జూన్ 3, 2009
స్వాతి వారపత్రికలో సరసమైన కథల పోటీ
1. నిడివి 8 అర ఠావులు.
2. కథాంశం శృంగారం. ఐతే శృంగారం మితి మీరకూడదు.
3. ఐదువేల రూపాయల చొప్పున ఆరు కథలకు బహుమతులు.
4. హామీ పత్రం జతపర్చాలి.
5. ముగింపు తేదీ జూలై 11, 2009.
6. కథలు పంపాల్సిన చిరునామా: సంపాదకుడు, స్వాతి సపరివారపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట, పోస్ట్‌బాక్స్ 339, విజయవాడ 520 002.
7. పూర్తి వివరాలకి స్వాతి సపరివార పత్రిక చూడండి.
Sarath 'Kaalam' said,
జూన్ 16, 2009 at 2:52 ఉద.
నేను మెటా ఫిక్షన్ టెక్నిక్ తో వ్రాసిన ‘ఎవరు?’ నవలను ఏ పోటీకి పంపించలేదుకానీ చతుర మాస పత్రికకు పంపించాను. ఫిబ్రవరి 2006 చతుర సంచికలో వచ్చింది. మీకు ఆసక్తి వుంటే మీ సైటులో పెట్టవచ్చును. ఆ నవల సాఫ్ట్ కాపీ లింక్ ఇస్తున్నాను:
http://www.geocities.com/sarath.films/Evaru.pdf
ఓ రచయిత said,
జూన్ 5, 2009 at 11:08 ఉద.
వసుంధర గారూ,
అన్ని వారపత్రికల్లో పడుతున్న కధలపోటీ వివరాలను సేకరించి, ఒకే సైటులో పెట్టడమంటే సామాన్యమైన పని కాదు.
చాలామంది రచయితలకి ఎంటో ఉపయోగపడే ప్రయత్నం.
ఈ పని చేస్తున్నందుకు, మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
వసుంధర said,
జూన్ 6, 2009 at 7:49 ఉద.
మీ స్పందనకు ధన్యవాదాలు.
ఎక్కడెక్కడి రచయితలూ పాల్గొంటే పోటీ అర్థవంతమౌతుందని మా ఉద్దేశ్యం. అందుకు మా ఎరికలోకి వచ్చిన వివరాలు తెలియబరుస్తున్నాం. మీరు కూడా మీకు తెలిసిన వివరాలు అందజేసి సహకరించగలరు. పోటీలో బహుమతి పొందిన కథలెలా ఉంటాయో తెలుసుకోగొరేవారికి కావాలంటే మచ్చుకి మా బహుమతి కథలను సైట్లో అందించగలం. ఇతర రచయితలు కూడా అలాంటి తమ కథలను సైట్లో ప్రచురించడానికి అనుమతిస్తే సంతోషం.
వసుంధర