నవంబర్ 26, 2009
ఈటీవీ కార్యక్రమాలు
ఝుమ్మంది నాదం-2: సినిమా సంగీతానికి సంబంధించిన ఈ కార్యక్రమం రెండవ విడతలో బాలమురళీకృష్ణ వంటి అసమాన వాగ్గేయకారులను, బాలసుబ్రహ్మణ్యం వంటి విశిష్ట సినీగాయకులను పరిచయం చేయడం మెచ్చుకోతగ్గ విషయం. స్వరబద్ధమైన చక్కని గొంతుతోపాటు, అందమైన ముఖానికి చెరగని చిరునవ్వుని అద్దిన సునీత సమక్షం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చింది. ఐతే యాంకరుకుండవలసిన సమయస్ఫూర్తి లోపించడం, సందర్భానుసారం కాని చిరునవ్వు, భావప్రకటనలో కృత్రిమత్వం, సృజనాత్మకత లేక మూసలో కొనసాగిన సంభాషణలు- వేరెవరైనా యాంకరు ఉంటే కార్యక్రమానికీ, అతిథులుగా విచ్చేసిన సినీ సంగీత ప్రముఖులకీ మరింత న్యాయం చేకూరేదనిపించింది. ఈ సందర్భంగా సంగీత కార్యక్రమాలకి హిందీలో సోనూ నిగమ్, సచిన్- తెలుగులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభృతులు పెట్టిన ఒరవడి గమనార్హం. చివరి అతిథి సునీత కావడంవల్ల యాంకరుగా వచ్చిన ఎస్పీ శైలజ- కార్యక్రమాన్ని సహజంగా రక్తి కట్టించిన తీరు హృద్యంగా ఉంది. ఏది ఏమైనా ఈ కార్యక్రమం రూపొందించిన సునీత, ప్రసారం చేసిన ఈటీవీ అభినందనీయులు.
పాడుతా తీయగా: గతంలో ఈటీవీ ద్వారా ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమానికి కొనసాగింపుగా నవంబరు 23 నుంచి ఝుమ్మందినాదం స్థానంలో ప్రారంభమైన పాడుతా తీయగా కార్యక్రమం కేవలం యంకరింగుకోసం కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమం నిర్వహించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బహుముఇఖ ప్రజ్ఞల్లో యాంకరింగూ ఒకటి.
bonagiri said,
నవంబర్ 29, 2009 at 3:48 సా.
నిజమే బాలు గారి లాంటి సంస్కారవంతమైన ఏంకర్లు చాలా అరుదు.
హిందీలో అమితాబ్ కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు.
మిగతా చాలామంది ఏంకర్లు అతి తెలివి ప్రదర్శిస్తూ పోటీదారులని ఆటపట్టించడం, అవమానపరచడం, గేలి చేయడం చేస్తూ తామేదో గొప్పవాళ్ళమనుకుంటారు.
santoshpotu said,
నవంబర్ 28, 2009 at 2:33 సా.
kaani kotha padutha teeyaga kotha hangulatho baagaane vundi
వసుంధర said,
నవంబర్ 28, 2009 at 9:11 సా.
కొత్త పాడుతా తీయగా బాగుండడమే కాదు. జనాకర్షణతో పాటు మిగతా రియాలిటీ షో లకి భిన్నంగా సహజ సోయగంతో మరింత అర్థవంతంగా కొనసాగుతుందన్న ఆశను కలిగిస్తూ ఆరంభమైంది. వేచి చూద్దాం.