మే 14, 2009

హాస్యవనం-2

Posted in పుస్తకాలు at 9:12 సా. by kailash

జీవితంలాగే హాస్యమూ షడ్రుచుల సమ్మేళనం. 38 వివిధ ప్రముఖ, ఔత్సాహిక రచయిత(త్రు)ల హాస్యకథా సమ్మేళనం హాస్యవనం-2. ఈ సంకలనాన్ని తెలుగు పాఠకులకు- “విరోధి” ఉగాది పచ్చడిగా- అందిస్తున్నారు- శ్రీమతి కె. వసంతా ప్రకాష్. మచ్చుకి ముళ్ళపూడి, గొల్లపూడి, ఆదివిష్ణు, మల్లాది, వేదగిరి, శ్రీరమణ, వంగూరి వంటి సుప్రసిద్ధ సమకాలీనులున్న ఈ పుస్తకంలో కందుకూరి రాజకుమారి వంటి ఔత్సాహికులూ ఉన్నారు. ఔత్సాహికులో, సుప్రసిద్ధులో తెలియని పేర్వారం, వసుంధర, పి. చంద్రశేఖర ఆజాద్, కె.బి. లక్ష్మి ప్రభృతులూ  ఉన్నారు. అట్టమీద బాపు-రమణల నవ్వించే బొమ్మ (కార్టూన్). అట్టవెనుక బాపు-రమణలు నవ్వుతున్న బొమ్మ.
ప్రతులకు: Ms. K. Vasanta Prakash
43/21, NarsimgaraoPet
Karnool 518 004 (Ph: 08518222712  Mobile: 9392616234). లేదా అన్ని విశాలాంధ్ర పూస్తక విక్రయ కేంద్రాలలోనూ కూడా లభిస్తుంది.
వెల: రూపాయల్లో 150, డాలర్లలో 10.
హాస్యవనం మొదటి భాగం పరిచయాన్ని ఈ నెల (మే 2009) రచన మాసపత్రిక (సాహితీవైద్యం)లో చూడవచ్చు. హాస్యవనం-2 చదివినవారు తమ అభిప్రాయాలనిక్కడ పొందుపర్చితే సంతోషం.

Leave a Reply

%d bloggers like this: