జూన్ 12, 2009

నవలల పోటీ

Posted in సాహితీ సమాచారం at 11:34 ఉద. by వసుంధర

సి.పి. బ్రౌన్ అకాడమీ-స్వాతి సపరివారపత్రిక సంయుక్త నిర్వహణలో
స్వాతి రజతోత్సవ సీరియల్ నవలలపోటీ
ప్రథమ బహుమతి లక్ష రూపాయలు
ద్వితీయ బహుమతి రూ. 75,000
రెండు తృతీయ బహుమతులు ఒకొక్కటి రూ. 50,000 చొప్పున.
1. ప్రపంచంలొని ఏ ప్రాంతమైనా నవలకు నేపధ్యం కావచ్చు. అయితే అది తెలుగువారికి సంబంధించినదై ఉండాలి.
2. అరఠావు సైజులో 25 లైన్లతో 350 పేజీలకు మించకుండా కాగితానికి ఒకే వైపున వ్రాసి పంపాలి.
3. రచయిత(త్రి) పేరు వ్రాతప్రతిపై కాక విడిగా ఉండాలి.
4. అముద్రితమనీ, అనువాదం కాదనీ హామీపత్రం జత చేయాలి.
5. ప్రచురణకు స్వీకరించని నవలలు తిప్పి పంపడానికి తిరుగు స్టాంపులు అతికించిన కవరు జతపర్చాలి.
6. నవలలు పంపవలసిన చిరునామా: స్వాతి రజతోత్సవ సీరియల్ నవలల పోటీ, ఎడిటర్, స్వాతి సపరివారపత్రిక, అనిల్ బిల్డింగ్స్, పొస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002.
7. ముగింపు తేదీ: ఆగస్టు 20, 2009.

Leave a Reply

%d bloggers like this: