Site icon వసుంధర అక్షరజాలం

జూన్ 6, 2009

జూన్ 6, 2009
* ఎన్నికల అనంతరం రాజకీయ సన్యాసం చేయాలనుకున్న అల్లు అరవింద్‌కి బావ చిరంజీవి చేసిన గీతోపదేషం “చిరు గీత”. పరిస్థితిని సమతూకంగా విశ్లేషిస్తూ ప్రముఖ కాలమిస్టు “పాత్రికేయ”- నవ్య వారపత్రిక 10-6-2009 సంచికలో- “ఫన్నీరు”గా అందించిన- హాస్య, వ్యంగ్య రచన “చిరుగీత”ని రసహృదయులైన పాహకులు తప్పక చదివి ఆనందించాలి.
* బాల సాహిత్యంలో ఎంతో కృషి చేస్తూ జనసామాన్యానికి సుపరిచితులు కాని రచయితల వివరాలను క్రమంగా అక్షరజాలంలో పొందుపరుస్తున్నాం. చందమామకు వెన్నెముకగా భావించబడే దాసరి సుబ్రహ్మణ్యం గారి పరిచయం కొన్నాళక్రితం “మన కథకులు” శీర్షికలో అందించాం. తాజాగా అందించిన డి. కె. చదువుల బాబు, గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడు వివరాలకోసం అదే శీర్షికలో చూడగలరు.
* ప్రముఖ రచయిత ఎమ్మెస్వీ గంగరాజు “తరాలూ-అంతరాలూ” పేరిట బరంపురం మారెళ్ళ వారి వంశవృక్షం వివరాలతో ఒక పుస్తకం ప్రచురించారు. “వంశవృక్షంలో కొమ్మకొమ్మకీ చెందినవారి జీవితవిశేషాలు, ఛాయాచిత్రాలు సంపాదించిన ఆ భగీరధప్రయత్నాన్ని” ప్రశంసిస్తూ- “ఆ పుస్తకం మారెళ్ళవారి కుటుంబసభ్యులకే కాక, సామాజిక పరిణామాలపట్ల జిజ్ఞాస కల ప్రతి ఒక్కరికీ ఉపకరిస్తుందని” కాళీపట్నం రామారావు అంతటివారు అభినందించారు. ఈ తరహా ప్రయత్నం చేయదల్చుకున్న వారందరూ తప్పక చదవాల్సిన ఈ పుస్తకం ప్రతులు లభించే చిరునామా: M.S.V. Gangaraju, Sadananda Vihar, Gusani Nua Gaon, Barampuram (Ganjam) 760 003. Orissa. Phone: 0680- 2401709. మరిన్ని వంశవృక్షాలకు ఈ పుస్తకం ప్రేరణ కాగలదని నమ్మకం, కావాలని ఆశ.  
* www.edulent.net లో flat forum ఇంగ్లీషు బ్లాగులో సమకాలీన ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థపై  వసుంధర వ్యాఖ్యలు చూస్తున్నారా? ఇటీవలి విశ్లేషణ మన ఎన్నికల ఫలితాలనూ, ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులనూ, స్పీకరుగా మీరా కుమార్ ఎన్నికనూ స్పర్శించింది. మీ విలువైన స్పందనకై ఎదురు చూస్తున్నాం.

Exit mobile version