఎస్. రాయుడు)
అజ్ఞాతపర్వం (ఖలందర్)
మాయ (నండూరి శ్రీనివాస్)
రశన (ఎ. శ్రీధర్) 
విజేతలకు అభినందనలు.
C.P. Brown-స్వాతి వారపత్రిక సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి కథల  పోటీలో బహుమతి పొందిన రచనల ప్రచురణ స్వాతి ఏప్రిల్ 10 సంచికలో ప్రారంభమైంది. వారానికొక్కటిగా వస్తున్న ఈ కథలపై విశ్లేషణకోసం జూన్ (2209) రచన (సాహితీవైద్యం) మాసపత్రికనుంచి చూడగలరు. స్వాతి కామెడీ కథల పోటీ బహుమతి రచనల ప్రచురణ ఏఫ్రిల్ 24 సంచికలో మొదలైంది. వీటివి, ఇంకా ఇతర బహుమతి కథల విశ్లేషణ కూడా అదే సంచికలో చూడగలరు.

Exit mobile version