జనవరి 3, 2010
శుభహో
కొత్త శతాబ్దాన్ని పదేళ్లు పాతబరుస్తూ ఓ దశాబ్దం వెళ్లిపోయింది. నిండు నూరేళ్ల శతాబ్దాన్ని బాలారిష్టాలనుంచి బయటపడేసి- నూత్న యౌవన దశకు సన్నద్ధం చేసే కొత్త దశాబ్దానికి నాందిగా 2010 వచ్చింది.
తప్పటడుగులు వేసినా ముందుకే వెడుతున్నాం. సంతోషం. కలిసి నడుద్దామనుకోవడం లేదు. అంత సంతోషం కాదు.
సదుపాయాలు, సంపాదన పెరుగుతున్నాయి. సంతోషం. అసహనం, స్వార్థం పెరుగుతున్నాయి. అంత సంతోషం కాదు.
విజ్ఞానం- జ్ఞానం సరిహద్దుల్ని చెరిపేస్తోంది. సంతోషం. సంస్కారం- సభ్యత సరిహద్దుల్ని చెరిపేస్తోంది. అంత సంతోషం కాదు.
ప్రపంచమంతా ఒక్కటౌతోంది. సంతోషం. ఒక్క తాటిమీద నడవనంటోంది. అంత సంతోషం కాదు.
ఈ సంతోషం మహాప్రస్థానాన్ని మనమంతా కలిసి వీక్షిద్దాం, సమీక్షిద్దాం, పరీక్షిద్దాం, నిర్దేశిద్దాం.
కొత్త సంవత్సరానికి అక్షరజాలం శుభాకాంక్షలు.
Leave a Reply