మే 22, 2009

తెలుగులో టీవీ సీరియల్స్

Posted in టీవీ సీరియల్స్ at 1:26 సా. by kailash

టీవీల్లో వచ్చే తెలుగు సీరియల్సు సాహిత్యపరంగా విలక్షణమైనవి. మా దృష్టికి వచ్చిన కొన్ని సీరియల్సుని క్రమంగా ఇక్కడ విశ్లేషించగలం. మీ స్పందన ఆశిస్తున్నాం.

4 వ్యాఖ్యలు »

 1. లక్ష్మీ గాయత్రి said,

  అసలే చూడలేక చస్తుంటే వాటి మీద విశ్లేషణ ఒకటా అన్న ప్రశాంత్ గారి బాధ ఎంత న్యాయమైందో, సమకాలీన వినోదాల్ని వితర్కించుకోవాలన్న మీ అభిప్రాయమూ అంత విలువైనదే. అందుకే నా అభిప్రాయాన్ని రాయాలనిపించి ఇలా రాస్తున్నాను. ఈ మధ్య టీవీ సీరియల్ అన్న మాట వినేసరికల్లా బాపు కార్టూన్ ఒకటి గుర్తొస్తోంది…ఆ కార్టూన్ లో తెర మీద హీరొయిన్ పాలు తాగబోతూ ఉంటుంది. టీవీ చూస్తున్న ప్రేక్షకురాలు ఇవతల నుంచి “ఆ పాలు తాగకే పిచ్చి ముండా..చచ్చిపోతావ్” అంటూ వెర్రెత్తిపోయి అరుస్తుంది. అంటే ఆ సీరియల్ లో అత్తగారు కోడలికి విషం కలిపిన పాలు ఇచ్చిందన్న మాట. అది తెలియని కోడలు వాటిని తాగబోతోంది. ఆ కార్టూన్ లో బాపు చెప్పినట్టు ప్రేక్షకులు టీవీ సీరియల్స్ చూస్తూ నిజంగానే అంత వెర్రీ ఎత్తిపోతున్నారు. ఎందుకో తెలుసా…నా ఉద్దెశ్యం లో అది కేవలం స్లో మోషన్ ప్రతిభ మాత్రమే. అరగంట నడిచే ఒక సీరియల్ లో కధ కేవలం ఐదు నిమిషాల నిడివిలో మాత్రమే ఉంటుందంటే అది అతిశయోక్తి ఏమీ కాదు. అత్తగారు పాలు పది నిమిషాలు కలుపుతుంది. వాటిని మరో పది నిమిషాల పాటు దిక్కులు చూస్తూ నెమ్మదిగా నడుస్తూ తెచ్చి ఇస్తుంది. కోడలు చెయ్యి జాచి పాల గ్లాసు అందుకోవడానికే ఒక రెండు నిమిషాలు పదుతుంది. అంత సేపూ ప్రేక్షకుడు (రాళ్లు) సస్పెన్స్ తో నలిగిపోతూ ఉంటారు. కోడలు ఆ పాలని తాగుతుందా తాగదా..తాగితే మళ్లీ ఆస్పత్రి సీనుతో మరో ఐదు వారాలు తేలిగ్గా గడిచిపోతాయనుకోండి. వాస్తవానికి నేటి టీవీ సీరియల్స్ ని గెలిపిస్తున్నది నూటికి తొంభై పాళ్లు ఈ స్లో మోషనే. ఉన్న మాట నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఇది ప్రేక్షకుల మీద ఒక రకమైన హిప్నాటిక్ ప్రయోగం. సీరియల్ లో కధా బలాన్నీ ఈ స్లో మోషన్ నీ తూకం వెస్తే రెండోదే కిందకి దిగుతుంది. అవునంటారా…మీ అభిప్రాయం చెప్పండి.

  • మందిలో పడినప్పుడు ఒకోసారి మన ఆలోచనలపట్ల మనకే అవగాహన ఉండదు. టీవీ సీరియల్సునైనా చెత్త సినిమాలనైనా అవహేళన చేయడం ఆ కోవకు చెందినదే! నోటిమాటలకి అక్షరరూపమిచ్చినప్పుడే విమర్శ సహేతుకమై మన అవగాహనని పెంచుతుంది. అక్షరజాలం అటువంటి ప్రక్రియలకు వేదిక. కోట్ల జనాన్ని ప్రభావితం చేస్తున్న టీవీ సీరియల్సుని- సరైన దారికి మళ్లించడంలో ఇది “ఉడతాభక్తి” ప్రయత్నమైనా కాగలదని ఆశ. త్వరలో మరికొన్ని విశ్లేషణలు మానుంచి వస్తాయి. ఇతరులు కూడా పాల్గొంటే సంతోషం.

 2. ప్రశాంత్ said,

  ముందే రబ్బరు లా సాగుతున్న వాటిని విష్లెశ్లెషించడం న్యాయమా?…మీరు మా పై కరుణయుంచి టీ.వీ సీరియళ్ళు కాకుండా నాటకాలని విశ్లెషించమని సవినయంగా కోరుతున్నాను

  🙂

  • అసలే చూడలేక చస్తుంటే వాటిమీద విశ్లేషణ ఒకటా అన్న మీ వ్యధలో న్యాయముంది. కానీ ఇప్పుడు టీవీ సీరియల్సు చాలామందికి సమకాలీన జీవితంలో అంతర్భాగమైపోయాయి. వాటిపట్ల ఉదాసీనత చూపక- మంచిచెడ్డల్ని వితర్కించడంలో ప్రయోజనముందని భావించడం ఈ విశ్లేషణకి కారణం. అక్షరజాలం సమకాలీన విజ్ఞాన, వినోద- సాహిత్య విశేషాల store house కావాలని కూడా మా ఆశయం. మీవంటివారి స్పందన అందుకు ఎంతో ప్రయోజనం.
   మేము నాటకాభిమానులమే ఐనా, మాకు నాటకాలు చూసే అవకాశం తక్కువ. చూసినప్పుడు మా భావాలు మీతో తప్పక పంచుకోగలం. మీవంటివారు మంచి సమకాలీన నాటకాలను పరిచయం చేస్తే సంతోషం.
   వసుంధర


Leave a Reply

%d bloggers like this: