డిసెంబర్ 30, 2009
చిన్నతనం లేని చిన్నతనం (పెద్దలకోసం)
ఒకప్పుడు వౄద్ధుల్ని గౌరవించడం మన సంప్రదాయం. అ సంప్రదాయం ఇప్పటికీ ఉంది కానీ నేటి యువతకి పెద్దల్ని గౌరవించడం మాటటుంచి ఆదరించడానికే సమయం లేదు. అందుకే మన దేశంలో వృద్ధాశ్రమాలు కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ అక్కడ వారికి ఆశ్రయమే తప్ప జీవితం లేదని చాలామంది అభిప్రాయం. వృద్ధులు స్వేచ్ఛ, స్వతంత్రం, గౌరవం, స్వాభిమానాలతో జీవించడానికి శ్రీమతి ఎన్. ఎమ్ రాజేశ్వరి ఒక పథకాన్ని రూపొందించారు. ఆ వివరాలు తెలుగులో ఇక్కడా, ఆంగ్లంలో flatforum.wordpress.com లోనూ అందజేస్తున్నాము. వివరాలకు ఆమెను సంప్రదించవచ్చు. నచ్చినవారు ఈ పథకం గురించి ప్రచారం చేయవచ్చు లేదా తామూ అనుసరించి అమలు పర్చవచ్చు.
రాజశేఖరుని విజయ్ శర్మ said,
డిసెంబర్ 30, 2009 at 9:21 సా.
చాలా చక్కగా ఉంది ఈ పద్ధతి. అభినందించ దగినది. మీ ప్రయత్నం మరికొంతమందికి ఆదర్శంగా నిలవాలనిఆభిలషిస్తున్నాను.