జనవరి 1, 2010

జయహో

Posted in Uncategorized at 1:20 ఉద. by వసుంధర

ఈ శతాబ్దంలో మొదటి దశాబ్దం నేటితో ముగియనుంది.
ఈ కాలంలో ఎన్నో వింతలు-విడ్డూరాలు, అర్థాలు-అనర్థాలు, సాధనలు-విషాదాలు, అద్భుతాలు-ఘోరాలు వగైరాలు జరిగాయి. వాటిలో వారి వారి అభిరుచులు, మనోభావాలను బట్టి కొంత మంచి కొంత చెడు ఉండొచ్చు. కానీ ప్రపంచం మాత్రం ముందుకు దూసుకుపోతున్నదనడంలో సందేహం లేదు. 
ఆసియా దేశాలు ఇండియా, చైనాల ఆర్థిక పురోగతి- అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నిక- ఆర్థిక సంక్షోభం నుంచి తేరుకుంటున్న ప్రపంచ దేశాలు-
ఈ దశాబ్దానికి వీడ్కోలు చెప్పేముందు జయహో అంటున్నాయి.
రాజకీయాలతో సహా వివిధ రంగాల్లో ప్రపంచపు తీరుతెన్నుల్ని- రాజకీయాలకు అతీతంగా ముచ్చటించే చర్చా వేదిక కావాలన్న ఆశయంతో ప్రారంభించిన ఈ అక్షరజాలం కూడా ఈ దశాబ్దానికే చెందుతుంది. ఇది ఇంకా తప్పటడుగుల దశలోనే ఉన్నా తప్పుటడుగుల దిశకు మళ్ళనివ్వమని మనవి చేస్తూ-  ఈ దశాబ్దానికి వీడ్కోలు చెబుతున్నాం.

Leave a Reply

%d bloggers like this: